DailyDose

మహిళా ఐపీఎస్ పిస్టల్ మాయం-నేరవార్తలు-11/07

Female IPS Revolver Goes Missing-Telugu Crime News Today-11/07-మహిళా ఐపీఎస్ పిస్టల్ మాయం-నేరవార్తలు-11/07

*గడిచిన శనివారం నాడు దిల్లిలోని టీన్ హాజరీ కోర్టు వద్ద న్యాయవాదులకు పోలీసులకు మధ్య చోటు చ్సుకున్న ఘర్షణలో ఓ మహిళా ఐపీఎస్ అధికారి దాడికి గురైంది. అంతేకాకుండా ఆమె లోడెడ్ 9ఎంఎం పిస్టల్ కనిపించకుండా పోయుఇంది. లాయర్ల దాడికి భయపడి పలువురు పోలీసు సిబ్బంది గదిలోకి వెళ్లి తమను తాము బందించుకున్నారు.
*పాస్ బుక్ ఇస్తావా? చస్తావా?- అర్దీవోకు హెచ్చరిక
పాస్ బుక్ ఇస్తావా ? విజయారెడ్డిలా చస్తావా ?… ఆర్డీవోకు వార్నింగ్ తన భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ బుక్ ఇవ్వకపోతే తహశీల్దార్ విజయారెడ్డి గతి పడుతుందని ఓ వ్యక్తి కామారెడ్డి ఆర్డీవోను ఫోన్‌లో బెదిరించాడు తనకు పాస్ బుక్ ఇస్తావా ? లేకపోతే తహశీల్దార్ విజయారెడ్డి తరహాలోనే నిన్ను కూడా చంపేస్తానని కామారెడ్డి ఆర్డీవోకు బెదిరింపు ఫోన్ కాల్ రావడం కలకలం రేపుతోంది. భూ వివాదంలో న్యాయం చేయలేదని ఓ కానిస్టేబుల్ ఫోన్ చేసి ఆర్డీవో రాజేంద్రకుమార్‌ను బెదిరించాడు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో రాజేంద్రకుమార్‌కు ఫోన్ చేసిన శ్రీనివాసర్ రెడ్డి తన భూమి విషయంలో న్యాయం చేయలేదని.. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌కు పట్టిన గతే నీకూ పడుతుందంటూ బెదిరించాడు. దీంతో నిన్న ఉదయం జిల్లా ఎస్పీకి ఆర్డీవో ఫోన్‌ల్లో ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు… ఫోన్‌ చేసిన వ్యక్తి జిల్లాలోని తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డిగా గుర్తించారు. కామారెడ్డిలో ఎఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఈ పని చేశాడని నిర్ధారించుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* బుర్కినా ఫాసోలోని కెనడా మైనింగ్‌ కంపెనీ సెమాఫో ఉద్యోగులను తీసుకుని వెళ్తున్న వాహనంపై బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో సుమారు 37 మంది మరణించారని, 60 మంది తీవ్రంగా గాయపడ్డారని ప్రాంతీయ గవర్నర్‌ తెలిపారు.
*పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం నాలుగోసారి అతడు పెట్టుకున్న పిటిషన్ ను లండన్ కోర్టు తిరస్కరించింది.
*ఢిల్లీలో గత కొద్ది రోజులుగా పోలీసులకు, లాయర్లకు మధ్య చెలరేగిన ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి.ఈ క్రమంలో ఇద్దరు లాయర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రోహిణి కోర్టు ఏరియాలో ఆశిష్‌ అనే న్యాయవాది తన శరీరంపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే తోటి లాయర్లు అతడిని అడ్డుకున్నారు. మరో న్యాయవాది రోహిణి కోర్టు కాంప్లెక్స్‌ పైభాగంలోకి ఎక్కి అక్కడినుంచి దూకుతానని బెదిరించాడు.
*అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు కూర సురేశ్‌ మృతిచెందాడు. తహసీల్దార్‌ కార్యాలయంలో విజయారెడ్డిపై ఘాతుకానికి ఒడిగట్టిన క్రమంలో తీవ్రంగా గాయపడిన సురేశ్‌ను తొలుత అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 3.30 గంటలకు సురేశ్‌ మృతిచెందినట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు
*నంద్యాల పట్టణంలోని మెయిన్‌ బజారులో ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల పట్టణంలో శ్రీ నిమిసాంబ జ్యూవెలరీ దుకాణంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి బంగారం, నగదు దోచుకుపోయారు.
*విసన్నపేట మండలంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం పోలీసుశాఖ ఆకస్మిక తనిఖీలు ప్రారంభించింది. స్థానిక రెవెన్యూ కార్యాలయం మండల పరిషత్‌ ప్రాంగణంలో బాంబుస్వ్కాడ్‌, జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఈ తనిఖీలు కొనసాగుతాయని ఎస్సై ఎమ్‌.లక్ష్మణ్‌ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
*అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో ఓ ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డొనేకల్లు వద్ద బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. అయితే బస్సు ఒక పక్కకు ఒరిగి ఆగడంతో అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. దీంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులున్నారు.
*అంతర్‌రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లింగ్‌ దొంగల ముఠాను హైదరాబాద్‌ సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు క్రైం డిపార్ట్‌మెంట్‌ కమిషనర్‌ అంజనీ కూమార్‌ తెలిపారు.
*తహసీల్దార్ విజయారెడ్డి ఘటన మరవకముందే మరో ఆర్డీవోకి అదే రీతిలో బెదిరింపు కాల్స్ వచ్చాయి. తనకు అనుకూలంగా పాస్‌బుక్కులు ఇవ్వకపోతే ‘విజయారెడ్డికి పట్టిన గతే నీకూ పడుతుంది’ అంటూ ఏకంగా ఆర్డీవోనే బెదిరించాడో ప్రబుద్ధుడు. తాడ్వాయి మండలానికి చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి గొడవల్లో ఉన్న భూమికి సంబంధించి తనకు అనుకూలంగా పాస్‌బుక్కులు ఇవ్వాలని ఆర్డీవో రాజేంద్రకుమార్‌ను కోరాడు.
*ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరిని తట్టుకోలేక మేడ్చల్ మండలం డబిల్ పూర్ గ్రామానికి చెందిన షేక్ బాబా తన ఇంట్లోనే గుళికల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు.
* స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశవాళీ క్రికెటర్‌ చిదంబరం మురళీధరన్‌ గౌతమ్‌ను సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.
* మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడిని కొందరు చితకబాదారు. అర్ధనగ్నంగా చేసి దారుణంగా హింసించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలంరేగింది. జబల్‌పూర్ ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య తగాదాలు ఉన్నాయి.
* ఇవాళ తెల్లవారుజామున మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాను వీర మరణం పొందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌ఘర్‌లోని మావోయిస్టుల స్తావరమైన తొగ్గూడెం, పామెడ ప్రాంతంలో ఉదయం 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
* త‌హ‌సీల్దార్ విజ‌యా రెడ్డిని స‌జీవ ద‌హ‌నం చేసిన నిందితుడు సురేశ్ గురువారం మృతిచెందాడు. అయితే పోలీసులు అధికారికంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించాల్సి ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌హ‌సీల్దార్‌పై పెట్రోల్‌తో దాడి చేసిన ఘ‌ట‌న‌లో సురేశ్ కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.
* శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో గుట్కా లోడుతో వెళ్లున్న లారీ ప్రమాదవశాత్తు వంశధార కాల్వలో పడిపోయింది. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న లారీ..జాతీయ రహదారిపై ఉన్న వంతెన రక్షణ గోడను ఢీ కొట్టి కాల్వలోకి దూసుకుపోయింది.
* నెల్లూరులో శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో అదృశ్యమైన 2 నెలల చిన్నారి ఆచూకీ లభ్యమైంది. రైల్లో నిద్రిస్తున్న సమయంలో చిన్నారిని ఓ మహిళ అపహరించినట్లు గుర్తించారు. కావలి రైల్వేస్టేసన్‌ సీసీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు సదరు మహిళ వద్ద చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. మహిళ చిన్నారిని తీసుకొని కందుకూరు వైపు వెళ్లినట్లు సమాచారం
* మదనాపురం మండల కేంద్రంలోని, సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో, ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న, విద్యార్ధి శ్రీకాంత్(16). ఇంగ్లీష్ ల్యాబ్ రూంలో తెల్లవారుజామున ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
* విశాఖ … గాజువాక …లంకెలపాలేం జంక్షన్ సమీపంలో రెండు లారీలు ఢీ….ఒకటి బొగ్గు లారీ కేబిన్ పూర్తిగా దగ్దం డ్త్రెవర్ సజీవ దహనం…..మంటలను అదుపు చేస్తున్న స్ధానికులు…
*జేఎన్టీయూహెచ్లో బీటెక్ విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
*ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
*బంగారు.. వజ్రాభరణాలను సులభ వాయిదాల్లో తీసుకోండి..అంటూ గొలుసుకట్టు తరహా పథకం ద్వారా మదుపరులను మోసం చేసిన హీరా గోల్డ్ గ్రూప్ కంపెనీల అధినేత్రి నౌహీరా షేక్ లీలలు బయటపడుతూనే ఉన్నాయి.
*తప్పు చేశారనో లేక మరేదైనా కారణంతో విద్యార్థులపై ఉపాధ్యాయులు చేయిచేసుకోవడం చూశాం. కానీ ఇక్కడ విద్యార్థులే అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిని చితకబాదేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బాల్కారాన్పూర్లో జరిగింది.
*కూకట్పల్లి జేఎన్టీయూహెచ్లో ర్యాగింగ్ కలకలం రేగింది. 15 రోజుల క్రితం బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు వర్షిత్, నవీన్, రోహిత్ కల్యాణ్లను అనిల్ రాజ్ అనే సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ చేశాడంటూ మరో విద్యార్థి సందీప్ ప్రిన్సిపల్ సాయిబాబారెడ్డికి ఫిర్యాదు చేశాడు.
*వలపు వల’లో చిక్కి…దేశానికి సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మహిళా ఏజెంటుకు చేరవేశారన్న ఆరోపణలతో ఇద్దరు భారతీయ జవాన్లను ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
*పొట్టల్లో మాత్రల రూపంలో బంగారాన్ని దాచుకుని శ్రీలంక నుంచి చెన్నై వచ్చిన ఇద్దరు మహిళలను ఓ స్మగ్లింగ్ ముఠా అపహరించి, దోచుకున్న వైనమిది. ఫాతిమా, థెరిసా శ్రీలంక నుంచి మంగళవారం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు.
*గత ఏడాది మే 21వ తేదీన, తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాకి చెందిన 19ఏళ్ల యువకుడు అదే ప్రాంతానికి చెందిన చెల్లెలు వరసయ్యే 16ఏళ్లబాలికను అపహరించాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై నిందితునికి బాలికను అపహరించినందుకు ఏడేళ్లు, అత్యాచారం చేసినందుకు 10 ఏళ్ల చొప్పున మొత్తం 17 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ దిండుక్కల్ మహిళాకోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పునిచ్చారు.
*పాస్పుస్తకాల పంపిణీ విషయంలో కామారెడ్డి ఆర్డీవో రాజేంద్రకుమార్కు మంగళవారం రాత్రి ఓ బెదిరింపు కాల్ వచ్చింది. పాస్పుస్తకాలు ఇవ్వకపోతే అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్కు పట్టిన గతే నీకు.. తాడ్వాయి తహసీల్దార్కు పడుతుందని ఆర్డీవోను హెచ్చరించారు. అనంతరం పోలీసులు దర్యాప్తు చేయగా ఓ ఏఆర్ కానిస్టేబులే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. ఆయనపై శాఖాపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
*ఇటీవల ఆదాయపన్ను శాఖ దాడుల నేపథ్యంలో కల్కి భగవాన్ బుధవారం దర్యాప్తు బృందం సమక్షంలో విచారణకు హాజరయ్యారు. చెన్నై నుంగంబాక్కంలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో దర్యాప్తు అధికారుల ఎదుట కల్కి భగవాన్ బుధవారం హాజరుకాగా 2 గంటలకుపైగా ఆయన్ను అధికారులు విచారించారు.
*గ్రామసభలో అపశ్రుతి చోటుచేసుకుంది. తనకు రైతుభరోసా అమలుచేయలేదని ఆగ్రహంతో ఊగిపోయిన రైతు అధికారుల ఎదుటే ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు.
*సాగులో ఉన్న 1.63 ఎకరాల డీకేటీ భూమికి పట్టా ఇవ్వడంలో రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది.
*అప్పటిదాకా ఆ చిన్నారి తల్లిచేతుల్లో ఉంది. ఆమె బువ్వ తినిపిస్తోంది. అమ్మ చేతి గోరుముద్దలు తింటూ… బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఇంటిలోపలికి వెళ్లి అక్కడ టెలివిజన్కు (టీవీకి) అనుసంధానమైన తీగను పట్టుకొని లాగింది. వెనువెంటనే అది మీద పడడంతో ఆ పదకొండు నెలల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.