NRI-NRT

UK ప్రవాసుల క్రోధి నామ ఉగాది సంబరాలు

UK ప్రవాసుల క్రోధి నామ ఉగాది సంబరాలు

యునైటెడ్ కింగ్‌డమ్ లోని బ్రాక్నెల్ నగరంలో ప్రవాస తెలుగువారు క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అతిథులు ఉగాది శుభాకాంక్షలు తెలిపి, ఈ సంవత్సరం అందరికీ మరింత మేలు జరగాలని ఆకాంక్షించారు. సంప్రదాయబద్ధంగా తయారుచేసిన షడ్రచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని అతిథులకు అందించారు. ఉగాది ప్రత్యేకతని భాస్కరరామమూర్తి వివరించారు. స్థానిక ప్రవాస చిన్నారులు, యవకులు నృత్యాలతో అలరించారు. పెద్దలకు తెలుగు పదాల ఆటలు నిర్వహించారు. రుచికరమైన తెలుగు సాంప్రదాయ భోజనాన్ని ఆస్వాదించారు. గత 20ఏళ్లుగా బ్రాక్నెల్ తెలుగువారు ఉగాది వేడుకలు జరుపుకుంటున్నారు.


👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z