DailyDose

నలుగురు రైల్వే ఉద్యోగుల మృతి-నేరవార్తలు

నలుగురు రైల్వే ఉద్యోగుల మృతి-నేరవార్తలు

* వికారాబాద్ జిల్లా, వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మూసినదిపై ఉన్న బ్రిడ్జి పై 12 మంది రైల్వే ఉద్యోగులు పెయింటింగ్ వర్క్ చేస్తున్న క్రమంలో రైలు ప్రమాదం.. హైదరాబాద్ నుండి వికారాబాద్ వస్తున్న ఓ ట్రైన్ ఇంజన్ ఢీ కొని ముగ్గురు మృతి..మృతి చెందిన వారు నవీన్ (34),శంషీర్ అలీ (22),ప్రతాప్ రెడ్డి (58) అని తెలుస్తుంది.

* సత్తెనపల్లి ఎన్ ఎస్ పి అతిధి గృహం వద్ద దారుణంమద్యం మత్తులో వేటకొడవలితో భార్య మెడ నరికిన భర్తతల మొండెంను వేరు చేసి కిరాతకంగాహత్యచేసిన భర్త ..తలను తీసుకుని పోలీసులకు లోంగిపోయిననిందితుడు ..అర్థరాత్రి 12 గంటల సమయంలో భార్యభర్తల మద్య గొడవ….పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన భార్యను ఎన్ ఎస్ పి గెస్ట్ హౌస్ దగ్గర అడ్డగించి హత్య చేసిన భర్త శ్రీనివాసరావు(46)….నిందితుడు ఎన్ ఎస్ పి కెనాల్స్ ఉద్యోగి.

* రాజమండ్రి లో డిఐజి పిసి…సీతానగరం పిఎస్ లో దళిత యువకుడ్ని శిరోముండనం చేసిన ఘటనపై ఏలూరు రేంజ్ డిఐజి కెవి మోహనరావు రాజమండ్రిలో మీడియా సమావేశంసీతానగరం పిఎస్ లో 19వ తేదీన కేసు నమోదు అయిందిట్రైనీ ఎస్సై షేక్ ఫిరోజ్ షా.దళిత యువకుడు ప్రసాద్ ని విచారణకు పిలిచాడుతలవెంట్రుకలు, మీసాలు తొలగించి అమానుషంగా ప్రవర్తించారుదీన్ని తీవ్రంగా తోసుకుని ఇప్పటికే సస్పెండ్ చేసాంఎస్ఐ పై క్రిమినల్ ,ఎస్సి ఎస్టీ కేసు నమోదు చేసాంచట్టం అనేది పోలీసులకు, ప్రజలకు సమానంగా ఉండాలిసీనియర్ డిఎస్పీ ని కేసు కు విచారణ అధికారిగా నియమించాంఎలాంటి పొలిటికల్ వత్తిడి లేదు…క్రిమినల్ కేసు నమోదు చేసాం.వాస్తవలపై పూర్తి విచారణ చేస్తాంఅవసరం అయితే బాధితుడి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాండిఐజి కెవి మోహనరావు.శిరో ముండనం కేసులో ఎస్సై అరెస్ట్ చేశాం:అర్బన్ ఎస్పీ షిమోషీ బాజ్ పెయ్.రాజమండ్రి అర్బన్ జిల్లా సీతానగరం పోలీసు స్టేషన్లో దళిత ఇందుమిల్లి ప్రసాద్ శిరోముండనం చేసిన ఘటన లోఎస్ ఐ ఫీరోజ్ షా తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్ లను అరెస్టు చేశాం: అర్బన్ ఎస్పీ షిమోషీ బాజ్ పెయ్

* ఎస్సై విచక్షణారహితంగా కొట్టటంతో యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది.మాస్క్ ధరించకుండా బయటకు వచ్చాడన్న కారణంగానే తమ కుమారుడ్ని ఎస్సై కొట్టాడని మృతుడి తండ్రి ఆరోపించాడు.

* పోలీసుల తనిఖీల్లో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది.ప్రకాశం జిల్లా మద్దిపాడు వద్ద పోలీసుల తనిఖీలు నిర్వహించారు.అక్రమంగా తరలిస్తున్న 870 కేజీల గంజాయిని పట్టుకున్నారు.నలుగురు నిందితులను అరెస్ట్ చేసి.. ఓ లారీ, కారును స్వాధీనం చేసుకున్నారు.