Movies

ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకోవడం వెనుక కథ ఏంటంటే..?

ఎన్టీఆర్  హనుమాన్ దీక్ష తీసుకోవడం వెనుక కథ ఏంటంటే..?

ఎన్టీఆర్ ప్రస్తుతం హనుమాన్ దీక్షలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష వేసుకోవడానికి గల కారణం తెలియకపోయినప్పటికీ ఎన్నో రోజుల నుంచి ఆయన హనుమాన్ మాల వేయాలని భావించారట. అయితే సరైన సమయం కుదరకపోవడంతో ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎలాంటి మాల వేయలేదు. అయితే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకోవడం వెనక ఓ కారణం ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

కేవలం దోష నివారణ కోసమే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే ఆ హీరో తదుపరి చిత్రం ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇదే విషయాన్ని ఇటీవలే ఆచార్య ప్రిరిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా అన్నారు. ఆ సెంటిమెంట్‌ను తాను నమ్మనన్నారు చిరు. చరణ్ ఆచార్యతో రాజమౌళి హీరోలకు సంబంధించి వెంటాడుతున్న ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడన్నారు మెగాస్టార్.

చిరంజీవి లాంటి పెద్ద హీరో అలా అన్న కూడా… హీరోలను మాత్రం రాజమౌళి సెంటిమెంట్ టెన్షన్ పుట్టిస్తుందనే చెప్పాలి. ఈ క్రమంలోనే RRR సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కూడా విజయవంతం కావాలని, ఈ సెంటిమెంట్ అనే దోషం నుంచి తప్పించుకోవడం కోసమే హనుమాన్ దీక్ష తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా హనుమాన్ దీక్షతో తన జాతకంలో వున్న దోషాలు కూడా తొలగిపోవడం కోసం త్వరలోనే హోమం కూడా చేయబోతున్నారు అంటూ ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు.