Movies

వెనక్కు తగ్గే అలవాటు లేదు

వెనక్కు తగ్గే అలవాటు లేదు

‘‘సున్నిత మనస్కురాలినే. కానీ చిన్న విషయాలకే ధైర్యం కోల్పోయి వెనక్కి తగ్గే అలవాటు లేదు. అడ్డంకులు ఎన్నున్నా… అనుకొన్నది సాధించడంపైనే దృష్టి ఉంటుంది. అదే నాకు బలం’’ అంటోంది రష్మిక. వరుస అవకాశాలతో దూసుకెళుతున్న కథానాయిక ఈమె. మహేష్బాబు, నితిన్లతో కలిసి సినిమాలు చేస్తోంది. త్వరలోనే అల్లు అర్జున్తోనూ జోడీ కట్టబోతోంది. విమర్శల్ని మీరు చూసే కోణం ఎలా ఉంటుందని అడిగితే… ‘‘సద్విమర్శల్ని స్వీకరించ డానికి ఎప్పుడూ సిద్ధమే. మన చుట్టూ ఉన్న వాళ్లంతా ఆహా ఓహో అని పొగుడుతూ ఉన్నా కష్టమే కదా. అలా చేస్తే మన తప్పుల్ని సరిదిద్దుకొనే అవకాశమే ఉండదు. అలాగని విమర్శలు నన్ను అస్సలు బాధ పెట్టవని, ఎవరేమన్నా ఎప్పట్లాగే నవ్వుతూనే ఉంటానని చెబితే అది అబద్ధమే అవుతుంది. మింగుడు పడని మాటలు విన్నప్పుడు అందరిలాగే నాకూ బాధ కలుగుతుంది. కానీ అదే పనిగా బాధపడి ఏం లాభం? అది వాళ్ల అభిప్రాయం. నేనైతే మార్చలేను కదా. అందుకే నా దగ్గరికి వచ్చిన ఆ విమర్శ ఎలాంటిది? దాన్నుంచి నేనేమైనా నేర్చుకోవల్సింది ఉందా అని మాత్రమే ఆలోచిస్తా. ఆ వెంటనే పనిపై దృష్టి పెడుతుంటా’’ అంది రష్మిక.