Politics

ఫిబ్రవరి 18 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం

ఫిబ్రవరి 18 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం

రాష్ట్రంలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. భారాస ఎమ్మెల్యేగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి 2024 జూన్‌ 8 లోపు ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నందున ఓటర్ల జాబితాను రూపొందించే ప్రక్రియకు శ్రీకారం చూడుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఏడాది నవంబరు ఒకటిని కటాఫ్‌ తేదీగా నిర్ణయిస్తూ కొత్త ఓటర్ల జాబితాను రూపొందించేందుకు షెడ్యులును ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 30న(శనివారం) ఓటర్ల జాబితాకు నోటీసు జారీ చేయనున్నారు. ఫిబ్రవరి 18 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. ఫిబ్రవరి 21న ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి అదే నెల 24వ తేదీ నాడు ప్రచురిస్తారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 14వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. మార్చి 29న వాటిని పరిష్కరించి, ఏప్రిల్‌ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z