DailyDose

చిలుకూరులో నేడు మహాద్వార దర్శనం

చిలుకూరులో నేడు మహాద్వార దర్శనం

కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు.. చిలుకూరు బాలాజీ ఆలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు మహాద్వారం వద్ద నుంచే భక్తులకు దర్శన సౌకర్యం కల్పించాలని ఆలయ అర్చకులు నిర్ణయించారు. ఈ సోమవారం బాలాజీ దర్శనానికి 1.30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. గర్భగుడిలోకి అనుమతిస్తే చాలా సమయంపట్టే అవకాశం ఉండటంతో మహాద్వారం(లఘుదర్శనం) నుంచే దర్శనాలు చేపట్టాలని తలపోశారు. 108 ప్రదక్షిణాలు సైతం నిలిపివేసేందుకు నిర్ణయించారు. కిలోమీటరు దూరంలో ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశం నుంచి భక్తులు కాలిబాటనే ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. నాలుగు క్యూలైన్లలో లోపలికి పంపించనున్నారు. సైబరాబాద్‌ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుండగా ఆర్టీసీ అధికారులు సైతం సర్వీసుల సంఖ్య పెంచనున్నారు. ఆదివారం సాయంత్రం మొయినాబాద్‌ ఠాణా ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్‌ యాదయ్య చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌తో మాట్లాడారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z