DailyDose

2023 నాటికి జాతీయ రహదారుల పొడవు ఎంత పెరిగిందో తెలుసా?

2023 నాటికి జాతీయ రహదారుల పొడవు ఎంత పెరిగిందో తెలుసా?

నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి దేశంలో జాతీయ రహదారుల పొడవు (National Highways Length) 60 శాతం పెరిగింది. 2014లో 91,287 కిలోమీటర్లుగా ఉండగా.. డిసెంబర్ 2023 నాటికి 1,46,145 కి.మీలకు చేరుకుంది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు వరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI).. టోల్‌ రూపంలో రూ.18,450 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు.

నాలుగు, అంతకంటే ఎక్కువ లేన్లు ఉన్న జాతీయ రహదారుల పొడవు 2014లో 18,387 కి.మీల నుంచి 2023 డిసెంబర్‌ నాటికి రెండున్నర రెట్లు పెరిగి.. 46,179 కి.మీలకు చేరుకుంది.
హై-స్పీడ్ కారిడార్‌ల పొడవు 2014లో 353 కి.మీ కాగా, 2023 నాటికి 3,913 కి.మీలకు పెరిగింది. రెండు లేన్ల కంటే తక్కువ ఉన్న హైవేల పొడవు 30 శాతం నుంచి 10 శాతానికి తగ్గింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13,814 కి.మీల మేర కొత్తగా హైవేలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. డిసెంబర్ వరకు 6,217 కిలోమీటర్లు పూర్తి చేశారు.
2014 నుంచి 2023 నాటికి సంబంధిత శాఖ ఆధ్వర్యంలో రహదారుల నిర్మాణ వ్యయం 9.4 రెట్లు పెరిగి రూ.3.17 లక్షల కోట్లకు చేరుకుందని అంచనా.
వాహనాల తుక్కు విధానం కింద దేశంలో 44 స్క్రాపింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు 49,770 వాహనాలను తుక్కుగా మార్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z