Devotional

సాక్షాత్తు శ్రీనివాసుడు నడిచిన మార్గమే-శ్రీవారి మెట్లు

Special Story On Srivari Metlu-Alipiri Foot Way

శ్రీవారు మొట్టమొదటిసారిగా తిరుమల చేరుకున్న అతి పవిత్ర మార్గము – #శ్రీవారి_మెట్లు

శ్రీనివాసుడు పద్మావతిని పరిణయమాడిన తరువాత వారు ఈ దారిగుండానే తిరుమల చేరుకున్నారు .

తిరుమలకు ఇది అతి పురాతన నడకదారి.

ఒకప్పుడు చంద్రగిరి నుండి తిరుమలకు రాకపోకలన్నీ ఈదారి గుండానే జరిగేవి .

శ్రీ కృష్ణ దేవరాయలు , అన్నమయ్య తదీతర మహా భక్తులు ఎందరో ఈ దారి గుండానే తిరుమలకు వెళ్లి స్వామి వార్ని దర్శించుకున్నారని ప్రతీతి.

తిరుమల కొండపైకి రెండు మార్గాలున్నాయి. అలిపిరి నుండి వేళ్ళే దారి అందరికీ పరిచయమైనది. ఈ దారిలో వేగంగా నడిస్తే నాలుగు గంటల సమయం పడుతుంది. తిరుమల చేరుకోవడానికి రెండవ కాలిబాట ”’శ్రీవారి మెట్టు”’ నుండి ఉంది. ఈ మార్గంలో ప్రయాణం ఒక గంట మాత్రమే పడుతుంది.

తిరుమల బస్సు స్టాండ్ నుంచి శ్రీ వారి మెట్టుకు ఉచిత బస్సు కలవు . అలిపిరిలో ఉన్నట్లు గానే ఇక్కడకూడా ఉచిత లగేజి కౌంటర్ ఉంది .

మెట్ల మార్గం గుండా నడిచేవెళ్ళే వాళ్ళు తమ బాగ్ లను ఇక్కడ ఉంచితె.. దేవస్థానం వాళ్ళు కొండపైకి తీస్కుని వెళ్తారు . ఇక్కడ నుంచి మెట్ల మార్గం 6 km ఉంటుంది .

శ్రీ వారి మెట్టు ద్వారా నడక మార్గమున తిరుమలకు వెళ్ళు భక్తులను ఉదయం 6 గం ॥ల నుండి సాయంత్రం 6 గం ॥ల వరకు అనుమతించబడును . కనుక సమయ పాలన అతి ముఖ్యం.ఏమాత్రం ఆలస్యం చేసినా మరో రోజువరకు వేచి ఉండాలి.కనుక ఉన్న సమయానికి తగినట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకుని సన్నధం కావాలి.

నడక ప్రారంభించే ముందు . స్వామి వారి ప్రసాదం తీస్కోండి

స్వామి వారి పదాలకు నమస్కరించుకుని గోవింద నామాలు స్మరిస్తూ నడక యాత్ర ప్రారంభించాలి

ఏడుకొండల వాడా ఆపద మొక్కుల వాడా అనాధ రక్షక వెంకటరమణా గోవిందా గోవిందా

అల్లిపిరిలో తిరుమల నడిచి వచ్చే వాళ్ళకు టోకెన్ లు ఇచ్చినట్టే ఇక్కడ కూడా ఇస్తారు . ఎందుకంటే మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఆలస్యం ఐతే టోకెన్ ఇవ్వరు .

ప్రతి రోజు శ్రీ వారి మెట్టు 3750 టోకెన్లు మరియు అలిపిరి 11,250 టోకెన్లు నడక మార్గం ద్వారా నడిచి వచ్చే భక్తులకు 15,000 టోకెన్లు లేదా సాయంత్రం 5.00 గం ॥ల వరకు మాత్రమే జారిచేయబడును

టోకెన్లు కోటా పూర్తీ అయిన లేదా సమయం ముగిసిన యెడల కౌంటర్లు ముసివేయబడును . కావున భక్తులు గమనించ ప్రార్ధన .

సుమారు 300 -400 మెట్లు వరకు చాల సులభంగ ఎక్కవచ్చు ..

గోవింద నామాలు చదువుకుంటూ .. గోపాలుడుని స్మరించుకుంటూ .. నడక సాగించండి

దివ్య దర్శనం టోకెన్ టికెట్ మరో 900 మెట్ల దూరం లో ఉంది .. గోవిందా గోవిందా

శ్రీ వారి మెట్టు కాలినడక వచ్చు భక్తులు లగేజి కౌంటర్ M. P.C కి ఎదురుగ ఉన్న బిల్డింగ్ లో తీస్కోవచ్చు .

ఒక్కోసారి బ్యాగ్ లు రావడం లేట్ అవుతుంది ..బ్యాగ్ లు వచ్చే లోపు .. స్వామి వారి అన్నదాన ప్రసాదం స్వికరించండి . ఇక్కడకి దగ్గరలోనే S.V.అన్నదాన భోజనశాల ఉంది.

తిరుమల లో అంగప్రదక్షిణ చేయదలచుకున్న భక్తులు ఇవి తెలుసుకోవాలి

వేంకటేశ్వరునికి సుప్రభాత సేవ అయిన తరువాత భక్తులను అంగప్రదక్షణకు అనుమతినిస్తారు .స్వామి వారి సన్నిదిలో అంగప్రదిక్షణ చేయడం అంటే మాటలా .. అనుభూతిని ఎలా వర్ణిస్తాం .

1. తిరుమల కొండపైన (తిరుమల అంటేనే స్వామి వారి కొండ .. తిరుపతి అంటే క్రింద ఉన్న ఉరు ) ఉన్న C.R.O ఆఫీసు కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి అంగప్రదిక్షణ టికెట్స్ ఇస్తారు .

2. అంగప్రదిక్షణ టికెట్స్ ముందుగ వచ్చిన 700 మందికి మాత్రమే ఇస్తారు . అంగప్రదిక్షణ స్త్రీలు , పురుషులు ఇద్దరు చేయవచ్చు . మరీ చిన్నపిల్లలకి టికెట్స్ ఇవ్వరనుకుంట .

3. 1.30 లోపు సుఫదం దగ్గరకు మీరు రవాలని మీకు ఇచ్చిన టికెట్ మీద ఉంటుంది . మీరు 1am లోపే అక్కడ ఉండండి .

4. స్వామి వారి పుష్కరిణి లో స్నానం చేసి తడిబట్టలతోనే సుపధం దగ్గరకు వెళ్ళాలి ( సుపధం అంటే స్వామి వారి గుడి కుడివైపు న ఉంటుంది . అక్కడ ఎవరైనా చెబుతారు .

5. అంగప్రదిక్షణ టికెట్స్ ఉచితంగానే ఇస్తారు . మీరు టికట్ కి మధ్యాహ్నం 12 గంటలకు నిలబడితే మీకు టికెట్ దొరికే ఛాన్స్ ఉంది .

6. అంగప్రదిక్షణ చేసినవాళ్ళకి ఒక లడ్డు ఇస్తారు ( 10/-) . మీరు డబ్బులు కూడా తీస్కుని వెళ్ళండి .

7. దర్శనం చాల త్వరగా అవుతుంది . అంగప్రదిక్షణ అయినతరువాత మీకు స్వామి వారి దర్శనం కూడా ఉంటుంది .

8. అంగప్రదిక్షణ చేసేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ఉంటే మంచిది . మామోలు ప్యాంట్ కూడా అనుమతినిస్తున్నారు . బనియన్ ఉంచుకోకూడదు . ముందుగా స్త్రీలను తరువాత పురుషులను అంగప్రదక్షిణ చేయిస్తారు .

9.స్వామి వారి దర్శనం అయ్యాక మనం బంగారు బావి దగ్గరకు వస్తాం కదా అక్కడనుంచి స్వామి వారి హుండీ వరకు అంగప్రదక్షిణ చేస్తాం .