Business

ఫైర్‌ఫాక్స్‌ వినియోగదారులకు కేంద్రం కీలన సూచన

ఫైర్‌ఫాక్స్‌ వినియోగదారులకు కేంద్రం కీలన సూచన

మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ (Mozilla Firfox) యూజర్లకు కేంద్రం కీలన సూచన చేసింది. కంప్యూటర్‌, ట్యాబ్‌, మొబైల్‌లో ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్‌ ఆఫ్ ఇండియా (CERT-IN) ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌లో లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. వీటి వల్ల డేటా చౌర్యం, మాల్‌వేర్‌ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఫైర్‌ఫాక్స్‌లోని ఈ లోపం కారణంగా సైబర్‌ నేరగాళ్లు బ్రౌజర్‌లోకి ఆర్బిటరీ కోడ్‌ను ప్రవేశపెట్టి యూజర్ల అనుమతి లేకుండా డివైజ్‌లలో నిషేధిత వెబ్‌సైట్లను ఓపెన్‌ చేయడం, ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం చేస్తారని హెచ్చరించింది. దాంతోపాటు బ్రౌజర్‌లో యూజర్లు ఓపెన్‌ చేసే వెబ్‌సైట్ల భద్రతా వ్యవస్థలను దాటుకుని వాటిలో నిషేధిత సమాచారాన్ని అప్‌లోడ్ చేస్తారని వెల్లడించింది. ఫైర్‌ఫాక్స్‌ 120.0 కన్నా ముందు వెర్షన్‌ ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ అప్‌డేట్ చేసుకునేందుకు.. ముందుగా బ్రౌజర్‌ ఓపెన్‌ చేసి కుడివైపు మూడు గీతలపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్‌ చేస్తే సెట్టింగ్స్ కనిపిస్తాయి.

సెట్టింగ్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే మరో వెబ్‌పేజ్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో కిందకు స్క్రోల్‌ చేస్తే ‘ఫైర్‌ఫాక్స్ అప్‌డేట్స్‌’ అనే సెక్షన్‌లో మీరు ఉపయోగిస్తున్న బ్రౌజర్‌ వెర్షన్‌ కనిపిస్తుంది.

ఒకవేళ మీ బ్రౌజర్‌ ఫైర్‌ఫాక్స్‌ 120.0 కన్నా ముందు వెర్షన్‌ అయితే పక్కనే ఉన్న ‘వాట్స్‌ న్యూ’పై క్లిక్‌ చేసి బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z