Food

చక్కెర తీసేయండి-తేనేతో ఆస్వాదించండి

Replace Sugars With Honey

ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు వాడినంత మాత్రాన చర్మం మెరిసిపోదు. జంక్‌ఫుడ్‌, నీళ్లు తక్కువగా తాగడం వల్ల చర్మం తాజాగా ఉండదు. అది తాజాగా ఉండాలంటే పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అందించాల్సిందే. ఎలాగంటే…

* కాఫీకి బదులుగా గ్రీన్‌ టీ… కాఫీ శరీరంలోని నీటిని బయటకు పోయేలా చేస్తుంది. ఫలితంగా చర్మం పొడిబారి, నిర్జీవంగా కనిపిస్తుంది. గ్రీన్‌ టీ కాఫీకి చక్కటి ప్రత్యామ్నాయం. ఇది శక్తిని ఇవ్వడమే కాకుండా చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది. అనారోగ్యాలకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది.

* చక్కెరకు ప్రత్యామ్నాయంగా తేనె… చర్మంలో సాగే గుణాన్ని తగ్గిస్తుంది చక్కెర. దీనికి పరిష్కారం తేనెను ఎంచుకోవడమే. ఒకవేళ మిఠాయిలు తినాల్సి వస్తే… బెల్లంతో చేసినవి ఎంచుకోవడం మంచిది.

* మిల్క్‌ చాక్లెట్‌ స్థానంలో డార్క్‌ చాక్లెట్‌… సాధారణంగా చాక్లెట్‌లో పాలు, చక్కెర మెండుగా ఉంటాయి. ఇవి చర్మానికి మంచిది కాదు. బదులుగా డార్క్‌ చాక్లెట్‌ తినండి. దీంట్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరానికి ప్రాణవాయువు సరఫరా సజావుగా సాగేలా చేస్తాయి. శరీరానికి తక్షణ శక్తినీ అందిస్తుంది డార్క్‌చాక్లెట్‌. అలాగని మితిమీరి తింటే ప్రమాదమని మరవకండి. రోజుకో చిన్నముక్క తింటే చాలు.