Politics

అద్వానీ కాళ్ల మీద పడిన మోడీ

Modi seeks advanis blessings by gesturing at his feet-TNILIVE-అద్వానీ కాళ్ల మీద పడిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ(శుక్రవారం) బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీని కలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో బీజేపీ చీఫ్ అమిత్ షా తో కలిసి అద్వానీ ఇంటికి వెళ్లిన మోడీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత మురళీమనోహర్ జోషి నివాసానికి వెళ్లారు. బీజేపీ సొంతంగా 303 స్థానాల్లో గెలిచి రెండోసారి వరుసగా అధికారంలోకి రావడంతో అద్వానీ, మురళీ మనోహర్ జోషి … మోడీ, అమిత్ షాను అభినందించారు.అద్వానీ లాంటి సీనియర్లు పార్టీని దశాబ్దాలుగా నిర్మిస్తూ… సరికొత్త భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కారణంగానే ఇవాళ ఇలాంటి విజయం సాధ్యపడిందని మోడీ అన్నారు. మురళీ మనోహర్ జోషి దేశ విద్యారంగానికి విశేష కృషి చేశారని, ఆయన సేవలు మరువలేనివన్నారు మోడీ. బీజేపీని బలోపేతం చేసి.. నాతో సహా చాలా మంది కార్యకర్తలకు మార్గనిర్దేశనం చేశారన్నారు. జోషి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు ప్రధాని.ఈనెల 28న మోడీ వారణాసి వెళ్లనున్నారు. 29న గాంధీనగర్ వెళ్లి తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకుంటారు. ఈనెల 30న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అటు అమిత్ షా గాంధీ నగర్ నుంచి బంపర్ మెజార్టీతో గెలవడంతో.. కేంద్ర క్యాబినెట్ లో పదవి చేపట్టడం లాంఛనంగా మారింది. అయితే అమిత్ షా కు ప్రధాని మోడీ కీలక శాఖ అప్పగించే ఛాన్స్ ఉంది.