WorldWonders

వామ్మో…ఢిల్లీ ఖాన్ మార్కెట్ అద్దె ధరలో!

Delhi Khan Market Rental Rates Are Crazy-Telugu Wonders

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రిటైల్‌ ప్రాంతాల్లో 20వ స్థానంలో దిల్లీలోని ఖాన్‌ మార్కెట్‌ నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం మెరుగైంది. అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెంట్‌ ‘కుష్‌మ్యాన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌’ ‘మెయిన్‌ స్ట్రీట్స్‌ అక్రాస్‌ ది వరల్డ్‌ 2019’ పేరుతో విడుదల చేసిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. ఖాన్‌ మార్కెట్‌లో చదరపు అడుగుకు వార్షిక అద్దె 243 డాలర్లు(రూ.17,253)గా ఉందని నివేదిక తెలిపింది. గత ఏడాది ఇక్కడ చదరపు అడుగుకు వార్షిక అద్దె 237 డాలర్లు (రూ.16,827) కాగా, 21వ స్థానంలో ఉంది.
***ఈ జాబితాలోని తొలి ఐదు స్థానాలు
1. కాజ్‌వే బే(హాంకాంగ్‌) 2,745 డాలర్లు
2. అప్పర్‌ అవెన్యూ(న్యూయార్క్‌) 2,250 డాలర్లు
3. న్యూ బాండ్‌ స్ట్రీట్‌(లండన్‌) 1,714 డాలర్లు
4. అవెన్యూ డెస్‌ ఛాంప్స్‌(పారిస్‌) 1,478 డాలర్లు
5. మిలన్‌ (ఇటలీ) 1,447 డాలర్లు