NRI-NRT

పడవ రేసులో తానా తడాఖా

TANA Appalachian Team Participates In Boat Race Festival

తానా అప్పలాచియన్-ర్యాలె విభాగం ఆధ్వర్యంలో 40మంది తానా టీం స్క్వేర్ స్వచ్ఛంద కార్యకర్తలు శనివారం నాడు స్థానికంగా నిర్వహించిన డ్రాగన్ బోట్ ఫెస్టివల్ బోట్ రేస్‌లో పాల్గొన్నారు. 4000మంది పాల్గొన్న ఈ పోటీల్లో చైనా, అమెరికా, ఇండియా తదితర దేశాలకు చెందిన స్థానికులు తలపడ్డారు. తానా పడవకు టీం స్క్వేర్ పేరిట బరిలో నిలిపారు. మొత్తం మూడు రౌండ్లలో ఈ పడవ తానా తరఫున ఈ పోటీల్లో పాల్గొంది.