Health

బొజ్జ తగ్గే ప్రణాళిక ఇలా

A plan to burn belly fat | Telugu Health News

బొజ్జనిలా తగ్గించండి
నేడు ఎక్కువమంది బాధపడుతున్న సమస్య అధిక పొట్ట. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం వంటివి శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతున్నాయి. ఇందుకోసం రోజూ వ్యాయామం చేస్తున్నప్పటికీ ఆహారంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవడమూ ముఖ్యమేనంటున్నారు నిపుణులు.
కొర్రలు, ఓట్స్, జొన్నలు, పెసలు, ఉలవలు, కందులు, నీటిశాతం ఎక్కువగా ఉండే బీర, ఆనప, పొట్లకాయ వంటి కూరలు తీసుకోవాలి.
పగటి నిద్రకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పొట్ట తగ్గించుకునేందుకు కాలేయం పనితీరును పెంచే ఆసనాలుంటాయి. వాటిని చేయడం వల్ల కాలేయం పనితీరు పెరిగి, కొవ్వు తగ్గుతుంది.
*మితంగా భోజనం
ముఖ్యంగా ఆహారంలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. రకరకాల పిండి పదార్థాలతో బయటచేసే పిండి వంటలు తినకుండా జాగ్రత్త పడాలి. మితంగా భోజనం చేయాలి.
*నీరు
భోజనానికి 30 నిముషాల ముందు నీళ్ళు బాగా తాగాలి. ఆకలి ప్రభావం అంతగా తెలియదు. భోజనానికి రెండు గంటల తర్వాత లేదా కనీసం 30 నిమిషాల తర్వాత ఒక్కసారి నీళ్ళు తాగాలి. రోజులో తక్కువ ప్రమాణంలో ఎక్కువసార్లు తినాలి. కప్పుడు అన్నంతో పాటూ ఉడకబెట్టిన కూరగాయలు, మొలకలు ఉండేలా చూసుకోవాలి. రాత్రి మాత్రం ఒక్క చపాతీ చాలు. ఆకలేస్తే ఏ పచ్చి క్యారెట్టో, ఆపిల్ పండో తినాలి.
*తేనె
కప్పు గోరు వెచ్చని నీటిలో స్పూన్ తేనె కలుపుకొని, పరగడుపున తాగాలి. రోజులో కూడా ఎక్కువగా నీటిని తాగాలి. అప్పుడు పొట్టలోని మలినాలు, కొవ్వు కరిగి బయటకు విసర్జితమవుతాయి.
*గ్రీన్ టీ
సహజంగా లభించే గ్రీన్ టీని ఉదయం పూట సేవించాలి. దానిమ్మ జ్యూస్ తప్ప మిగతా అన్నిరకాల జ్యూసులను తీసుకోవచ్చు. కాఫీ మాత్రం రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి.
*బార్లీ గింజలు
అధిక బరువును అరికట్టే ఆహారపదార్థం బార్లీ. ఈ బార్లీ గింజలను గంజి చేసుకొని, తాగడం ద్వారా అధిక బరువును గణనీయంగా తగ్గించవచ్చు. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని బాగా తగ్గిస్తుంది.
########
నడుం నొప్పిని తగ్గించే చిట్కాలు
నడుం నొప్పి అనేది అన్ని వయస్సుల వారు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్య. కష్టమైన దైనందిక కార్యకలాపాలు, పని ఒత్తిడులు వెన్నునొప్పికి గల ప్రధానమైన కారణాల్లో ముందు వరుసలో ఉన్నాయి. ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, కండరాల ఉద్రిక్తత, వ్యాయామం చేయకపోడం, శరీర భంగిమలు సరిగ్గా లేకపోవడం, అధిక శరీర బరువు, శ్రమతో కూడిన పనులు వంటి అనేక కారణాల వల్ల కూడా ఈ వెన్నునొప్పి రావొచ్చు. వీపు కింది భాగంలో అంటే పిరుదుల భాగంలో దీర్ఘకాలిక నొప్పి, మంచంపై పడుకోవడం కష్టంగా ఉండటం, ఎక్కువకాలం నిలబడలేకపోవడం, ఒకచోట స్థిరంగా కొద్దిసేపు కూడా కూర్చోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ ఆరోగ్య సమస్యను పట్టించుకోని పక్షంలో ఇది భవిష్యత్తులో ఇతర అనారోగ్య, దీర్ఘకాలిక సమస్యలకు కారణం కావచ్చు. అందుకే వెన్నునొప్పికి తక్షణం వైద్య సహాయం తప్పనిసరి. దీనితో పాటు తక్షణ ఉపశమనం కోసం వెన్నునొప్పికి అనేకరకాల సహజ నివారణా పద్ధతులు కూడా మనుగడలో ఉన్నాయి.
*వెల్లుల్లి
వెల్లుల్లి వంటింటి సుగంధద్రవ్యంగా మనందరికీ సుపరిచితమే.. దీనిలోని శోధ నిరోధక లక్షణాలు వెన్నునొప్పి చికిత్సలో ఉత్తమంగా సహాయపడుతుంది. ఇది అల్లిసిస్ అనే సహజ సమ్మేళనాన్ని కూడా కలిగి ఉంటుంది. క్రమంగా ఇది ఒక పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఉదయానే్న రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను తినడం మూలంగా వెన్నునొప్పి తగ్గుతుంది.
*అల్లం
వంటింటిలో కనిపించే మరో సుగంధద్రవ్యం అల్లం. ఇది కూడా వెన్నునొప్పి ఉపశమనానికి సహాయపడే శోధ నిరోధక సమ్మేళనాలను కలిగి ఉంటుంది. అసౌకర్యం, నొప్పిని తగ్గించడానికి వంటల్లో తరచూ అల్లాన్ని ఉపయోగించాలి. లేదా ప్రతిరోజూ అల్లం టీని తాగవచ్చు.
*కొబ్బరినూనె
ముడి కొబ్బరినూనెలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, అనాల్జేసిక్, యాంటీ పైరెటిక్ లక్షణాలు ఉంటాయి. కొబ్బరినూనె అన్ని రకాల వెన్నునొప్పులకు చికిత్స చేయగలదు. కాబట్టి తక్షణ ఉపశమనం కోసం కొబ్బరినూనెను పూయాలి. పదినిముషాలపాటు మసాజ్ చేయాలి. తక్షణ ఉపశమనం లభిస్తుంది.
*చామంతి టీ
శతాబ్దాలుగా చామంతి టీని నొప్పుల చికిత్సలో ఉపయోగించడం జరుగుతోంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు సహజంగానే వెన్నునొప్పిని తగ్గిస్తాయి.
*పసుపు కలిపిన పాలు
పసుపు సహజసిద్ధమైన యాంటీ బయాటిక్. అందుకే ప్రతిరోజూ గోరువెచ్చని పాలలో రెండు, మూడు చిటికెల పసుపు వేసుకుని తాగడం వల్ల వెన్నునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
*క్యాప్సైసిస్
క్రీమ్ మిర్చిలో క్యాప్సైసిస్ అనే క్రియాత్మక పదార్థం ఉంటుంది. ఇది నొప్పిని కలిగించే ఒక రకమైన న్యూరోకెమికల్‌ను తగ్గించడానికి ఉత్తమమైనది. దీనిలో అత్యుత్తమంగా అనాల్జెసిక్ ప్రభావాలు కూడా ఉంటాయి. దీర్ఘకాలిక నొప్పుల చికిత్సలో క్యాప్సైసిస్ ప్రభావశీలతను కొన్ని అధ్యయనాలు కూడా నిరూపించాయి.
#########
రక్త హీనతకు దూరంగా..
రక్తహీనత ప్రధానంగా ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 లోపం వల్ల ఎదురవుతుంది. ఆ పోషకాలను ఆహార రూపంలో అందుకోవాలంటే ఒకే తరహా ఆహారపదార్థాల నుంచి కాకుండా పోషకాలను కలిపి తీసుకోవాలి. ఇనుము ఒక్కటే కాకుండా ఇతర విటమిన్లు, మినరళ్లూ వంటివి శరీరానికి అందేలా చూసుకోవాలి. పప్పు్ధన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు… వంటివన్నీ తగినంతగా తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి సమతులంగా పోషకాలు అందుతాయి. అప్పడు శరీరం బీ12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ వంటివాటిని సులువుగా స్వీకరించగలుగుతుంది. ముఖ్యంగా కౌమార దశలో ఇనుము పోషకం ఎక్కువగా అవసరం అవుతుంది. నెలసరి మొదలయినప్పటి నుంచీ దీని అవసరం రెట్టింపు ఉంటుంది. పైగా మన దేశంలో ఈ పోషకం వల్ల రక్తహీనతకు గురయ్యేవారే ఎక్కువ. అయితే ఇనుముని ఏ రూపంలో తీసుకున్నా కూడా దాన్ని శరీరం సులువుగా గ్రహించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సప్లిమెంట్ వేసుకున్నా, ఆహారమే తీసుకున్నా వెంటనే కాఫీలు, టీలు తాగకూడదు. ప్రాసెస్ చేసిన ఆహారం, పచ్చళ్లు వంటివాటికి దూరంగా ఉండాలి. లేదంటే వీటిల్లో ఉండే టానిన్ ఇనుమును శరీరం అందుకోకుండా అడ్డుపడుతుంది. అలాగే ఐరన్‌ని మాత్రల రూపంలో తీసుకునేవారు ఖాళీ కడుపుతో వేసుకోవాలి. దానివల్ల ఆ పోషకం త్వరగా అందుతుంది. లేదంటే పళ్లరసంతో తీసుకోవచ్చు. అదీ కుదరకపోతే టాబ్లెట్ వేసుకున్నాక విటమిన్ సి ఎక్కువగా లభించే జామ, బొప్పాయి, ఆరెంజ్ వంటి పండ్లను తీసుకోవాలి.