Sports

సింధుగా సమంత

సింధుగా సమంత

అంత‌ర్జాతీయ పోటీల్లో అనేక ప‌త‌కాలు పొందిన తెలుగు తేజం పీవీ సింధు రీసెంట్‌గా జ‌రిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకుంది. ఆమె గెలుపుని ప్ర‌తి ఒక్క‌రు గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్నారు. కొంద‌రు పీవీ సింధు జీవితానికి సంబంధించి పూర్తి వివ‌రాలు కూడా తెలుసుకునే ప‌నిలో ప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఆమెపై బ‌యోపిక్ తీసేందుకు సోనుసూద్ ముందుకు వ‌చ్చారు. ఈ బయోపిక్ ను తాను నిర్మిస్తూనే, ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పాత్రలో కూడా నటించనున్నారు. అయితే పీవీ సింధు పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై కొద్ది రోజులుగా చర్చ‌లు జ‌రుగుతుండ‌గా, అక్కినేని కోడ‌లు స‌మంత‌ని ఫైన‌ల్ చేసార‌నే టాక్ న‌డుస్తుంది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న స‌మంత అయితేనే పీవీ సింధు పాత్ర‌కి స‌రిగ్గా స‌రిపోతుంద‌ని సోనూసూద్ భావించాడ‌ట‌. దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది. మ‌రోవైపు పీవీ సింధు కోచ్ గోపిచంద్ బయోపిక్ కూడా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుండ‌గా ఈ చిత్రాన్ని ప్ర‌వీణ్ స‌త్తారు తెర‌కెక్కించ‌నున్నాడు.