Videos

‘యానిమల్‌’ ట్రైలర్‌ విడుదల

‘యానిమల్‌’ ట్రైలర్‌ విడుదల

ఇంటర్నెట్‌డెస్క్‌: రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), రష్మిక (Rashmika) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘యానిమల్‌’ (Animal Trailer) ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. రణ్‌బీర్‌ కపూర్‌పై చిత్రీకరించిన యాక్షన్‌ సీక్వెన్స్‌లు.. ఎమోషనల్‌ సీన్స్‌.. సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. మరోవైపు, ట్రైలర్‌పై సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సందీప్‌రెడ్డి వంగా మేకింగ్‌ స్టైల్‌ అదరహో అంటూ మెచ్చుకుంటున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z