DailyDose

చీరాల ఎమ్మెల్యే బలరాంపై కేసు నమోదు-నేరవార్తలు–08/29

Criminal Case On Karanam Balaram-Telugu Political News-Aug292019

* చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిపై బుధవారం చీరాల ఒన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్‌ యడం రవిశంకర్‌ను దుర్భాషలాడి, బెదిరించడంతో ఆయన వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు సూచనల మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.
* వేధింపులకు పాల్పడిన యువకుడికి ఓ మహిళ దేహశుద్ధి చేసింది. భార్యాభర్తలు యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావికి చెందిన శ్రీశైలం అనే యువకుడు అదే కాలనీకి చెందిన వివాహిత పట్ల కొంతకాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో విసుగెత్తిన సదరు మహిళ తన భర్తతో కలిసి యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.
* జూబ్లీహిల్స్‌ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీని ఆనుకొని ఉన్న బూత్‌బంగ్లాలో రెండేళ్ల క్రితం వేసిన రంగస్థలం సినిమా సెట్‌ అనుమానాస్పద స్థితిలో దగ్ధమైంది. బుధవారం ఉదయం సెట్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగుతూ గ్రామీణ వాతావరణం కోసం వేసిన గుడిసెలన్నీ కాలిపోయాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా అప్పటికే 25 గుడిసెలు అంటుకున్నాయి.
* పలు టీవీ సీరియల్స్‌తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నళినీ నేగి తనపై దాడి జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించారు. తన రూమ్‌మేట్‌ ప్రీతీ రానా, ఆమె తల్లితో కలిసి తనమీద భౌతికదాడికి దిగినట్టుగా కంప్లయింట్‌లో పేర్కొన్నారు. కొంతకాలం తన ఇంట్లో ఉండేందుకు రిక్వెస్ట్ చేసిన ప్రీతి రానా, ఆమె తల్లి స్నేహలత రానాలను ఖాళీ చేయాల్సిందిగా కోరటంతో వారు దాడికి దిగినట్టుగా నళిని వెల్లడించారు.
* ఎయిర్ ఇండియా రీజనల్ డైరెక్టర్ రోహిత్ బాసిన్ తో ఆ సంస్థ బలవంతంగా రాజీనామా చేయించింది. జూన్ 22న ఆయన సిడ్నీ విమానాశ్రయంలోని ఓ దుకాణం నుంచి పర్సును చోరీ చేయడమే ఇందుకు కారణం. వీఆర్ ఎస్ వెసులుబాటును కల్పించాలని రోహిత్ కోరినా అందుకు అధికారులు అంగీకరించలేదు.
* తమ్ముడి మృతి తట్టుకోలేక సోదరి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జవహర్నగర్ పోలీ్సస్టేషన్ పరిధిలో జరిగింది.
* ఇంట్లో చోరీ కేసులో నిందితుడిని పట్టుకున్న పోలీసులు తనకు బంగారం గొలుసు బదులు గిల్టు నగ ఇచ్చారని బాధితురాలు నందిగామ డీఎస్పీ రమణమూర్తికి బుధవారం ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచర్ల గ్రామానికి చెందిన జవ్వాజీ కళావతి ఇంట్లో 11 నెలల కింద చోరీ జరిగింది.
*డ్రైవర్ మద్యం మత్తు.. ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది.
*విశాఖ జిల్లా అనకాపల్లిలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. అనుమానంతో ప్రేమించిన అమ్మాయిపై కత్తితో దాడి చేశాడు.
*చర్లపల్లి పారిశ్రామికవాడలోని రసాయన విభాగంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం కారణంగా అపార నష్టం కలిగింది. దాదాపు రూ.40 కోట్ల విలువగల ఎరువులు ఆహుతయ్యాయి.
*పోలీసులు కేసు పెట్టారేమోనని భయపడి 17 ఏళ్ల బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకుంది.
*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై ఫేస్బుక్లో అనుచిత పోస్టులు పెట్టిన యువకుడిని విజయవాడ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
*భూ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
*భూ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
*సరుబుజ్జిలి మండల పరిషత్తు అధికారి(ఎంపీడీవో) దామోదరరావును సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో దుర్భాషలాడిన ఘటనలో తెదేపా నేత, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ సహా మరో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
* పోలీసు కస్టడీ నుంచి రిమాండ్ ఖైదీ తప్పించుకున్న ఘటనలో రిజర్వ్ పోలీసు బలగానికి చెందిన ఇద్దరిని సస్పెండ్ చేస్తూ గుంటూరు రూరల్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
* నకిలీ ఈ-మెయిళ్లతో మోసగించి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమానాన్ని నడపడానికి ప్రయత్నించిన బీఎస్ఎఫ్ మాజీ పైలట్ వింగ్ కమాండర్ జె.ఎస్. సంగ్వాన్పై దర్యాప్తు మొదలైంది.
*అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దినేశ్ చావ్లా(56)ను విమానాశ్రయంలో లగేజీ అపహరణ అభియోగాలతో పోలీసులు అరెస్టు చేశారు.
*మనీ సర్క్యులేషన్ నేరాన్ని ఎదుర్కొంటున్న ‘ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్’ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధేశ్యాం వాంగ్మూలం తీసుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు మంగళవారం హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.
* అటవీ అధికారిణిపై కాగజ్నగర్ వద్ద దాడి కేసులో నిందితుడైన ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణతో పాటు 16మంది నిందితులకు మంగళవారం హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.
*రెక్కీ నిర్వహించి ఓ ఆగంతకుడు హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన సంఘటన ఇది. ఈ చోరీలో దాదాపు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల విలువైన బంగారు వజ్రాభరణాలు మాయమయ్యాయి.