DailyDose

జగన్‌పై దాడిని ముమ్మరం చేసిన భాజపా-రాజకీయ–07/25

Telugu Political News Today - July 25 2019 - జగన్‌పై దాడిని ముమ్మరం చేసిన భాజపా-రాజకీయ–07/25

* ఆంధ్రప్రదేశ్ లో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడికి దిగుతోంది బీజేపీ. ఇప్పటికే జగన్ పై ఆరోపణలు చేస్తున్న బీజేపీ తాజాగా మరోసారి విరుచుకుపడింది. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వానికి వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని ఆరోపించారు. వైయస్ జగన్ చెప్పేవి ఏమీ కింది స్థాయిలో ఏమీ జరగడం లేదన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మతమార్పిడులు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వాలు కుల,మతాలకు అతీతంగా పనిచేయాలని చెప్పుకొచ్చారు. పద్దతి మార్చుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూచిస్తున్నట్లు తెలిపారు. లేనిపక్షంలో రోడ్డెక్కాల్సి వస్తుందని కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక దొరకడం పెద్ద గగనంగా మారిపోయిందన్నారు. ఒకప్పుడు రూ.10వేలకు దొరికే ఇసుక ఇప్పుడు రూ.20 వేలకు కూడా దొరకడం లేదని ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ అంశాలపై సీఎం జగన్ కు లేఖ రాసినట్లు స్పష్టం చేశారు. ఒక ఆరునెలలపాటు అధికారపార్టీకి అవకాశం ఇస్తామని ఆ తర్వాత రోడ్డెక్కుతామని బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు.
* ఇందిరాపార్క్ లో టెన్షన్.. నేతల అరెస్ట్……..
ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు.. సెక్రటేరియట్ కు ర్యాలీగా బయల్దేరి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఐతే.. అప్పటికే భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ర్యాలీలో ప్రజాస్వామిక తెలంగాణ వేదిక నాయకులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, చింతల రామచంద్రారెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అద్దంకి దయాకర్, ఇందిరా శోభన్, పీఓడబ్ల్యూ సంధ్య ఇతరులు పాల్గొన్నారు. వీరిని బలవంతంగా అరెస్ట్ చేసి… వాహనాలు ఎక్కించారు పోలీసులు. బొలారం, గోషామహల్ స్టేడియానికి తీసుకెళ్లారు. కేసీఆర్ నియంతృత్వం నశించాలి.. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.. అంటూ నినాదాలు చేశారు నాయకులు. సెక్రటేరియట్ వరకు శాంతియుత ర్యాలీకి అనుమతివ్వని పోలీసుల తీరును తప్పుపట్టారు.
*ట్విట్టర్ లో లోకేష్…
“మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయి””మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానిదే”ఏమి చెప్పాలనుకుంటున్నారు జగన్ గారు ?మొదటి బడ్జెట్లో మద్యం మీద ఆదాయాన్ని గత ఏడాదికన్నా 2,297 కోట్లు ఎక్కువ అంచనా వేసారు.ప్పుడేమో, ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతుంది అంటున్నారు.ఇక మన వైసీపీ కార్యకర్తలకు కొత్త ఉద్యోగాలు షురు. ఇసుక వాలంటీర్లు తరువాత, మద్యం వాలంటీర్లు. పండగ చేసుకోండి.
*బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కుమారస్వామి
కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. సర్కార్ ఏర్పా టు ప్రక్రియపై బీజేపీ హైకమాండ్ నుంచి ఇంకా గ్రీన్‌ సిగ్నల్ రాలేదు. దీంతో అధిష్టానం ఆదేశాల కోసం రాష్ట్ర బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్-జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ సురేశ్ కుమార్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వారి రాజీనామాలు ఆమోదించిన తరువాతే తదుపరి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. బలాబలాల లెక్కలు చూసుకున్నాకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఢిల్లీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్టు టాక్‌. బుధవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం మరింత ఉత్కంఠ రేపుతోంది.
*అసెంబ్లీ సీట్ల పెంపుపై ఈసీకి హోంశాఖ నోట్
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కసరత్తు కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు సిక్కిం, జమ్మూకాశ్మీర్‌ రాష్ర్టాల విధాన సభల్లో సీట్ల పెంపునకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనను లోక్సభ ఎన్నికల కన్నా ముందే హోం శాఖ తమకు పంపినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. అయితే పంపిన నోట్‌ సరిగా లేదని.. సరైన సమాచారంతో మరోసారి పంపాలని హోంశాఖను ఈసీ కోరింది. విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్‌ అనే వ్యక్తి ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాను సమాచార హక్కు చట్టం ద్వారా అడిగి వివరాలు సేకరించారు.
*వైసీపీ కార్యకర్తలూ.. పండుగ చేసుకోండి: లోకేశ్
మద్యం విషయంలో ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా ఒకదానికొకటి పొంతన లేని స్టేట్మెంట్లు ఇచ్చారని, అసలు ఇంతకీ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రశ్నించారు. జగన్ ట్వీట్‌పై లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా సెటైరికల్‌గా స్పందించారు. ‘‘మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయి’’, ‘‘మద్యం అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదే’’ అని ఒకదానితో ఒకటి పొంతన లేని స్టేట్మెంట్లు ఇచ్చారని లోకేశ్ ట్వీట్ చేశారు. ‘‘అసలింతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. మొదటి బడ్జెట్లో మద్యం మీద ఆదాయాన్ని గత ఏడాదికన్నా రూ. 2,297 కోట్లు ఎక్కువ అంచనా వేసారు. ఇప్పుడేమో, ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతుంది అంటున్నారు. ఇక మన వైసీపీ కార్యకర్తలకు కొత్త ఉద్యోగాలు షురూ. ఇసుక వాలంటీర్లు తరువాత, మద్యం వాలంటీర్లు.. పండగ చేసుకోండి’’ అంటూ తనదైన శైలిలో సెటైర్ వేశారు.
*ఎవరడిగారని కొత్త నిర్మాణాలు?: కొండా విశ్వేశ్వరరెడ్డి
ఎవరు అడిగారని కొత్త సెక్రటేరియట్, కొత్త అసెంబ్లీ నిర్మాణం చేస్తున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..చరిత్ర ఉండకూడదని కేసీఆర్ ఇవన్నీ చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు కూడా కొత్త సెక్రటేరియట్ వద్దని నిరసన చేపట్టాలని కొండా విశ్వేశ్వరరెడ్డి కోరారు. సంక్షేమ పథకాలకు కూడా పైసలు లేవని.. ముందు వాటికి డబ్బులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
*చంద్రబాబుపై దాడికి కుట్ర జరుగుతోంది: బుద్దా వెంకన్న
చంద్రబాబుపై దాడికి కుట్ర జరుగుతోందని టీడీపీ మండలి విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు. దీని కోసం కొందరు సభ్యులను జగన్ రౌడీల్లా తయారు చేశారని పేర్కొన్నారు. వారందరినీ టీడీపీ సభ్యుల వైపు కూర్చోపెట్టి ఇబ్బంది పెడుతున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. కోటంరెడ్డి, కారుమురి నాగేశ్వరరావు, బీఏ మధుసూదనరెడ్డి ఈ ముగ్గురు సభ్యులను చంద్రబాబుపై దాడి కోసమే పెట్టారని పేర్కొన్నారు.అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుని ఎన్నో అవమానాలకు గురిచేస్తున్నారని బుద్దా వెంకన్న వాపోయారు. అధికారపక్ష సభ్యుల ఏకవచన విమర్శలు, చేసే అవమానాలను చూపించటం లేదని విమర్శించారు. చంద్రబాబుని ఇబ్బంది పెట్టడం ద్వారా తెలుగుజాతిని అవమానిస్తున్నారని మరచిపోవద్దన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం ఎంత ముందుకెళ్లిందో.. జగన్ సీఎం అయ్యాక అంత వెనక్కి పోతోందని విమర్శించారు. రాష్ట్రంపై అపనమ్మకంతో ఇప్పటికే ఎన్నో పెట్టుబడులు వెనక్కి పోయాయని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
*జగన్‌వి పొంతనలేని ప్రకటనలు:లోకేశ్‌
మద్యం అమ్మకాలపై ముఖ్యమంత్రి జగన్‌ పొంతన లేని ప్రకటనలు ఇచ్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ కౌంటర్‌ ట్వీట్‌ చేశారు.మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయి అంటూనే మద్యం అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదని ఎలా చెబుతారని నిలదీశారు. అసలింతకీ జగన్ ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మొదటి బడ్జెట్లో మద్యం మీద ఆదాయాన్ని గత ఏడాదికన్నా 2,297 కోట్ల ఎక్కువ అంచనా వేసి, ఇప్పుడేమో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తుందనడంపై లోకేశ్‌ మండిపడ్డారు. దీనిని బట్టి వైకాపా కార్యకర్తలకు ఇక కొత్త ఉద్యోగాలు ఖరారయ్యాయని విమర్శించారు. ఇసుక వాలంటీర్లు ఆ తర్వాత మద్యం వాలంటీర్లు పండగ చేసుకోండంటూ ఎద్దేవాచేశారు.
*ఎంపీ గారూ..కాస్త పద్ధతిగా మాట్లాడండి!-సొంత పార్టీ నేతపై స్మృతి ఇరానీ ఆగ్రహం
కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ..సొంత పార్టీ ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోక్సో చట్టం-2019 బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టే సమయంలో భాజపాకు చెందిన ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎంపీ హర్‌నాథ్‌సింగ్‌ యాదవ్‌ అభ్యంతరకరంగా మాట్లాడారు. దీనిపై స్పందించిన స్మృతి ఆయనకు గట్టి క్లాస్‌పీకారు. లైంగిక దాడులు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? ఎందుకొస్తున్నాయి? ఓసారి నా స్నేహితుడు నా వద్దకు వచ్చి పోర్నోగ్రపీ గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. నేను పాప్‌కార్న్‌ గురించి విన్నాను. కానీ పోర్న్‌ గురించి ఎప్పుడూ వినలేదు. ఇక సోషల్‌ మీడియా ప్రభావం పిల్లల మీద ఎంతో ఉంటుంది. ఉదాహరణకు పిల్లలకు సత్య హరిశ్చంద్రుడి సినిమా చూపిస్తే..మంచి మనిషిగా మారడం ఎలాగో వాళ్లకి తెలుస్తుంది. కానీ ఇప్పటి పిల్లలకు ‘మున్నీ బద్నాం హూయి’, ‘చక్నీ ఛమేలీ’ వంటి పాటలు చూపిస్తే ఎలా. వారి మనసు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి సత్యహరిశ్చంద్ర, ఈ పాటల్లో ఏవి ఎక్కువగా ప్రభావం చూపుతాయి?’ అని హర్‌నాథ్‌ అన్నారు.
*ఇది ఆరంభం మాత్రమే: చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం ఉదయం అసెంబ్లీ గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. తమ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. సభను నడిపించేది స్పీకరా?లేదా ముఖ్యమంత్రా? అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ‘స్పీకర్ ఏకపక్ష వైఖరి వీడాలి’ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. పోరాటాలు ఇంకా ముమ్మరం చేస్తామని, ఇది ఆరంభం మాత్రమేనని చంద్రబాబు వెల్లడించారు.
*మద్యపాన నిషేధంపై స్పందించిన జగన్‌
మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాటిచ్చానని ఇందులో భాగంగానే మద్యం నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్టు దుకాణాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు జగన్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ నూతన చట్టాన్ని తెచ్చామన్నారు. గ్రామాల్లో మద్యం బెల్టులు పూర్తిగా మూతపడతాయని సీఎం జగన్‌ అన్నారు.
*మధ్యప్రదేశ్లో భాజపాకు ఝలక్!
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న ఆనందంలో ఉన్న భాజపా నేతలకు మధ్యప్రదేశ్లో చిన్న ఎదురుదెబ్బ తగిలింది. కమలం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుకు మద్దతుపలికారు. అసెంబ్లీలో బుధవారం ఓ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా నారాయణ్ త్రిపాఠి, శరద్ కోల్ అనే ఇద్దరు భాజపా శాసనసభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు.
*మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీలు 54శాతం ఉన్నట్లు లెక్కలు తేల్చిన ప్రభుత్వం వాటి వివరాలను హైకోర్టు, సుప్రీంకోర్టుకు నివేదించాలన్నారు. ‘మున్సిపల్ ఎన్నికలు- బీసీ రిజర్వేషన్లు’ అంశంపై బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలను ఏ,బీ,సీ,డీ,ఈలుగా వర్గీకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒకవైపు భాజపా బలపడుతోందని, మరోవైపు ప్రజావ్యతిరేకత పెరుగుతోందన్న కారణంతో తెరాస ప్రభుత్వం హడావుడిగా పురపాలక ఎన్నికలకు సమాయత్తమైందన్నారు. సమావేశంలో జాజుల శ్రీనివాస్గౌడ్, ఎర్ర సత్యనారాయణ, నాగరాజు, మల్లయ్య, డీజీ నర్సింహారావు, బాలమల్లేష్, ఆశయ్య తదితరులు పాల్గొన్నారు.
*సర్కారు ఏర్పాటుపై భాజపా ఆచితూచి
కన్నడనాట కుమారస్వామి సర్కారు పతనం అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై భాజపా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే సీఎం అభ్యర్థి యడ్యూరప్పే అన్న సందేశం పార్టీ శ్రేణులకు వెళ్లింది. బెంగళూరులోని ఆయన నివాసం వద్ద బుధవారం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గురువారం లేదా శుక్రవారమే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించినా ఆ దిశగా అధిష్ఠానం నుంచి సంకేతాలు రాలేదు. మరోవైపు రాజీనామాచేసిన 15మంది సభ్యుల భవిష్యత్తు ఇంకా తేలలేదు. వీరి రాజీనామాలు ఆమోదించటమో, తిరస్కరించటమో, అనర్హత వేటు వేయటమో ఏదో ఒక స్పష్టత వస్తే కానీ భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కాదు.
*శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పూర్తిచేయాలి
త్వరలో పురపాలక ఎన్నికలు జరిగే వీలున్నందున రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వెంటనే పూర్తిచేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్ఠానం మంత్రులు, ఎమ్మెల్యేలను బుధవారం ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడవచ్చని దీనికి అనుగుణంగా సన్నద్ధం కావాలని సూచించింది. ఆదేశాలు రావడంతో మంత్రులు జిల్లాల్లో, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికలు జరగనున్న నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు మంజూరైన ప్రత్యేక నిధులతో శంకుస్థాపనలు చేపట్టనున్నారు.
*శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పూర్తిచేయాలి
త్వరలో పురపాలక ఎన్నికలు జరిగే వీలున్నందున రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వెంటనే పూర్తిచేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్ఠానం మంత్రులు, ఎమ్మెల్యేలను బుధవారం ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడవచ్చని దీనికి అనుగుణంగా సన్నద్ధం కావాలని సూచించింది. ఆదేశాలు రావడంతో మంత్రులు జిల్లాల్లో, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికలు జరగనున్న నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు మంజూరైన ప్రత్యేక నిధులతో శంకుస్థాపనలు చేపట్టనున్నారు.
*భాజపా సభ్యత్వ నమోదు యాప్ ప్రారంభం
భాజపాలో క్రియాశీల సభ్యత్వాన్ని నమోదు చేసుకునేందుకు రూపొందించిన ‘బీజేపి4టీఎస్’ యాప్ బుధవారం ప్రారంభమైంది. భాజపా సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఇక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దానిని ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 లక్షల సభ్యత్వ నమోదు ఉండగా.. మరో 18 లక్షలు చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించారని, ఆగస్టు 11వ తేది నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. భాజపా నేతలు ఎన్.ఇంద్రసేనారెడ్డి, ధర్మారావు, కాసం వెంకటేశ్వర్లు, వి.సుధాకర్శర్మ తదితరులు పాల్గొన్నారు.
*ఖమ్మం మేయర్పై మరోమారు అసమ్మతి గళం
ఖమ్మం నగరపాలక మేయర్ డా.పాపాలాల్కు వ్యతిరేకంగా మరోమారు తెరాస కార్పొరేటర్లు అసమ్మతి గళం వినిపించారు. మేయర్ వ్యవహార శైలి సరిగా లేదంటూ 2018 మే నెలలో అప్పటి రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి, ప్రస్తుత తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కలిశారు. నాడు ఆయన కార్పొరేటర్లకు సర్దిచెప్పి పంపించారు. అయినా మేయర్ తీరు మారడం లేదని, డివిజన్లలో పర్యటించే సమయంలో ముందస్తుగా సమాచారం ఇవ్వడంలేదని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమే!
పోలీసులు జగిత్యాల జిల్లాలో 380 మందికిపైగా సర్పంచులను గంటల తరబడి నిర్బంధించడం ప్రజాస్వామ్యం పీక నొక్కడమేనని భాజపా ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ అన్నారు. వారు దిల్లీలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, దీనిపై విచారణ అవసరమన్నారు. గ్రామప్రజలంతా ఎన్నుకున్న ప్రతినిధులైన సర్పంచులకే ఒకప్పుడు చెక్ పవర్ ఉండేదని, ఆ తర్వాత ఉప సర్పంచికీ ఆ అధికారం ఇవ్వడం సరికాదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించారు. వారిద్దరూ వేర్వేరు పార్టీలవారైతే చెక్ పవర్ను ఎలా వినియోగించుకుంటారు,
*జగన్ పాలనకు భయపడుతున్న ప్రజలు: రామ్మాధవ్
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలన చూసి రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారని భాజపా ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ పేర్కొన్నారు. తెదేపా పాలనపై విసుగుచెంది ప్రజలు గత్యంతరం లేని పరిస్థితుల్లో వైకాపాను గెలిపించారన్నారు. తెదేపా, వైకాపా దొందూ దొందేనని విమర్శించారు. రాష్ట్రంలో భవిష్యత్తు భాజపాదేనని ధీమా వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి బుధవారం రామ్మాధవ్ సమక్షంలో భాజపాలో చేరారు. ఈ సందర్భంగా పోతవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీని దేశ ప్రజలు 20 నుంచి 25 సంవత్సరాలపాటు ప్రధానిగా చూడాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు పాలన అవినీతికి మారుపేరుగా సాగిందన్నారు. తెదేపాకు చెందిన పలువురు భాజపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.
*6 నెలలు రాజకీయాలకు దూరం: రఘువీరారెడ్డి
ఆరు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి వెల్లడించారు. తిరుమల శ్రీవారిని బుధవారం దర్శించుకున్న ఆయన ఆలయం ఎదుట విలేకరులతో మాట్లాడుతూ.. తన స్వగ్రామమైన అనంతపురం జిల్లాలోని నీలకంఠాపురంలో దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సంబంధిత ఆలయ నిర్మాణం పూర్తి చేసే వరకు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన తెలిపారు.
*మోదీ సమక్షంలో భాజపాలో చేరుతా -సినీనటి ప్రియారామన్
ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని ప్రముఖ సినీనటి ప్రియారామన్ అన్నారు. తిరుపతిలో బుధవారం జరిగిన భాజపా సమావేశంలో ఆమె మాట్లాడారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి ఆధ్వర్యంలో మోదీ సమక్షంలో పార్టీలో చేరుతానని తెలిపారు. నరేంద్ర మోదీ అంటే తనకు అభిమానమని అన్నారు. సమాజానికి సేవ చేయడం ద్వారా ప్రజ ల మన్ననలు పొందొచ్చని చెప్పారు.
*మద్య నిషేదంపై ముఖ్యమంత్రి జగన్‌ ట్వీట్‌
అమరావతిరాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికాబద్ధ కార్యచరణకు ఉపక్రమించారు.అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘మద్య నియంత్రణ చట్ట సవరణ’ బిల్లును రాష్ట్ర శాసనసభ బుధవారం ఆమోదించింది.మద్య నిషేదం దిశగా అడుగులేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని, అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాను.షేధం దిశగా అడుగులేస్తూ బెల్టుషాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం.మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చాం.తద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతబడతాయి’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.