Movies

‘థగ్‌ లైఫ్‌’ అనే చిత్రంలో నటిస్తున్న కమల్‌హాసన్‌

మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న కమల్‌హాసన్‌

యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు అన్బరివ్‌ (అన్బుమణి, అరివుమణి) దర్శకులుగా మారుతున్నారు. ఈ ద్వయం… కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఆయన 237వ చిత్రానికి దర్శకత్వం వహించనుంది. కమల్‌హాసన్‌ శుక్రవారం సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. దక్షిణాదితోపాటు… బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలకి యాక్షన్‌ కొరియోగ్రాఫర్లుగా పనిచేసి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు అన్బరివ్‌. ‘‘ఇద్దరు ప్రతిభావంతులు వారి కొత్త అవతారంగా నా 237వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాస్టర్స్‌ అన్బరివ్‌లకు మా రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌కి తిరిగి స్వాగతం పలుకుతున్నా’’ అంటూ ఎక్స్‌ ద్వారా సందేశాన్ని పంచుకున్నారు కమల్‌హాసన్‌. ఈ చిత్రాన్ని కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ తమ రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. కమల్‌ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్‌ లైఫ్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z