NRI-NRT

నాట్స్ మహిళల వాలీబాల్ పోటీల విజేత డెట్రాయిట్

NATS Womens Volleyball Throwball Tournament

కొలంబస్ నాట్స్ సెంట్రల్ ఓహియో విభాగం వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు నిర్వహించింది. అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న తెలుగువారు ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంట్లలో పాల్గొన్నారు. మహిళల త్రోబాల్ పోటీల్లో తెలుగు వనితలు తమ సత్తా చాటారు. డెట్రాయిట్, కొలంబస్ జట్ల మధ్య జరిగిన త్రో బాల్ ఫైనల్ పోటీలు ఎంతో ఉత్కంఠగా సాగాయి. మహిళలు ఆద్యంతం గెలుపు కోసం పోరాడిన తీరు అందరిని ఆకట్టుకుంది. డెట్రాయిట్ టీం విజయం సాధించింది. తెలుగు మహిళల్లో కూడా క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నామని నాట్స్ తెలిపింది. విజేతలకు ప్రత్యేక బహుమతులు అందించింది.