DailyDose

కేంద్రం బంపర్ ఆఫర్-వాణిజ్య-06/20

Indian government announces subsidies on eve-June 20 2019-Daily Business News

*ఎలక్ట్రిక్ వాహనాల పై కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. విద్యుత్ సహాయంతో నడిచే వాహనాల పై రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేస్తున్నట్లు రోడ్డు రావాన్మా మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఈమేరకు సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 చట్టాన్ని సవరించినట్లు తాజా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో వివరించింది. భారత్ లో ప్రధాన పట్టణాలలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో పర్యావరణ హిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సాహమిచ్చే చర్యల్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తెసుకుంది.
* రివోల్ట్ ఇంటెల్లీ కార్పొరేషన్ కంపెనీ నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి వచ్చింది. రివోల్ట్ RV 400 బైక్.. ఇండియాలో ఫస్ట్ AI ఎనేబుల్డ్ బైక్‌ను రివోల్ట్ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రిమోట్ స్టార్ట్ సపోర్ట్‌తో కూడిన ఎన్నో స్మార్ట్ ఫీచర్లు ఈ బైక్‌లో ఉన్నాయి. రియల్ టైం ఇన్ఫర్మేషన్, డయాగ్నిస్టిక్స్, జియో ఫెన్సింగ్, OTA అప్ డేట్ సపోర్ట్, బైక్ లొకేటర్, ఆర్టిఫీషియల్ ఎగ్జాస్ట్ సౌండ్ సిస్టమ్ లోడై ఉన్నాయి. ఇలా ఎన్నో ఫచర్లతో యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్న ఈ బైక్‌లో ఆకర్షించే ఫీచర్.. ఆన్ లైన్ రీచార్జ్ ఎబిలిటీ. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా బైక్‌కు సంబంధించిన బ్యాటరీలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు.
* దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 498 పాయింట్లు లాభపడి 39,611 వద్ద, నిఫ్టీ 146 పాయింట్లు లాభపడి 11,838 వద్ద ముగిశాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లను తగ్గించవచ్చనే వార్తలు మార్కెట్లో జోరును నింపాయి.
* జియోకి రూ.20 వేల కోట్లు
టెలికాం ఇండస్ట్రీలో రిలయన్స్ జియో పేరు తెలియని వారుండరు. ఇప్పుడు ఈ కంపెనీ కన్ను ఈకామర్స్, బ్రాడ్‌‌బ్యాండ్, 5జీ సర్వీసులపై పడింది. వీటిలో కూడా సంచలనాలకు తెరలేపుతూ.. మార్కెట్‌‌లోకి ఎంటర్‌‌‌‌ కావడానికి రిలయన్స్ జియోకి దాని పేరెంట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌‌‌‌ఐఎల్) భారీగా పెట్టుబడులు అందించనుంది. ఈ భారీ విస్తరణకు అవసరమయ్యే క్యాపిటల్‌‌ను సమకూర్చనుంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌‌లోకి రిలయన్స్ ఇండస్ట్రీ రూ.20 వేల కోట్ల క్యాపిటల్‌‌ను పెట్టుబడిగా పెట్టబోతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
*ఉద్యోగార్థులకు సేవలు అందించే జాబ్ సైట్ అయిన ‘ఇండీడ్’ హైదరాబాద్లో నూతన టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటోంది.
*జీవిత బీమా సంస్థ ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల తొలి బీమా ప్రీమియాన్ని లక్ష్యంగా విధించుకుంది.
*దేశీయ వాహన సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) వ్యక్తిగత వాహనాల శ్రేణిపై రూ.36,000 వరకు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. జులై 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. అన్ని ప్రయాణికుల కార్లలో ఏఐఎస్ 145 భద్రతా నిబంధనలను అమలు చేయడం వల్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ బీఎస్ఈకి సమాచారమిచ్చింది.
*సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎమ్ఈలు) పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణ పరిమితిని రెట్టింపు చేసేందుకు ఆర్బీఐ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం పూచీకత్తు లేకుండా రూ.10 లక్షల వరకు రుణం పొందే వీలుండగా.. దానిని రూ.20 లక్షలకు పెంచాలని ప్రతిపాదించింది.
*విద్యుత్తు వాహనాలకు రిజిస్ట్రేషన్ రుసుము రద్దు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తెచ్చింది. పర్యావరణ కాలుష్యం అంతకంతకూ పెరుగుతున్నందున, ఉద్గారాలు వెదజల్లని విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి విదితమే.
*జీడీపీ గణాంకాలను ఎక్కువ చేసి చూపారంటూ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ చేసిన ఆరోపణలను ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) మరోమారు ఖండించింది. 2011-12 నుంచి 2016-17 మధ్య కాలంలో జీడీపీ గణాంకాలను 2.5 శాతం ఎక్కువ చేసి చూపారని.. జీడీపీ గణాంకాల లెక్కింపు పద్ధతిలో మార్పు వల్లే ఇలా జరిగిందని ఆయన ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.
*ఫ్రాన్స్ వాహన దిగ్గజం రెనో కాంపాక్ట్ బహుళ వినియోగ వాహనం (ఎంపీవీ) ‘ట్రైబర్’ను అంతర్జాతీయంగా భారత్లో విడుదల చేసింది. 2022 నాటికి అమ్మకాలు రెట్టింపు చేసుకోవడమే లక్ష్యమని వెల్లడించింది.
*ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను విక్రయించేందుకు మళ్లీ రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి తాజాగా ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
*శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొనసాగుతున్న జీఎంఆర్ ఏరో టెక్నిక్ లిమిటెడ్కు భారీ పరిశ్రమ-సేవా విభాగంలో ప్రతిష్ఠాత్మకమైన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదరన్ రీజియన్ 5ఎస్ ఎక్సలెన్స్ 2018-19 పురస్కారం దక్కింది.
*హైదరాబాద్ నగరంలోను, శివారు ప్రాంతాల్లోను గోదాములకు విపరీతమైన గిరాకీ ఉన్నట్లు స్థిరాస్తి సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. పారిశ్రామిక నిల్వల అవసరాలకు గోదాములను అద్దెకు తీసుకోవటం ఎన్నో రెట్లు అధికంగా కనిపిస్తోందని వివరించింది.