NRI-NRT

గల్ఫ్ దేశాల్లో చిగురుమళ్ల యాత్ర

గల్ఫ్ దేశాల్లో చిగురుమళ్ల యాత్ర

విశ్వమానవాళికి శాంతి సందేశాన్ని అందించడానికి తెలుగు రచయిత చిగురుమళ్ల శ్రీనివాస్ ప్రారంభించిన 100 దేశాల యాత్ర ప్రస్తుతం గల్ఫ్‌లో కొనసాగుతోంది.

అమెరికాలోని తానాతో పాటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కు పైగా తెలుగు సంఘాల సౌజన్యంతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక గ్రామానికి చెందిన తెలుగు రచయిత చిగురుమళ్ళ శ్రీనివాస్ ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్ర బహ్రెయిన్‌కు చేరుకోగా బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి అధ్యక్షుడు హరిబాబు తక్కళ్ళపల్లి, పూర్వ అధ్యక్షులు ఎల్లపు శివ, కార్యవర్గం ఆధ్వర్యంలో శ్రీనివాస్‌కు ఘనస్వాగతం పలికారు. తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఆయన బహ్రెయిన్‌లోని భారతీయ రాయబారి వినోద్ కె. జాకబ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాస్‌ను భారతీయ రాయబారి అభినందించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, వందేవిశ్వమాతరం చైర్మన్ జయశేఖర్ తాళ్ళూరి సహాయంతో తాను ఈ యాత్రను ప్రారంభించినట్లు వెల్లడించారు. యాత్రలో రెండవ దశ కింద మధ్యప్రాచ్యంలో పర్యటిస్తున్నానని చెప్పారు. నవంబర్ 9న ఆఫ్రికాలోని బొత్స్వానాలో రెండవ దశ ప్రారంభమైందని శ్రీనివాస్ చెప్పారు. మధ్యప్రాచ్య దేశాలలో ఈ యాత్రకు కన్వీనర్లుగా కుదరవళ్ళి సుధాకర్, విక్రమ్ సుఖవాసిలు వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో ఫణిభూషణ్ రెడ్డి, టి.వంశీధర్, ప్రవీణ్, ఫణి హనుమంతరావు, విజయేంద్ర రెడ్డి, రామశ్రీను, శ్రీనివాస రెడ్డి.సి తదితరులు పాల్గొన్నారు.

చిగురుమళ్ళ శ్రీనివాస్ యాత్ర సౌదీ అరేబియాకు చేరుకోగా సౌదీలోని దమ్మాం నగరంలో సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఆయన్ను ఘనంగా సన్మానించారు. సంక్రాంతి ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు నాగశేఖర్ చందగాని మాట్లాడుతూ విశ్వ మానవ సోదరభావాన్ని సాహిత్యం ద్వారా విస్తృతంగా ప్రచారం చేయవచ్చని శ్రీనివాస్ నిరూపిస్తున్నారని కొనియాడారు. ఆఫ్రికా నుంచి మధ్యప్రాచ్యంలోని సౌదీలో తనకు లభించిన స్వాగతంపై శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మీర్జా జహీర్ బేగ్, వరప్రసాద్, ఉమా మహేశ్వరరావు, కేవీఎన్ రాజు, పాపారావు, హరికిషన్, పారేపల్లి ఎన్వీబీ కిషోర్, నరసింహరావు రాంపల్లి, నెట్టెం దిలీప్, చివుకుల శర్మతో పాటు పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z