NRI-NRT

సౌదీలో తెలుగు నర్సుల విశిష్ట సేవలు..!

సౌదీలో తెలుగు నర్సుల విశిష్ట సేవలు..!

రోగులకు సేవ చేయడమంటే సాధారణంగా మొదట గుర్తొచ్చేది వైద్యులే! కానీ.. రోగి సంరక్షణకు సంబంధించి నర్సింగ్ సేవలు కూడా అంతే కీలకం. నర్సులు లేకుండా ఏ రోగికి పూర్తి్స్థాయి చికిత్స అందించడం దాదపు అసాధ్యం. దురదృష్టవశాత్తు భారతదేశంలో పూర్తి ఖ్యాతి ఒక్క వైద్యులకు దక్కుతుండగా విదేశాలలో మాత్రం వైద్యులతో పాటు రోగిను నిరంతరం కంటికి రెప్పలా చూసుకోనె నర్సింగ్ సిబ్బందికి కూడా దక్కుతుంది. గల్ఫ్ దేశాలతో పాటు యూరోపియన్ దేశాలలో భారతీయ నర్సులకు ఉన్న ఆదరణ ఇతర వృత్తులకు లేదని చెప్పవచ్చు. ఇక భారతీయ నర్సులంటే ముందుగా గుర్తొచ్చేది కేరళలోని నాలుగు జిల్లాలకు చెందిన వారే. ఈ రంగంలో మలయాళీల ప్రాబల్యం అధికం. కేవలం గల్ఫ్ దేశాలే కాదు ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ రంగంలో మలయాళీ నర్సుల ఆధిపత్యం కొనసాగుతోంది.
bk2
మలయాళీల తర్వాత తమిళులు, తెలుగు నర్సులు కూడా తమ సేవలందిస్తున్నారు. కేరళతో పోల్చితే తెలుగు రాష్ట్రాల నర్సులు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ వీరు తమ పని విధానంతో ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. కరోనా మహమ్మరి కాలంలో కొందరు తెలుగు నర్సుల పాత్ర మరువలేనిది. సౌదీ అరేబియాలోని రియాధ్ నగరంలో కోవిడ్ రోగులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రిలో నల్గోండ జిల్లా నక్రేకల్ పట్టణం చెందిన బొజ్జ అనిల్ కుమార్ విశిష్ట సేవలందించారు. రియాధ్ లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఆయనకు నర్సింగ్ స్కాలర్ సోసైటీ (యన్.యస్.యస్) ఇటీవల తమ అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెంబర్ పిష్ సభ్యత్వంతో సత్కరించింది. రోగులకు సేవలందించడంలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ, నర్సులకు తగు సూచనలు ఇస్తున్నందుకు అనిల్ కుమార్‌కు ఈ పురస్కారం దక్కింది. సౌదీలో తెలుగు నర్సుల విశిష్ట సేవలు..!రియాధ్ నగరంలోని మరో కీలక ఆసుపత్రిలో అత్యవసర సేవల (ఇ.ఆర్) విభాగంలో కడప జిల్లా మద్నూర్ కు చెందిన లక్ష్మీ షిష్ట్ ఇన్‌చార్జీగా సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తన్నారు. అత్యవసర కేసులను స్వీకరిస్తూ అపదకాలంలో రోగులను ప్రత్యేకించి క్షత్రగాత్రులను సకాలంలో సేవలు అందించడంలో అమె పెట్టింది పేరు. కోవిడ్ కాలంలో అమె తన ప్రతిభను ప్రదర్శించారు. అదే విధంగా జెద్ధా నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఐ.సి.యూలో పని చేస్తున్న తిరుపతి నగరానికి చెందిన మమత, కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రిలో ఐ.సి.యూలో కీలక పాత్ర వహించిన హైద్రాబాద్ నగరానికి అరుణ కూడా రోగుల మన్నలను అందుకొన్నారు. కింగ్ అబ్దుల్లా మెడికల్ కాంప్లెక్స్‌లో కూడా అనేక మంది సమర్ధవంతమైన తెలుగు నర్సులు తమ సేవలందిస్తున్నారు. ఈ రకంగా గల్ఫ్‌లో తెలుగు నర్సింగ్ వృతి నిపుణులు సంఖ్య తక్కువే అయినా వారు తమ పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.