Politics

జగన్ సీఎం అయితే క్యాబినెట్ ఇదేనని ప్రచారం

Predicted 2019 YS Jagan Cabinet Ministers List -జగన్ సీఎం అయితే క్యాబినెట్ ఇదేనని ప్రచారం-tnilive

ఏపీలో ఎన్నిక‌ల ఫల‌తాలు వెల్ల‌డి కాలేదు. ఇందుకు మ‌రో వారం రోజులు స‌మ‌యం ఉంది. కానీ, వైసీపీ నేత‌లు మాత్రం త‌మ‌దే అధికారం అనే ధీమాలో ఉన్నారు. ఆ ధీమా అంత‌టితో ఆగ‌లేదు. కేబినెట్‌లో ఎవ‌రు ఉంటారు.. ఎవ‌రికి ఏ మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నే దాని పైనా ఎవ‌రి అంచ‌నాలు వారికి ఉన్నాయి. జ‌గ‌న్ డిసైడ్ చేయాల్సిన పేర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆ పేర్ల‌ను సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేష‌న్‌లో పెట్టేసారు.
**మంత్రులు.. శాఖ‌లు..
ముఖ్యమంత్రి : వై యస్ జగన్మోహన్ రెడ్డి
స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు
డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి
రెవిన్యూ : ధర్మాన ప్రసాద రావు
హోమ్ : పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
ఫైనాన్స్ : బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
రోడ్స్ & భవనాలు : బొత్స సత్యనారాయణ
భారీ నీటి పారుదల : కోడలి శ్రీ వెంకటేశ్వర రావు
మున్సిపల్ : గడికోట శ్రీకాంత్ రెడ్డి
స్త్రీ శిశువు సంక్షేమం : తానేటి వనితా
పౌర సరఫరాలు : పిల్లి సుభాష్ చంద్రబోస్
వైద్య : అవంతి శ్రీనివాస్
విద్య : కురసాల కన్నబాబు
బీసీ సంక్షేమం : తమ్మినేని సీతారాం
అటవీ శాఖ : శిల్ప చక్రపాణి రెడ్డి
న్యాయ శాఖ : వై. విశ్వేసర రెడ్డి
దేవాదాయ : కోన రఘుపతి
పంచాయతీ రాజ్ : ఆనం రాంనారాయణ రెడ్డి
ఐటీ : మోపిదేవి వెంకటరమణ
విద్యుత్ శాఖ : ఆర్. కే. రోజా
మైనింగ్ : బాలినేని శ్రీనివాస్ రెడ్డి
సినిమాటోగ్ర : గ్రంధి శ్రీనివాస్
కార్మిక, ట్రాన్స్ పోర్ట్ : ఆళ్ళ నాని
సాంగిక సంక్షేమం : k. భాగ్యలక్ష్మి
వ్యవసాయం : ఆళ్ళ రామకృష్ణ రెడ్డి
మార్కెటింగ్, పశుసంవర్థకం : అమంచి కృష్ణ మోహన్
టూరిజం, తెలుగు సంస్కృతి : కె. ఇక్బాల్ అహ్మద్
గృహ నిర్మాణం : కొక్కిలిగడ్డ రక్షణనిధి
ఇండస్ట్రీస్ : కాకాని గోవర్ధన్ రెడ్డి
ఇప్ప‌టికే ఎవ‌రూ ఫ‌లితాల మీద అతిగా స్పందించ‌వ‌ద్ద‌ని వైసీపీ అధినాయ‌క‌త్వం సూచించింది. అయితే, జ‌గ‌న్ ఆలోచ‌న ఇదే నంటూ కొంత మంది పోస్టింగ్‌లు పెడుతున్నారు. మ‌రి..ఇప్పుడు వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.