Politics

తెదేపా ఆంగ్ల మాధ్యమానికి అనుకూలం

TDP WIll Support English Medium-Says Chandrababu In Assembly

ఏపీ ప్రభుత్వం పాఠశాలల్లో ప్రవేశపెట్టే ఆంగ్లమాధ్యమానికి తాము సహకరిస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంగ్లమాధ్యమంపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. తానెప్పుడూ ఆంగ్లమాధ్యమానికి వ్యతిరేకం కాదని.. తెలుగుకు ప్రాధాన్యం ఇస్తూనే దాన్ని అమలు చేయాలని సూచించారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన వైకాపా.. ఇప్పుడు మాత్రం తామే ఆంగ్లమాధ్యమాన్ని కనుగొన్నట్లు మాట్లాడుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తామెప్పుడూ అవకాశవాద రాజకీయాలు చేయలేదని.. వైకాపానే రెండు నాలుకల ధోరణితో వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టేటపుడు తగిన సన్నద్ధత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం.. పుస్తకాల్లో మార్పులపై ప్రభుత్వం దృష్టిసారించాలని చంద్రబాబు సూచించారు. మరోవైపు మాధ్యమాన్ని ఎంచుకునే విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు నిర్ణయాన్ని వదిలిపెట్టాలన్నారు. పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరిగా ఉండాలని.. మాతృభాషను త్యాగం చేస్తే భవిష్యత్‌లో చాలా సమస్యలు వస్తాయని చెప్పారు.