Business

7వందల కోట్లకు పైగా మద్యం విక్రయాలు

7వందల కోట్లకు పైగా మద్యం విక్రయాలు

నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. నాలుగు రోజుల వ్యవధిలో మొత్తం రూ.770 కోట్ల మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరఫరా అయింది. సాధారణంగా కొత్త ఏడాది రాక సందర్భంగా పెద్దఎత్తున మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. ఈ అంచనాల మేరకు దుకాణదారులు బేవరేజస్‌ కార్పొరేషన్‌ నుంచి సరకు కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో డిసెంబరు చివరి నాలుగు రోజులైన 28, 29, 30, 31 తేదీల్లో అన్ని దుకాణాలు, బార్లకు కలిపి రూ.770 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగింది. ఇందులో చివరి రెండు రోజుల్లోనే రూ.463 కోట్ల వ్యాపారం జరిగింది. సాధారణంగా రాష్ట్రంలో నెలకు రూ.2,500 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. కానీ ఈ నాలుగు రోజుల్లోనే నాలుగోవంతు విక్రయాలు జరిగాయంటే ఏ స్థాయిలో తాగారో అర్థం చేసుకోవచ్చు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z