Devotional

భాద్రపదం వచ్చింది…భాగ్యాలను తెచ్చింది

The importance of bhadrapada masam in hindu astrology

హైందవ సంప్రదాయంలో ప్రతి మాసానికీ ఏదో ఒక విశేషం ఉంటుంది. వాటిల్లో ముఖ్యమైంది భాద్రపదం. చాంద్రమానం ప్రకారం పౌర్ణమి రోజున చంద్రుడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో సంచరించడం వల్ల ఈ మాసానికి భాద్రపదం (31 ఆగస్టు నుంచి) అనే పేరువచ్చింది. తొలిపూజలందుకునే వినాయకుడు పుట్టిందీ, స్థితికారకుడైన శ్రీహరి భక్తులను రక్షించడానికి వరాహ, వామనావతారాలు ధరించిందీ ఈ మాసంలోనే.
**భాద్రపద మాసంలో వచ్చే అతి పెద్ద పండగ వినాయక చవితి. ఊరూవాడా చిన్నాపెద్దా అన్న తేడాలేకుండా ప్రతి ఒక్కరూ గణనాథుడిని శక్తిమేర పూజిస్తారు. అయితే దానికంటే ముందు వచ్చే విశేషం… శుద్ధ తదియనాటి వరాహ జయంతి. కల్పాంత సమయంలో భూమి మొత్తం జలమయమైపోయింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు మనువును పిలిచి భూమిని పాలించాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మనువు నీట మునిగిన భూమిని పైకి తీసుకురావాల్సిందిగా బ్రహ్మను ప్రార్థిస్తాడు. ఆ సమయంలోనే బ్రహ్మ తుమ్మగా ఆ తుమ్ము నుంచి యజ్ఞవరాహమూర్తి పుడతాడు. యజ్ఞవరాహం అంటే యజ్ఞంలో ఉపయోగించే ద్రవ్యాలనే శరీరభాగాలుగా కలిగినవాడని అర్థం. బొటన వేలంత దేహంతో పుట్టిన స్వామి క్షణాల్లో ఆకాశమంత ఎత్తు పెరిగిపోతాడు. హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి మరీ సముద్రంలో ఉన్న భూమిని పైకెత్తి తన కోరలమీద నిలబెట్టాడు. విష్ణుమూర్తి ధరించిన దశావతారాల్లో మూడో అవతారమే వరాహ అవతారం. ఆ రోజు మరో విశేషం కూడా ఉంది. అదే పదహారు కుడుముల తద్దె. ఆ రోజున గౌరీదేవిని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయంటారు.
భాద్రపద శుద్ధ చవితినే వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో గణపయ్యను పూజిస్తే విద్యాబుద్ధులతోపాటు సకల సంపదలూ లభిస్తాయి. మర్నాడు రుషి పంచమి. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడే స్వయంగా ధర్మరాజుతో చెప్పాడంటారు. ఈ వ్రతం చేసేటప్పుడు కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు మొదలైన సప్తరుషులతోపాటు అరుంధతీ దేవినీ ఆరాధించాలి.ఆ తర్వాతి రోజు షష్ఠి. దీన్నే స్కంద షష్ఠి, సూర్యషష్ఠి అని కూడా అంటారు. నిజానికి మాఘమాసంలో మాదిరిగానే భాద్రపద మాసంలో వచ్చే అన్ని ఆదివారాలూ సూర్యభగవానుడిని అర్చించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని చెబుతారు. ఈ నెలలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశినాడు పాలసముద్రంలో శేషతల్పంమీద శయనించిన విష్ణుమూర్తి పరివర్తన ఏకాదశి రోజున మరో పక్కకి ఒత్తిగిలుతాడు. ఈ రోజంతా ఉపవాసం ఉండి శ్రీహరిని స్మరిస్తే కరవుకాటకాలు దరిచేరవట.
**భాద్రపద మాసం శుక్ల పక్షంలో వచ్చే మరో ప్రత్యేక తిథి ద్వాదశి. శ్రవణా నక్షత్రం ఉన్న ఈ రోజునే వామనావతారానికి శ్రీకారం చుట్టాడు శ్రీహరి. ప్రహ్లాదుడి మనవడైన బలిచక్రవర్తి పరమ ధార్మికుడు. అతడు స్వర్గాన్ని జయించడంతో దేవతలు అక్కణ్ణుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. బలిచక్రవర్తిని సంహరించకుండానే అతడి నుంచి స్వర్గాన్ని తీసుకుని దేవతలకు ఇచ్చేందుకు… అదితి, కశ్యప ప్రజాపతులకు బిడ్డగా జన్మిస్తాడు శ్రీహరి. సకల భూమండలాన్నీ స్వర్గాన్నీ దానంగా పొందుతాడు. దానికి ప్రతిగా సుతల లోకాన్ని బలిచక్రవర్తికి ఇచ్చి, చివరిలో మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఈ రోజున శ్రీహరిని స్మరించినంతనే మోక్షం లభిస్తుందట. పౌర్ణమి రోజున ఉమామహేశ్వర వ్రతాన్ని చేస్తారు. పార్వతీదేవి ఈ వ్రతాన్ని చేసి శివుడి శరీరంలోని అర్ధభాగాన్ని మళ్లీ పొందిందని చెబుతారు.
**హాలయ పక్షాలు
భాద్రపద బహుళ పాడ్యమి నుంచీ మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి. దీన్నే పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెబుతారు. ఈ పదిహేను రోజులూ నిత్యం తర్పణాలు వదలడం, శ్రాద్ధ విధులను నిర్వహించడం ద్వారా పితృదేవతల అనుగ్రహాన్ని పొందుతారు. పాడ్యమి నుంచి అమావాస్యవరకూ వీటిని ఆచరించలేని వారు కనీసం మహాలయ అమావాస్య రోజైనా పితృదేవతల ఆరాధన చేయాలి. భాద్రపద బహుళ తదియను ఉండ్రాళ్ల తదియ ఉంటారు. అట్ల తద్దె మాదిరిగానే ఉండ్రాళ్ల తద్దెనాడు కూడా పెళ్లీడుకొచ్చిన కన్నెపిల్లలు గౌరీదేవిని పూజించి నైవేద్యం పెడతారు. ఇంత విశేషమైన మాసం కాబట్టే కలియుగం భాద్రపద మాసంతోనే మొదలైందంటారు. భాద్రపదం అంటే కేవలం ఒక మాసాన్నో ఒక నక్షత్రాన్నో కాకుండా ప్రజలంతా భద్రంగా ఉండాలన్న ఆకాంక్షనూ సూచిస్తుందని పెద్దలు చెబుతారు.
2. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 3 గంటలు, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 58,725 మంది భక్తులు దర్శించుకోగా, 22,803 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.82 కోట్లు.
3. శుభమస్తు
తేది : 31, ఆగష్టు 2019
వత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పాడ్యమి
(నిన్న సాయంత్రం 4 గం॥ 7 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 12 గం॥ 14 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వఫల్గుణి
(నిన్న సాయంత్రం 5 గం॥ 12 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 9 ని॥ వరకు)
యోగము : సిద్ధము
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 34 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 8 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 52 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 8 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 56 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 31 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 41 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 34 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 22 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 1 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 31 ని॥ లకు
సూర్యరాశి : సింహము
చంద్రరాశి : సింహము
4. చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 31*
1864 : హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జననం (మ.1945).
1925 : సినీగీత రచయిత, సాహితీకారుడు ఆరుద్ర జననం (మ.1988).
1932: తెలుగు కథా రచయిత. రావిపల్లి నారాయణరావు జననం.
1934 : తెలుగు సినిమా రచయిత రాజశ్రీ జననం (మ.1994).
1944 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు క్లైవ్ లాయిడ్ జననం.
1949 : అమెరికా నటుడు రిచర్డ్ గేర్ జననం.
1969 : మాజీ భారత క్రికెట్ క్రీడాకారుడు జవగళ్ శ్రీనాథ్ జననం.
1907 : ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రామన్ మెగసెసే జననం (మ.1957).
1997 : బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ మాజీ భార్య ప్రిన్సెస్ డయానా దుర్మరణం (జ.1961).
2014: ప్రముఖ చిత్రకారుడు బాపు మరణం (జ.1933).
5. శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము(అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్)
కదిరి 31.08.2019 వతేది, *శనివారము ఆలయ సమాచారం*

*_శ్రీస్వామి వారి దర్శన వేళలు_*
ఉదయము 5.30 గంటలకు అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ..స్వామి వారి దర్శనము ఉదయము 6.00 గంటల నుండి 7.30 గంటలకు వుండునుఅనంతరము ఉదయం 7.30 గం|| నుండి అర్జిత అభిషేక సేవ సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటల నుండి 9.30 గంటల వరకు )స్వామి వారి దర్శనము ఉదయము 10.00 గంటల నుండి మ. 12.00 గంటలకు వుండునురెండవ మహాగంట నివేదనమ.12.00 నుండి 12.30 లోపు, బాలబోగ్యం త్రికల నైవేద్యాము సమర్పణ..మ 1.00 నుండి 1.30 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును.. మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.30 నుండి 7.00 లోపు, బాల బోగ్యం త్రికల నైవేద్యాదులు సమర్పణ. మహ మంగళ హారతి, పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ.. తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 7.00 గంటల నుండి రా.8.30 వరకు వుండును..
రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
*ఆర్జిత సేవాల వివరములు*
*31.08.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్: 42*
*31.08.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్ : 6*
6. తిరుమల \|/ సమాచారం* *
_*ఓం నమో వేంకటేశాయ!!*_
• ఈ రోజు శనివారం,
*31.08.2019*
ఉదయం 6 గంటల
సమయానికి,
_తిరుమల: *22C°-28℃°*_
• నిన్న *58,725* మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని *01*
గదులలో భక్తులు
చేచియున్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*03* గంటలు పట్టవచ్చును
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 2.82* కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,

*_వయోవృద్దులు మరియు దివ్యాంగుల_*
• ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ:10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
*_చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_*
• సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
*శ్రీవేంకటేశ్వర సుప్రభాతం*
_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_
*తా:* _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_
_కావున లెమ్ము స్వామి_

7. టీటీడీ బోర్డులో వీళ్లొద్దు: చిలుకూరు రంగరాజన్‌
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులుగా కొందరు వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయని, వీరిని ఖరారు చేయొద్దని సీఎం జగన్‌కు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్‌ విన్నవించారు. శుక్రవారం ఆయన మీడియా ద్వారా సీఎంకు ఓ సందేశం పంపారు. తనకు అందిన సమాచారం మేరకు కొందరిపై కోర్టు కేసులు కూడా ఉన్నాయని, మరికొందరు జైలుకు వెళ్లివచ్చినవారూ ఉన్నారని పేర్కొన్నారు.
8. తిరుమల ….జూలై మాసంలో రికార్డు స్థాయిలో స్వామివారికి హుండిలో బంగారాని సమర్పించిన భక్తులు. జూలై మాసంలో 130 కేజిల బంగారాని సమర్పించిన భక్తులు.