Food

కొవ్వు పెరిగిందా? ఆవనూనెకు మారండి.

కొవ్వు పెరిగిందా? ఆవనూనెకు మారండి.

మనం వాడే వంటనూనెల విషయంలో తగిన జాగ్రత్తల్ని తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వంటలకు ఆవాల నూనెను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటున్నారు.
* ఆవనూనెతో తయారైన ఆహారం తింటే గొంతు, శ్వాసకోశ వ్యవస్థ బలంగా ఉంటుంది. మన శరీరంలోకి ఏ రకమైన వైరస్‌లు, బ్యాక్టీరియాలు చేరుకున్నా.. వీటిలో లభించే యాంటీ ఫంగల్‌, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాల కారణంగా అవి వేగంగా వద్ధి చెందకుండా కాపాడుతుంది.
* వాత, పిత, కఫం చేరనీయకుండా చేస్తుంది. ఆవనూనెతో చేసిన వంటకాలు తినేవారికి ఇతర వారితో పోలిస్తే కఫం, జలుబు, ఛాతీనొప్పి, గొంతునొప్పి, దగ్గు వంటివి వచ్చే అవకాశం చాలా తక్కువ.
* సింథటిక్‌, రిఫైండ్‌ నూనెలతో తయారైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అవి నేరుగా శరీరంలోకి వెళ్లి సిరల్లో అదనపు కొవ్వు రూపంలో పేరుకుపోయి.. ధమని పనులను అడ్డుకుంటాయి. అదే ఆవనూనె అయితే అలాంటి సమస్యల్ని రానీయకుండా చేస్తుంది.
* జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగుపరుస్తుంది ఆవనూనె. మలబద్ధకం, కడుపునొప్పితో బాధపడుతున్న వారు ఈ నూనెను ఆహారంలో ఉపయోగిస్తే ఆ సమస్యలు దూరమవుతాయి.
* ఈ నూనె బరువును అదుపులో ఉంచుతుంది. ఆవనూనె బ్యాక్టీరియాలను చంపడమే కాకుండా శరీరం డీహైడ్రేషన్‌ బారిన పడకుండా కాపాడుతుంది. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది.
* ఆవనూనెలో ప్రధానంగా విటమిన్‌-ఈ అధికంగా ఉంటుంది. చర్మాన్ని పొడిబారనీయకుండా, తేమతో ఉండేలా చేస్తుంది.