Food

మాంసాహార బియ్యం తయ్యార్!

మాంసాహార బియ్యం తయ్యార్!

దక్షిణ కొరియాలోని యోన్‌సెయ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సరికొత్త ధాన్యాన్ని అభివృద్ధి చేశారు. పశు మాంస కండరం, కొవ్వు కణాలతో మిళితమై ఉండటం దీని ప్రత్యేకత. సాధారణ వరి వంగడాలతో పోలిస్తే ఇందులో ప్రొటీన్‌ 8 శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పోషక పదార్థంతో కూడిన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో పొందడానికి ఇది వినూత్న మార్గమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ బియ్యం రూపురేఖలు కూడా సాధారణ రకాలకు భిన్నం. కరవు ఉపశమనానికి, సైనికులు, రోదసిలోని వ్యోమగాములకు ఆహారం అందించడానికి ఈ ధాన్యం అక్కరకొస్తాయి. మాంసాహారంతో పోలిస్తే ఈ తరహా వరి ఉత్పత్తి వల్ల పర్యావరణానికి హాని తక్కువగా జరుగుతుంది. ఈ ధాన్యం రూపంలో 100 గ్రాముల ప్రొటీన్‌ ఉత్పత్తి చేస్తే 6.27 కిలోల కార్బన్‌ డైఆక్సైడ్‌ వెలువడుతుందని పరిశోధకులు తెలిపారు. దీంతో పోలిస్తే సంప్రదాయ పశు మాంసం ఉత్పత్తి వల్ల 49.89 కిలోల మేర ఈ హానికర వాయువు వాతావరణంలోకి చేరుతుందని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z