ScienceAndTech

ఇన్‌స్టాగ్రాంపై నిరసనలు

Influencers Kicked Out Of Instagram-Sparks Protests

తారలు జింజర్ బాంక్స్ (ఎడమ), అలనా ఇవాన్స్

సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఏడాది వందల మంది పోర్న్ తారలు, సెక్స్ వర్కర్ల ఖాతాలు తొలగింపునకు గురయ్యాయి.

ప్రధాన స్రవంతి సెలబ్రిటీలతో పోలిస్తే తమను తక్కువ చేసి చూస్తున్నారని, తమకు భిన్నమైన ప్రమాణాలను వర్తింపజేస్తున్నారని వీరిలో చాలా మంది విమర్శిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో హాలీవుడ్ నటి షరాన్ స్టోన్ లేదా మరొకరి వెరిఫైడ్ ఖాతా తరహాలో తన ఖాతాను నిర్వహించుకొనే స్వేచ్ఛ ఉండాలని,

కానీ అలా చేస్తే తమను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగిస్తారని ‘అడల్ట్ పర్‌ఫార్మర్స్ యాక్టర్స్ గిల్డ్’ అధ్యక్షురాలు అలనా ఇవాన్స్ చెప్పారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోర్న్ నటులను ఖాతాలు నిర్వహించుకోనివ్వాలంటూ పోరాడుతున్న ప్రముఖుల్లో అలనా ఒకరు.

ఇన్‌స్టాగ్రామ్ ప్రమాణాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ తమ ఖాతాలను తొలగించారని 1,300 మందికి పైగా పోర్న్ నటులు చెబుతున్నారు.

నగ్న, లేదా సెక్స్ దృశ్యాలేవీ తమ ఖాతాల్లో పెట్టకపోయినా ఇలా చేశారని వీరు విమర్శిస్తున్నారు. వీరందరి వివరాలను అలనా ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రూపు సేకరించింది.

జీవనోపాధి కోసం తాము చేస్తున్న పని వాళ్లకు నచ్చదని, అందుకే తమపై వివక్ష చూపిస్తున్నారని అలనా ఆరోపిస్తున్నారు.