Devotional

పూరీ జగన్నాధుని ఆలయంలో అన్నీ మిస్టరీలే

Everything is a mystery in puri jagannath temple

1.పూరీ ఆలయంలో వింతలూ, విశేషాలు – ఆద్యాత్మిక వార్తలు
పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిస్టరీయే. అందుకే పూరీ జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు. ఇంతకీ పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న మిస్టరీలేంటో ఓసారి తెలుసుకొండిముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు.. అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే.
*జెండా
ఈ ఆలయ గోపురం పైన ఉండే జెండాకు కూడా ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే.. గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది. కానీ.. ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా.. వ్యతిరేక దిశలో ఊగుతుంది.
*చక్రం
పూరీ జగన్నాథ్ ఆలయం చాలా ఎత్తులో ఉంటుందని తెలిసిందే. ఆ గోపురం పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది. మీరు పూరీలో ఎక్కడ ఉండి అయినా సరే.. ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే.. అది మీ వైపే తిరిగినట్టు కనిపిస్తుంది. అది ఆ చక్రం ప్రత్యేకత.
*అలలు
సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమి వైపునకు ఉంటుంది. పగటి పూట అలా వీస్తుంది. సాయంత్రం పూట భూమి వైపు నుంచి సముద్రం వైపునకు వీస్తుంది. కానీ.. పూరీలో మాత్రం అంతా రివర్స్. దానికి విభిన్నంగా గాలి వీస్తుంది.
*పక్షులు
జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. ఆలయం పైకి పక్షులు వెళ్లవు. పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు.. అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. ఎంతో మంది దీనిపై అధ్యయనం చేసినా కనుక్కోలేకపోతున్నారు.
*గోపురం నీడ
జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. పగలు అయినా.. సాయంత్రం అయినా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు. దీని నిర్మాణం అలా ఉంటుందా? లేక దేవుడి మహిమ వల్ల ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదా? అనేది మాత్రం అంతు చిక్కడం లేదు.
*ప్రసాదం వృథా చేయరు
పూరీ జగన్నాథ్ ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని కొంచెం కూడా వృథా చేయరు. మొత్తం తినేస్తారు.
*అలల శబ్దం
సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు గుడి లోపలికి పెట్టగానే.. సముద్రంలో నుంచి వచ్చే శబ్దం వినిపించదు. కానీ.. అడుగు బయటపెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది
*రథ యాత్ర
పూరీ జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైంది ఇదే. పూరీ రథ యాత్ర. ఈ రథ యాత్రలో రెండు రథాలు ఉంటాయి. శ్రీమందిరం, గుండిజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్లాలి. అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు. మొదటి రథం నది ఇవతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ మూడు చెక్క పడవల్లో దేవతలు నది దాటుతారు. అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండిజా ఆలయానికి తీసుకెళతారు.
*రథాలు
పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. ఆ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి.
*బంగారు చీపురు
రథ యాత్రకు ముందు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చుతారు. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు.
*విగ్రహాలు
ఈ గుడిలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేశారు.
*గుండీజా ఆలయం
ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో విశిష్టత ఏంటంటే.. గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే.. రథం తనంతట తానే ఆగిపోతుంది. దాన్ని ఎవ్వరూ ఆపరు. ఇది కూడా ఇప్పటికీ ఓ మిస్టరీలాగానే ఉండిపోయింది.
*దేవుడికి ప్రసాదం
పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది. ఆలయ సంప్రదాయం ప్రకారం.. వాటిని మట్టి కుండల్లో వండుతారు. దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన ఉండదు. రుచి కూడా ఉండదు కానీ.. దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలకు ఘుమఘుమలాడుతాయి. ఎంతో మధురంగా ఉంటాయి ప్రసాదాలు.
2. జగన్మాత సేవలో మోహన్ భగవత్
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంస్థ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ వచ్చిన ఆయన పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈవో కోటేశ్వరమ్మ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. పశ్చిమ ఏసీపీ సుధాకరరావు, దేవస్థానం అధికారులు శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
3. గవర్నర్ను కలిసిన తితిదే ఛైర్మన్
సామాన్య భక్తులకు స్వల్ప వ్యవధిలో శ్రీవారి దర్శనం లభించేలా సమూల మార్పులు తేవాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. మంగళవారం విజయవాడకు వచ్చిన ఆయనను తితిదే పాలక మండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుమల పవిత్రతను మరింతగా పెంచాలని నరసింహన్ పలు సూచనలు చేశారు. తిరుమలలో కాలుష్యాన్ని తగ్గించటానికి విద్యుత్తు వాహనాలను ప్రవేశపెట్టడం, కొండపై రద్దీ నియంత్రణకు తిరుపతిలోనే వసతి కల్పించేలా చూడటం వంటి మార్పులు చేయనున్నట్లు సుబ్బారెడ్డి గవర్నర్కు వివరించారు. శ్రీవారి చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు.
4. అన్నప్రసాదం పంపిణీలో జాగ్రత్త: తితిదే ఛైర్మన్
రోజూ వేలాది భక్తులకు అందించే అన్నప్రసాదాల్లో కల్తీకి ఆస్కారం లేకుండా చూడాలని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి సూచించారు. తితిదే ధాన్యసేకరణ విభాగం జనరల్ మేనేజర్ జగదీశ్వర్రెడ్డి మంగళవారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తితిదేకు అవసరమైన బియ్యం, నెయ్యి, పప్పుధాన్యాలు, ఎండు ఫలాల(డ్రైఫ్రూట్స్) సేకరణలో పారదర్శకత పాటించాలని, భక్తులకు స్వచ్ఛమైన నీరు అందించాలని తితిదే ఛైర్మన్ ఆదేశించారు. అన్నప్రసాదం కోసం నెలకు అవసరమయ్యే 600 టన్నుల బియ్యాన్ని టెండరు విధానంలో సేకరించేలా ప్రణాళిక రూపొందించాలని జనరల్ మేనేజర్ను ఆదేశించారు.
5. శుభమస్తు ది : 10, జూలై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : నవమి
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 33 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 4 ని॥ వరకు)
నక్షత్రం : చిత్త
(నిన్న సాయంత్రం 5 గం॥ 20 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 25 ని॥ వరకు)
యోగము : శివము
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 33 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 9 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 29 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 10 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 47 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 46 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 20 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 58 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 20 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 3 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 47 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : తుల
6. చరిత్రలో ఈ రోజు/జూలై 10*
1794 : పద్మనాభ యుద్ధం జరిగింది.
1846 : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు.
1916 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభాపతి, కాంగ్రెసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు కోన ప్రభాకరరావు జననం (మ.1990).
0 : ప్రముఖ రంగస్థల నటుడు పీసపాటి నరసింహమూర్తి జననం (మ.2007).
1928 : భారత దేశములో తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వరి జననం (మ.2009).
1939 : ప్రసిద్ధ సాహితీవేత్త మరియు విద్యావేత్త కేతు విశ్వనాథరెడ్డి జననం.
1945 : తెలుగు సినిమా హాస్య నటుడు కోట శ్రీనివాసరావు జననం.
1966 : భారతీయ అతివాద స్వాతంత్ర్య సమరయోధుడు వి.డి.సావర్కర్ మరణం.(జ.1883).
7. శ్రీరస్తు శుభమస్తు
*ది : 10, జూలై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాఢమాసం
తువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సౌమ్యవాసరే (బుధవారం)
పక్షం : శుక్లపక్షం
తిథి : నవమి
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 31 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 3 ని॥ వరకు నవమి తిధి తదుపరి దశమి తిధి)
నక్షత్రం : చిత్త
(నిన్న సాయంత్రం 5 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 22 ని॥ వరకు చిత్త నక్షత్రం తదుపరి స్వాతి నక్షత్రం)
యోగము : (శివం ఈరోజు ఉదయం 10 గం ll 10 ని ll వరకు తదుపరి సిద్ధం రేపు ఉదయం 8 గం ll 4 ని ll వరకు)
కరణం : (బవ ఈరోజు తెల్లవారుఝాము 3 గం ll 33 ని ll వరకు)
(బాలువ ఈరోజు మద్యాహ్నము 2 గం ll 47 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మద్యాహ్నము 12 గం ll 22 ని ll )
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 29 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 9 గం॥ 551ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 25 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 10 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 44 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 34 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 22 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 7 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 37 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 39 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : తుల
8. నేటి సుభాషితం
జీవితంలో భయపడవలసిన, భాదపడవలసిన విషయమేదీ లేదు. దాన్ని అర్థం చేసుకోవటమే ముఖ్యం.*
9. నేటి ఆణిముత్యం
మెచ్చుకోలుతనము తెచ్చు గౌరవ మిల
ఖర్చు కాదు నీకు కాస్తయైన!
ఎదుటవారి ప్రతిభ నెన్ను!తప్పుయెకాదు!
పొంగిపోవు,వారు పొగుడు నిన్ను!
*భావం:
ఎదుటవారు చేసే మంచి పనిని ప్రశంసించడంవల్ల నీకు గౌరవం పెరుగుతుంది.అలా చెప్పడంవల్ల నీ ఆస్తులు ఏవి తరిగిపోవు.ఎదుటవారి గొప్పతనం కొనియాడు.తప్పుకాదు.నువ్వు అలా చేస్తే వాళ్ళు ఎంతో ఆనందపడిపోతారు.నువ్వు ఎదురుపడినప్పుడల్లా నిన్ను పొగుడుతారు.
10. నేటి సామెత
డోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు*
ఇప్పటికే కష్టాలలో ఉన్నవాడు వచ్చి ఇంకా కష్టాలలో ఉన్న మరోక్కడితో తన కష్టాలు మొరపెట్టుకొంటే ఈ సామెత వాడుతారు. డోలుకి ఒక ప్రక్కనే దరువు పడుతూ ఉంటుంది. మద్దెలకి రెండు ప్రక్కల దరువు పడుతుంది. తక్కువ దరువు తింటున్న డోలు, ఎక్కువ దరువు పొందుతున్న మద్దెలకు చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఏమిటి???
11. నేటి జాతీయం
కంటికి రెప్పవోలె
కాపాడుకోవటం……
పిల్లి తన పిల్లల్ల్ని కంటికి రెప్ప లాగ కాపాడు కుంటుంది.
కంటికి రెప్ప భార మగు
తేలికైనదే బరువవటం.తల్లికి పిల్లలు, భూమికి కొండలు, కొండలకు చెట్లు, చెట్లకు కాయలు భారం కావు అంటారు.
** మన ఇతిహాసాలు
ఘటోత్కచునకు ఆపేరే ఎల వచ్చింది?
(భీముడుకి హిడింబికి పుట్టిన వాడు)
భీమసేనుడు ఆమెను పెళ్ళాడిన తరువాత విడిచి వెళ్ళడానికి ఆమె అనుమతిస్తేనే అందుకు అంగీకరిస్తానంటాడు. హిడింబి అందుకు అంగీకరించి భీముని పెళ్ళాడుతుంది. వారికి ఘటోత్కచుడు అనే కుమారుడు కలిగిన తరువాత పాండవులు అక్కడినుండి నిష్క్రమిస్తారు. తల కుండ లాంటి ఆకారంతో ఉండటం వల్ల ఘటోత్కచుడికి ఆ పేరు వచ్చింది. ఘటోత్కచుడు పెరిగి పెద్దైన తరువాత మంచి యోధుడవుతాడు. మహాభారత యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషిస్తాడు.
12. తిరుమల సమాచారం*
ఓం నమో వేంకటేశాయ
ఈరోజు బుధవారం *10-07-2019* ఉదయం *5* గంటల సమయానికి. తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం…… శ్రీవారి దర్శనానికి *12* కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు… శ్రీ వారి సర్వ దర్శనానికి *12* గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *3* గంటల సమయం పడుతోంది..
నిన్న జూన్ *09* న *77,555* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *4.14* కోట్లు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
13. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

శ్రీవారి సర్వదర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.

టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.
14. తిరుమల \|/ సమాచారం* *

_*ఓం నమో వేంకటేశాయ!!*_

• ఈ రోజు బుధవారం,
*10.07.2019*
ఉదయం 5 గంటల
సమయానికి,

_తిరుమల: *22C° – 32℃°*_

• నిన్న *77,555* మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,

• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో *12*
గదుల్లో భక్తులు
చేచియున్నారు,

• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*20* గంటలు పట్టవచ్చును

• నిన్న *29,275* మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు

• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 4.14* కోట్లు,

• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
మూడు గంటల సమయం
పట్టవచ్చును,

*_వయోవృద్దులు మరియు దివ్యాంగుల_*

• ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,

*_చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_*

• సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,

*శ్రీవేంకటేశ్వర సుప్రభాతం*

_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_

15. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటి సమంత
సినీ నటి సమంత బుధవారం బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆమెతోపాటు దర్శకురాలు నందినిరెడ్డి, హీరో తేజ, ఇతర చిత్ర బృందం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో కోటేశ్వరమ్మ అమ్మవారి చిత్రపటాన్ని వారికి అందించారు. సమంత మాట్లాడుతూ దుర్గమ్మని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ‘ఓ బేబీ’ సినిమాని ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

16.జూలై 12 నుండి 14వ తేదీ వరకు
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 12 నుండి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం(అభిధేయక అభిషేకం) జరుగనుంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు ఏడాదికోసారి స్వర్ణకవచాలను తొలగించి శుద్ధి చేసి తిరిగి అమర్చుతారు. ఇందులో భాగంగా జూలై 12న కవచాధివాసం, జూలై 13న కవచ ప్రతిష్ఠ, జూలై 14న కవచ సమర్పణ నిర్వహిస్తారు. ఈ ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం చేపడతారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం శతకలశస్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఏడాదీ ఆషాడ మాసం, జ్యేష్ఠా నక్షత్రం రోజున ఆలయంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు.

17.జూలై 18న అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం అప్ప‌లాయ‌గుంట‌లోని శ్రీ ప్ర‌స‌న్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 18వ తేదీన వార్షిక పుష్పయాగం వైభవంగా జరుగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విధంగానే ఇక్కడ పుష్పయాగం నిర్వహించనున్నారు. జూలై 17వ తేదీ బుధ‌వారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.30 గంటల వరకు అంకురార్పణం జరుగనుంది. జూలై 18వ తేదీ గురువారం ఉదయం 8.00 నుండి 10.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 10.30 నుండి 12.00 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. ఇటీవల శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.