NRI-NRT

డల్లాస్‌లో తెదేపా-జనసేన-భాజపా సమావేశం

డల్లాస్‌లో తెదేపా-జనసేన-భాజపా సమావేశం

డల్లాస్‌లో తెదేపా-జనసేన-భాజపా సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ప్రవాస తెదేపా, భాజపా క్యాడర్‌కు చెందిన పలువురు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమ, అభివృద్ధిని మెరుగుపరిచేందుకు వైకాపా సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా కలిసి కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే. 2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలూ కలిసి బరిలో దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన సమావేశంలో పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఈ కీలక ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపాల పరస్పర సహాయసహకారాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఏపీలో జగన్‌ పాలనలో గత ఐదేళ్లుగా రైతులు, భవన నిర్మాణ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీలో రౌడీల పాలన సాగుతోందని.. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని.. కోలుకోవాలంటే ఎంతో సమయం పడుతుందని తెలిపారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాల్లేవని, ఉద్యోగులకు సైతం జీతాలు ఇచ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z