Devotional

నేటి నుండి భద్రాద్రి శ్రీరాముని బ్రహ్మోత్సవాలు

నేటి నుండి భద్రాద్రి శ్రీరాముని బ్రహ్మోత్సవాలు

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో మంగళవారం ఉగాది సందర్భంగా శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 23 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కోవెలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. స్వాగత ద్వారాలతో పాటు క్యూలైన్ల నిర్మాణం చేపట్టారు. 16న నిర్వహించే ఎదుర్కోలు వేడుకకు భారీస్థాయిలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టారు. 17న ప్రధాన ఉత్సవమైన శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మిథిలా మండపంలో శ్రీసీతారామ కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 35 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు మండప ప్రాంగణాన్ని 24 సెక్టార్లుగా విభజించారు. ఇందులో ప్రవేశానికి టికెట్లను ఆన్‌లైన్‌తో పాటు కౌంటర్లలో విక్రయిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z