NRI-NRT

Gallery: తెలుగు వెలుగులు ప్రసరించిన 2024 నాట్స్ తెలుగు వేడుకలు

Gallery: తెలుగు వెలుగులు ప్రసరించిన 2024 నాట్స్ తెలుగు వేడుకలు

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 2024 తెలుగు వేడుకలు శుక్ర, శనివారాల్లో భారీ స్థాయిలో డల్లాస్ పరిసర ప్రాంతమైన అలెన్ కన్వెన్షన్ సెంటరులో వైభవోపేతంగా నిర్వహించారు. డల్లాస్ పరిసర ప్రాంతాలతో పాటు అమెరికా నలుమూలల నుండి ప్రవాసులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ప్రముఖ గాయకుడు కార్తీక్ సంగీత విభావరి అలరించింది. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. నటి కేథరిన్ తెరీసా, నటులు సత్యం రాజేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మాదాల రాజేంద్ర, బుంగతావుల హరనాథ్, అరుణ గంటి, కూచిభొట్ల ఆనంద్, మురళీ మేడిచెర్ల, కిషోర్ కంచర్ల తదితరులు పాల్గొన్నారు.

నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి నూతి(బాపు), బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనిలు వేడుకలను విజయవంతం చేసిన ప్రవాసులకు ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ డల్లాస్ విభాగాన్ని నాట్స్ కార్యవర్గం అభినందించింది.









👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z