Movies

హన్సిక హారర్

Actress Hansika Signs A New Horror Comedy Movie - tollywood telugu movie news tnilive telugu news international - latest nri nrt global news

మరోసారి హారర్‌ సినిమాకు సంతకం చేశారు హన్సిక. ఇంతకు ముందు తమిళంలో సుందర్‌ .సి దర్శకత్వంలో హారర్‌ సినిమాలు ‘అరణ్మనై’, ‘అరణ్మనై 2’ చేశారు. రెండూ తెలుగులో అనువాదమయ్యాయి. హన్సిక తాజా హారర్‌ చిత్రానికి ఎస్‌. కల్యాణ్‌ దర్శకుడు. ‘గులేబాకావళి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది. హారర్‌ నేపథ్యంలో బ్లాక్‌ కామెడీ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో హన్సికదే ప్రధాన పాత్ర. ఆమె మోడ్రన్‌ లుక్‌లో కనిపిస్తారట! జూన్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.