DailyDose

మొయినాబాద్ మర్డర్ కేసు కీలక మలుపు-నేర వార్తలు

మొయినాబాద్ మర్డర్ కేసు కీలక మలుపు-నేర వార్తలు

* మొయినాబాద్ మర్డర్ కేసు కీలక మలుపు

హైదరాబాద్‌ నగర శివారు మొయినాబాద్‌లో యువతి మృతి కేసు మలుపు తిరిగింది. ఈ ఘటన ఆత్మహత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మల్లేపల్లికి చెందిన తైసీల్ (22).. రెండు రోజుల కింద ఇంటి నుంచి ఒంటరిగా వచ్చి పెట్రోల్ లేదా డీజిల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టు గుర్తించారు. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతి.. ఇప్పటికే 2-3 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. ఇంట్లో గొడవపడి ఒకట్రెండు రోజుల్లో తిరిగి వచ్చేదని, ఈసారి అలాగే జరుగుతుందని భావించి ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు తల్లిదండ్రులు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది.హబీబ్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌పై సీపీ ఆగ్రహం..ఈ కేసులో హబీబ్‌నగర్ పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఇన్‌స్పెక్టర్‌పై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 8 నుంచి తైసీల్‌ కనిపించకుండా పోగా, 10న యువతి సోదరుడు అజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. దీంతో విషయం తెలుసుకుని సీపీ పీఎస్‌కు వెళ్లారు. ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోనున్నారు.

* బైక్‌పై వెళ్తున్న వ్యక్తులపై గొడ్డలితో దాడి

నిర్మల్‌(Nirmal) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బైక్‌(Bike)పై వెళ్తున్న ఇద్దరిపై గుర్తు తెలియని దుండగులు గొడ్డలి(Axe)తో దాడి చేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి(Man died) చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ విషాకదర సంఘటన నిర్మల్‌ పట్టణంలోని బంగల్‌పేట్‌ జంగల్‌ హనుమాన్‌ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ఈ దాడిలో బుచ్చన్న(55) అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం దుండగులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

* ప్రజలకు బిగ్ అలర్ట్

9346188819తో కాల్ వస్తే అప్రమత్తంగా వ్యవహరించాలని నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి అన్నారు. పోలీసుల పేరుతో 9346188819 నెంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దని ఆయన సూచించారు. తమ బంధవులు హాస్పిటల్‌లో ఉన్నారని, ఫోన్ పేలో డబ్బులు పంపితే ఒక గంటలో పోలీసు కానిస్టేబుల్‌తో పంపిస్తానంటూ ఫోన్ చేస్తారని, జాగ్రత్త ఉండాలని తెలిపారు. తెలిసిన వారికి మాత్రమే ఫోన్ పేలో డబ్బులు పంపించాలని, అపరిచిత వ్యక్తులకు అసలు పంపించవద్దని సూచించారు. ఈ తరహాలో ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు 14 సైబర్ కేసులు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు కాగా అందులో 5 కేసులు నంద్యాల జిల్లాలో డోన్, ఆత్మకూరు, చాగలమర్రి, గడివేముల, బనగానపల్లె తదితర ప్రాంతాల్లో నమోదైనట్లు తెలిపారు.ఎవరైనా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతే 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉందని ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి తెలిపారు. మోసపోయిన వారు అధైర్య పడకుండా నేషనల్ సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in/ ద్వారా సైబర్ క్రైమ్ గురించి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. లేకుంటే నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ ఆఫీస్‌కు వచ్చి గానీ, 9154987034 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

* హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య

హన్మకొండ జిల్లాలోని ఎస్‌ఆర్‌ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. బీఎస్సీ అగ్రికల్చర్‌ విద్యార్థిని దీప్తి హాస్టల్‌ రూమ్‌లో సూసైడ్‌ చేసుకుంది. ఇక, ఆమె ఆత్మహత్యకు ప్రేమ, పరీక్షల ఫలితాలే కారణమని తెలుస్తోంది.వివరాల ప్రకారం.. హన్మకొండలోని ఎస్‌ఆర్‌ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్‌ చదువుతున్న దీప్తి ఆత్మహత్య చేసుకుంది. అయితే, దీప్తి తన క్లాస్‌మేట్‌ వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు తోటీ విద్యార్థులు చెబుతున్నారు. కాగా, ఇటీవలే వీరి మధ్య గొడవలు కావడం, ఇటీవల వచ్చిన పరీక్ష ఫలితాల్లో ఒక్క సబ్జెక్ట్‌లోనే పాస్‌ అవడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో దీప్తి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇక, ఆమె ఆత్మహత్య యూనివర్సిటీలలో కలకలం సృష్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

* నిర్మాణ సంస్థ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

ప్రముఖ నిర్మాణ సంస్థ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోదాలు చేశారు. (IT Raids) భారీగా పన్నులు ఎగవేసినట్లు గుర్తించారు. లెక్కల్లో చూపని రూ.1500 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. భూటానీ ఇన్‌ఫ్రా, గ్రూప్ 108, అడ్వెంట్, లాజిక్స్‌ నిర్మాణ గ్రూపు సంస్థలు భారీగా ఆదాయపు పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుమారు 250 మంది ఐటీ అధికారులు 40 బృందాలుగా ఏర్పడ్డారు. మహాకాల్‌ పేరుతో రైడ్స్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. నాలుగు నిర్మాణ సంస్థల కార్యాలయాల్లో ఆరు రోజులపాటు సోదాలు జరిపారు. లెక్కల్లో చూపని సుమారు రూ.1500 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.కాగా, భూటానీ గ్రూప్ ఉద్యోగులు దాచిన రెండు పెన్ డ్రైవ్‌లను ఐటీ అధికారులు కనుగొన్నారు. ఆ కంపెనీకి భారీ మొత్తంలో డబ్బు అందిన సమాచారం అందులో ఉంది. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఆ గ్రూప్ మొత్తం రూ. 429 కోట్ల నగదు పొందినట్లు వివరాలున్నాయి. 2019 నుంచి మూడేళ్లలో రూ. 595 కోట్ల నగదును భూటానీ గ్రూప్ ఆమోదించినట్లు పెన్ డ్రైవ్‌లోని డేటా ద్వారా ఐటీ అధికారులు తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ఆ సంస్థ ఉద్యోగుల స్టేట్‌మెంట్లను రికార్డ్‌ చేశారు. పన్ను ఎగవేత హమీతో భారీగా ప్రకటనలు ఇవ్వడంతోపాటు పెట్టుబడిదారులు, బ్రోకర్లకు ఖచ్చితమైన క్యాష్ రిటర్న్‌లు అందించినట్లు ఐటీ అధికారుల దర్యాప్తులో బయటపడింది.

* సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో దారుణం

కర్ణాటక చిక్కబళ్లాపూర్‌లోని ఓ హాస్టల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పాపకు జన్మనిచ్చింది. ఈ వ్యవహారంలో హస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో బాలిక ఎనమిదో చదువుతుండగా హాస్టల్లో చేరింది. అయితే, ఆ అమ్మాయికి పదో తరగతి అబ్బాయితో సంబంధం ఉంది. వాళ్లిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, పాఠశాల చదువు పూర్తయిన తరువాత బాలుడు తన బదిలీ సర్టిఫికేట్ (టీసీ) పొంది బెంగళూరుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే బాలిక హస్టళ్లో ఉండకపోయేదని, తరుచూ బంధువుల వద్దకు వెళ్లేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కృష్ణప్ప మాట్లాడుతూ.. చాలా రోజుల నుంచి చిన్నారి హాస్టల్‌కు రావడం లేదన్నారు. బాగేపల్లి పట్టణంలోని కాశాపురానికి చెందిన ఆమె కడుపు నొప్పితో బాధపడుతూ.. ఆసుపత్రికి వెళ్లిందని తెలిపారు. దీంతో ఆమెను వైద్యులు పరీక్షించగా గర్భం దాల్చిందని తెలిసిందని పేర్కొన్నారు. ఈ మేరకు బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసి అతడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.