NRI-NRT

డాలస్‌లో WETA అంతర్జాతీయ మహిళా దినోత్సవం

WETA Celebrates Womens Day 2024 In Frisco DFW

ప్రాంతాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతమైన లాభాపేక్ష లేని WETA ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫ్రిస్కోలోని ఇండిపెండెన్స్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ ప్రోటెం మేయర్ జాన్ కీటింగ్ కీలకోపన్యాసం చేశారు. టెక్ లీడర్ ఏమీ జుచ్లెవ్స్కీ, అంబికా దద్వాల్, సమాజంలో మహిళల పాత్రపై స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు. సమాజ సేవకు గాను సురోమా సిన్హా, మెర్సీ స్ట్రిక్‌ల్యాండ్లకు సేవా పురస్కారాలు అందించారు. కార్యక్రమానికి వీణా యలమంచిలి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ప్రముఖ తెలుగు ప్లేబాక్ సింగర్ సుమంగళి, శ్రీకాంత్ లంకలు పాటలతో ప్రేక్షకులను అలరించారు. అధ్యక్షురాలు శైలజ కల్లూరి, డల్లాస్ వెటా బృందం నవ్య స్మృతి రెడ్డి, ప్రతిమ రెడ్డి, గాయత్రి గిరి, మాధవి, ప్రశాంతి, జ్యోత్స్న, రేఖ, రత్నమాల వంక, సునీత గంప, విశ్వా వేమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

“తెలుగు మహిళల కోట.. స్త్రీ ప్రగతి పథమే బాట” నినాదంతో తెలుగు మహిళల సాధికారతే లక్ష్యంగా ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల 2019లో “ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA)”ను స్థాపించారు. స్త్రీలకు నైపుణ్యాలను అందించడం, సాధికారత, శక్తినివ్వడం, తద్వారా సమాజానికి సానుకూల సహకారం అందించడం వంటివి ఈ సంస్థ లక్ష్యాలు.



👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z