Business

శుభవార్త చెప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ

శుభవార్త చెప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ

సంక్రాంతి పండుగకు సొంత ప్రాంతాలకు వెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ సంక్రాంతికి ఆర్టీసీ అధికారులు అదనపు ఛార్జీల్లేకుండా ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఆర్టీసీ వసూలు చేయనుంది. సంక్రాంతి కోసం 6795 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. జనవరి 6 నుంచి 18 వరకూ స్పెషల్ బస్సులను నడపనున్నారు. ప్రయాణీకుల రద్దీ ఎక్కువ కావడంతో నియంత్రించడానికే స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంక్రాంతికి పండుగ రద్దీ దృష్ట్యా పొరుగు రాష్ట్రాలకు కూడా ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడపనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ వెబ్‌సైట్, టికెట్ బుకింగ్ కేంద్రాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం కల్పించనున్నారు. రానుపోను టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి 10 శాతం రాయితీ సౌకర్యం ఆర్టీసీ కల్పించనుంది. 10 నుంచి 13 వరకూ అన్ని సాధారణ సర్వీసులు రిజర్వు అయ్యాయని అధికారులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z