Kids

పిల్లలూ రండి…సబ్బు పడవ చేద్దాం

Fun Activities For Kids At Home-Soap Powered Boat

కావలసినవి: అట్టముక్క, సబ్బు, వెడల్పాటి పాన్‌, నీళ్లు

అట్టతో పడవ బొమ్మ చేసి పక్కన బొమ్మలో చూపిన విధంగా వెనక వైపు రెండు సబ్బు ముక్కలు పెట్టండి. మీ పడవ తిన్నగా కాకుండా గుండ్రంగా వెళ్లాలనుకుంటే ఒక అట్టముక్కను చుక్కానిలా వెనక కలపండి. ఇప్పుడు మీ పడవ సిద్ధం. వెడల్పాటి పాన్‌లో నీళ్లు పోసి అందులో పడవ బొమ్మను పెట్టండి. పడవ నెమ్మదిగా ప్రయాణించడం మొదలుపెడుతుంది. అది ఎలా ప్రయాణిస్తుందో తెలుసా? సబ్బు కరగడం వల్ల అది పడవ వెనక ఉపరితలంలో ఉన్న పీడనాన్ని తగ్గిస్తుంది. రెండు వైపులా ఉపరితల పీడనాలలోని వ్యత్యాసం వల్ల పడవ ముందుకు నెట్టబడుతుంది. కానీ కొన్ని సార్లు సబ్బు నీళ్లలో కరిగిన వెంటనే పడవ కదలకపోవచ్చు. అలాంటప్పుడు నీళ్లు మారిస్తే సరిపోతుంది.