Devotional

తెలంగాణలో ప్రముఖ సరస్వతి దేవాలయాలు

Famous Saraswati Temples In Telangana | Telugu Devotional News

*తెలంగాణలో ప్రముఖమైన సరస్వతి దేవాలయాలు: 1. (బాసర:)— తెలంగాణలో హైదరాబాదు నుండి 207 కి:మీ దూరం, నిజామాబాద్ నుండి 35 కి:మీ దూరంలో, బాసరలో గోదావరి నది తీరాన,” జ్ఞాన సరస్వతి దేవి” ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలది. 2. ( రేకుర్తి:)— తెలంగాణలో కరీంనగర్ నుండి 3 కి: మీ దూరంలో, ఎత్తయిన కొండ క్రింద, రంగనాథ స్వామి కొండ మీద, నరసింహస్వామి, వీరభద్రస్వామి, మహాలక్ష్మీ దేవి, సరస్వతీ దేవి, ఆలయాలు ఉన్నాయి. 3.( వర్గల్:)— తెలంగాణలో సిద్దిపేట జిల్లాలో హైదరాబాద్ 50 కి:మీ దూరంలో, వర్గల్ గ్రామంలో గడ్డి అన్నారంలో, 1992 వ సంవత్సరంలో “విద్యా సరస్వతి” ఆలయం నిర్మించబడినది. 4. ( పేరూర్:)— హైదరాబాదు నుండి 110 కి:మీదూరంలో ,మెదక్ నుండి 18 కి:మీ దూరంలో, సంగారెడ్డి నుండి 70 కి:మీ దూరంలో, నాగసానిపల్లి వద్ద అడవిలో 2001లో ‘సరస్వతి దేవి’ ఆలయం నిర్మించారు. 5. ( ముషీరాబాద్:)— తెలంగాణలో హైదరాబాదులో, గాంధీ ఆస్పత్రికి ఎదురుగా “జ్ఞాన సరస్వతి” ఆలయం ఉన్నది. మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ లో, ఆర్ట్స్ కళాశాలలో కుడి వైపున చిన్న గట్టుపై “జ్ఞాన సరస్వతి ఆలయం “దర్శించవచ్చు. 6. ( కాళేశ్వరం:)— తెలంగాణలో కరీంనగర్ నుండి 130 కి:మీ దూరంలో, గోదావరి, ప్రణీత, సరస్వతి అను త్రివేణి సంగమంలో ‘సరస్వతి ఆలయం’ నిర్మించబడినది. 7. (అనంతసాగర్:)— మెదక్ జిల్లా సిద్ధిపేట డివిజన్లో, అనంతసాగర్ హైదరాబాద్ నుండి 120 కి:మీ దూరం, సిద్దిపేట నుండి 20 కి:మీ, కరీంనగర్ నుండి 40 కి:మీ దూరంలో, సిద్దిపేట నుండి శనిగారం వచ్చి 2 కి:మీ దూరంలో, అనంతసాగర్ గ్రామ శివారులో, ఒక చిన్న కొండ మీద నిర్మించబడిన” సరస్వతీదేవి” నిలుచుని ఉండి వీణ, పుస్తకం, జపమాల, ధరించి ఉంటుంది. 8. (హైదరాబాదులో:)— చిలుకూరు బాలాజీ గుడి వద్ద, మాదిపాడు అగ్రహారంలో, ‘వేద వేదాంత గురుకుల మహావిద్యాలయము’ నందు “సరస్వతి దేవి ఆలయం” కలదు. తెలంగాణ రాష్ట్రంలో గల ప్రముఖమైన సరస్వతి దేవాలయాల గురించి, ఎంతో విలువైన సమాచారం తెలిసింది.
1.వేంకన్న లడ్డూకు కేరళ జీడిపప్పు-కేఎస్సీడీసీతో తితిదే ఒప్పందం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే జీడిపప్పు సరఫరాకు కేరళ రాష్ట్రంతో తితిదేకు ఒప్పందం కుదిరింది. కేరళ జీడిపప్పు నాణ్యంగా ఉంటుందని, దీని వాడకంతో లడ్డూ ప్రసాదానికి మరింత రుచి వస్తుందని తితిదే చెబుతోంది. కేరళ జీడి అభివృద్ధి సంస్థ(కేఎస్సీడీసీ) ఇప్పటికే శబరిమల, పళని, పొన్నని తదితర ఆలయాలకు జీడిపప్పు సరఫరా చేస్తోంది. తితిదే నిత్యం 4 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది. నిత్యం సగటున 2,840 కిలోల జీడిపప్పు వినియోగిస్తోంది.
2.లలిత త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. నేడు దుర్గమ్మ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మల్లికార్జున మహామండపంలో ఆరో అంతస్తులో ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక కుంకుమార్చన నిర్వహిస్తారు. టిక్కెట్టు రుసుము రూ.3వేలు నిర్ణయించారు. యాగశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శత చండీయాగం నిర్వహిస్తారు. టిక్కెట్టు రుసుము రూ.4వేలు నిర్ణయించారు. ఆన్లైన్లో కూడా టిక్కెట్లు తీసుకోవచ్చు. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు జగన్మాత దుర్గమ్మకు మహానివేదన, పంచహారతులు, చతుర్వేద స్వస్తి వేదపండితుల మంత్రోచ్ఛరణ నడుమ రుత్వికులు సమర్పిస్తారు. ఆ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించరు. వేకువ జామున 3 నుంచి రాత్రి 11 గంటల వరకు కనకదుర్గానగర్లో లడ్డు, పులిహోర ప్రసాదాలను విక్రయిస్తారు. అర్జున వీధిలోని అన్నదానం షెడ్డులో ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తారు.
3. ముత్యాల పందిరిలో మురిపాలస్వామి
రేపు రాత్రి శ్రీవారికి గరుడోత్సవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారికి ముత్యపు పందిరి వాహనసేవ జరిగింది. స్వామివారు వేణువు ధరించి వేణుగోపాలుడి అలంకరణలో భక్తకోటికి అభయప్రదానం చేశారు. వాహనంపై రుక్మిణీ, సత్యభామ సమేతంగా తిరువీధుల్లో ఊరేగారు. ఉదయం స్వామివారు సింహ వాహనంపై యోగ న్ఠృసింహస్వామి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం కల్పవృక్ష, రాత్రి సర్వభూపాల వాహనసేవలు జరగనున్నాయి.గరుడ సేవకు ఏర్పాట్లు: బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ వాహనసేవ శుక్రవారం రాత్రి 7 నుంచి 12 వరకు జరగనుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తితిదే ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. రద్దీ కారణంగా సమయ నిర్దేశిత దర్శనం, దివ్యదర్శనం టికెట్లను గురువారం నుంచి మూడురోజులపాటు రద్దుచేసినట్లు తితిదే అధికారులు తెలిపారు.
4.నాలుగు రోజుల్లో.. నాలుగున్నర లక్షల మంది
ఘనంగా ఇంద్రకీలాద్రి దసరా సంబరాలు విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా నాలుగు రోజుల్లో నాలుగున్నర లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. సకల ప్రాణులకు ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ బుధవారం దర్శనమిచ్చింది. సెప్టెంబరు 29 నుంచి దసరా సంబరాలు ఆరంభమవ్వగా.. మొదటి రోజు లక్షన్నర మందికి పైగా తరలివచ్చారు. రెండు, మూడో రోజుల్లో 70-80 వేల మంది భక్తులు వచ్చారు. నాలుగో రోజు అనూహ్యంగా రద్దీ పెరిగింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 వరకూ లక్షన్నర మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. నాలుగు రోజుల్లో ఆలయానికి ప్రసాదాలు, టిక్కెట్ల రూపంలో రూ.1.3 కోట్ల ఆదాయం సమకూరింది. ఉత్సవాలు మరో ఆరు రోజులు కొనసాగనున్నాయి. 5న మూలానక్షత్రం రోజు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
5.ఆదిత్యునికి కిరణస్పర్శఏడు నిమిషాల పాటు భక్తులకు కనువిందు
అరసవల్లి సూర్యనారాయణస్వామిని భానుడి కిరణాలు తాకాయి. ఈ అపురూప దృశ్యం బుధవారం ఆవిష్కృతమైంది. ఆ సమయంలో సూర్యనారాయణస్వామి బంగారుఛాయలోకి మారి దర్శనమిచ్చారు. సూర్యుడు దక్షిణాయనంలోకి మారే సందర్భంగా ఈ కిరణస్పర్శ జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఉదయం 6.04కు సూర్యకిరణ స్పర్శ ప్రారంభమై 6.11 వరకు కొనసాగింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు బారులుతీరారు. ఆలయంలో ఏర్పాట్లను ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఈవో సూర్యప్రకాష్ పర్యవేక్షించారు.
6. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. సర్వదర్శనానికి 16 గంటల సమయం.. ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
7. దుర్గమ్మను‌ దర్శించుకున్న దేవినేని ఉమ
దుర్గమ్మను‌ మాజీ మంత్రి దేవినేని ఉమ దర్శనం చేసుకున్నారు. క్యూ లైన్‌లో నడుచుకుంటూ‌ వెళ్లి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈసారి అధికార పార్టీ నేతల హడావుడే ఎక్కువుగా కనిపించిందని ఆరోపించారు. ఫ్లెక్సీలు ఎక్కువ పని తక్కువ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. వంద రూపాయల టిక్కెట్లను వీఐపీ ముద్రలు వేసి అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఏ మంత్రి అండదండలతో ఇదంతా జరుగుతుందని ప్రశ్నించారు. అమ్మవారి టిక్కెట్లను కూడా రీసైక్లింగ్ చేస్తున్నారన్నారు. సాధారణ భక్తులు‌ మాత్రం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం రాజమార్గంలో‌ వెళ్తున్నారన్నారు. ప్రజల ఆదాయాలు తగ్గిపోయాయి.. రోజు గడవటమే కష్టంగా ఉందని చెప్పారు. అందుకే ఈసారి దసరా ఉత్సవాలకు భక్తులు సంఖ్య తగ్గిందన్నారు. దాతలు ఇచ్చిన సొమ్ములో అరవై కోట్లు ఉన్నాయన్నారు.‌ ఆ వడ్డీతో మంచి భోజనం పెట్టాలని కోరారు.
8. రాజరాజేశ్వరి అలంకరణలో శారదామాత
విశాఖ నగర పరిధిలో గల చినముషిడివాడ శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వీయ పర్యవేక్షణలో ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో శరన్నరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం పీఠం అధిష్ఠాన దేవత శారదా స్వరూప రాజ శ్యామలదేవికి రాజరాజేశ్వరిదేవి అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. పీఠాధిపతి విశేషాది అభిషేకాలు చేసి అమ్మవారికి హారతులిచ్చారు
9. ఘనంగా అట్ల బతుకమ్మ
బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అట్ల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు అందంగా అలంకరించిన బతుకమ్మలను గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో పెట్టి ఆడిపాడారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మహిళా అధికారులు బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. జగిత్యాల జిల్లా పరిషత్‌ ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్‌ కుమార్‌, విద్యాసాగర్‌రావుతో పాటు వారి సతీమణులు, జాయింట్‌ కలెక్టర్‌ రాజేశం దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, జడ్పీటీసీలు బతుకమ్మ ఆడారు. ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
10. తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ
ఈరోజు గురువారం 03-10-2019 ఉదయం 5 గంటల సమయానికి.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ….
శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు….
శ్రీవారి సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది…..
ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది….
నిన్న అక్టోబర్ 2 న 91,876 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.88 కోట్లు.
11. చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 3
ప్రసిద్ధ బెర్లిన్ గోడ తొలగించిన రోజు
1923 : బ్రిటిషు సామ్రాజ్యములో పట్టభద్రురాలైన తొట్టతొలి వనితలలో ఒకరు, స్త్రీవిమోచన కార్యకర్త కాదంబినీ గంగూలీ మరణం (జ.1861).
1957 : ఆకాశవాణి (All India Radio) యొక్క విశిష్ట సేవ వివిధ భారతి ప్రారంభం.
1964 : ఆంగ్ల నటుడు క్లైవ్ ఓవెన్ జననం.
1990 : బెర్లిన్ గోడ తొలగింపుతో జర్మనీ విలీనం జరిగినది.
2006 : ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి మరియు నాట్య కళాకారిణి ఇ.వి.సరోజ మరణం (జ.1935).
12. శుభమస్తు
తేది : 3, అక్టోబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పంచమి
(నిన్న ఉదయం 11 గం॥ 46 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 10 గం॥ 16 ని॥ వరకు)
నక్షత్రం : అనూరాధ
(నిన్న ఉదయం 12 గం॥ 59 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 12 గం॥ 15 ని॥ వరకు)
యోగము : ఆయుష్మాన్
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 53 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 29 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 43 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 52 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 39 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 3 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ వరకు)
మగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 34 ని॥ వరకు)
ర్యోదయం : ఉదయం 6 గం॥ 6 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 4 ని॥ లకు
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : వృచ్చికము
13. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 03.10.2019 గురువారం కార్యక్రమాల వివరాలు.
ఉ.9 గం.లకు కల్పవృక్ష వాహనము
రాత్రి 8 గం.లకు సర్వభూపాల వాహనము.
తిరుమల నాదనీరాజనం వేదిక….
మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ కి చెందిన డా.శోభరాజు బృందంచే అన్నమయ్య విన్నపాలు..
సాయంత్రం 4.30 గం.లకు విల్లిపురంకు చెందిన సర్వశ్రీ వి.కె.రవిచంద్రన్ బృందంచే నామసంకీర్తన,
సాయంత్రం 6 గంటలకు తిరుపతికి చెందిన సర్వశ్రీ జి.మధుసూదనాచారి ధనరావు బృందంచే ఊంజల్ సేవ,
రాత్రి 7 గంటలకు మచిలీపట్నంకి చెందిన సర్వశ్రీ ఎం.రాంబాబు భాగవతారిణిచే హరికథ.
తిరుమల ఆస్థానమండపంలో…
ఉదయం 11.30 గంటలకు తిరుపతికి చెందిన సర్వశ్రీ ద్వారం లక్ష్మీ బృందంచే భక్తిసంగీతం.
తిరుపతి మహతి ఆడిటోరియంలో….
సాయంత్రం 6.30 గంటలకు పాండిచ్చేరికి చెందిన భరత నాట్య అకాడమీ సర్వశ్రీ కరైరల్ బృందంచే భక్తిసంగీతం.
తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో …
సాయంత్రం 6.30 గం.లకు బెంగుళూరుకు చెందిన సర్వశ్రీ ఐశ్వర్య మహేష్ బృందంచే భక్తిసంగీతం.
తిరుపతి రామచంద్ర పుష్కరిణిలో…
సా. 6 గం.లకు గుంటూరుకు చెందిన సర్వశ్రీ బి.భాగ్యలక్ష్మి బృందంచే భక్తిసంగీతం.
14. తిరుమలలో రేపు రాత్రికి శ్రీవారి గరుడసేవ….రద్దీ నేపథ్యంలో ఈనెల 3, 4,5 తేదీల్లో స్లాటెడ్‌ దివ్య, సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసిన టీటీడీ…
ఈ మూడు రోజుల్లో కేవలం సర్వదర్శనం మాత్రమే…ఆదివారం నుండి టోకెన్ల దర్శనాలను పునరుద్ధరించనున్న టిడిడి.
15. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 03.10.2019 గురువారం కార్యక్రమాల వివరాలు.
ఉ.9 గం.లకు కల్పవృక్ష వాహనము
రాత్రి 8 గం.లకు సర్వభూపాల వాహనము.
తిరుమల నాదనీరాజనం వేదిక….
మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ కి చెందిన డా.శోభరాజు బృందంచే అన్నమయ్య విన్నపాలు.. సాయంత్రం 4.30 గం.లకు విల్లిపురంకు చెందిన సర్వశ్రీ వి.కె.రవిచంద్రన్ బృందంచే నామసంకీర్తన, సాయంత్రం 6 గంటలకు తిరుపతికి చెందిన సర్వశ్రీ జి.మధుసూదనాచారి ధనరావు బృందంచే ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు మచిలీపట్నంకి చెందిన సర్వశ్రీ ఎం.రాంబాబు భాగవతారిణిచే హరికథ.
తిరుమల ఆస్థానమండపంలో…
ఉదయం 11.30 గంటలకు తిరుపతికి చెందిన సర్వశ్రీ ద్వారం లక్ష్మీ బృందంచే భక్తిసంగీతం.
తిరుపతి మహతి ఆడిటోరియంలో….సాయంత్రం 6.30 గంటలకు పాండిచ్చేరికి చెందిన భరత నాట్య అకాడమీ సర్వశ్రీ కరైరల్ బృందంచే భక్తిసంగీతం.
తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో …సాయంత్రం 6.30 గం.లకు బెంగుళూరుకు చెందిన సర్వశ్రీ ఐశ్వర్య మహేష్ బృందంచే భక్తిసంగీతం.
తిరుపతి రామచంద్ర పుష్కరిణిలో…సా. 6 గం.లకు గుంటూరుకు చెందిన సర్వశ్రీ బి.భాగ్యలక్ష్మి బృందంచే భక్తిసంగీతం.