Food

దానిమ్మతో శృంగార రసం పెరుగుతుంది

Pomegranate Is Aphrodisiac That Enhances Sexual Desires

రక్తహీనతతో బాధపడేవారిని దానిమ్మ తినమని చాలామంది సలహా ఇస్తుంటారు. దీనిలో విటమిన్లు, ఫోలిక్‌ యాసిడ్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు మెండుగా ఉంటాయి. ఈ పండు వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో చూద్దామా!
* ఈ పండులో పిండిపదార్థాలు 14% అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు 6%, పీచు 11%, మాంసకృత్తులు 3%, విటమిన్లు 14%, థయామిన్‌ 5.5%, ఐరన్‌ 4% ఉంటాయి. ఇవే కాకుండా యాంటీఆక్సిడెంట్లు, ఫోలిక్‌ యాసిడ్‌, రైబోఫ్లేవిన్‌ మెండుగా ఉంటాయి.
* ఈ పండులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్‌ సమ్మేళనాలు మూత్ర సంబంధ వ్యాధులు రాకుండా నిరోధిస్తాయి. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లనూ అదుపులో ఉంచుతాయి.
* రోజూ క్రమం తప్పకుండా కప్పు దానిమ్మ గింజలు తినడం వల్ల క్యాన్సర్‌ కారకాలను నియంత్రించొచ్చు.
* దానిమ్మను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తికి మరింత బలం చేకూరుతుంది. ఇది బ్యాక్టీరియల్‌, వైరల్‌ జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ పండు శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ ఉత్పత్తిని పెంచుతుంది.
* ఫోలిక్‌ యాసిడ్‌ ఎక్కువ మొత్తంలో ఉండే ఈ గింజలను తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.
* దానిమ్మ తినడం వల్ల శరీరంలో రక్తప్రసరణ క్రమపద్ధతిలో జరుగుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. రక్తం గడ్డ కట్టే సమస్యా దాదాపుగా ఎదురుకాదని అధ్యయనాలు చెబుతున్నాయి.
* ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ దానిమ్మ గింజలు తినాల్సిందే. వీటిని తినడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లు విడుదల కాదు. అల్జీమర్స్‌ వచ్చే అవకాశం తక్కువ.
* ఈ పండులోని విటమిన్లు, ఖనిజాలు, ఫోలిక్‌ యాసిడ్‌ కాబోయే తల్లికే కాదు, పుట్టబోయే బిడ్డకూ ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల గర్భిణులకు కాళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి.
* రోజూ రెండు కప్పుల దానిమ్మ రసం తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఇది తాగడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. దాంతో త్వరగా ఆకలి వేయదు. ఈ గింజలు తినడం వల్ల జీవక్రియల రేటు మెరుగుపడుతుంది. ఇది బరువు తగ్గేందుకూ తోడ్పడుతుంది.