NRI-NRT

అమెరికా అభిమానుల ఆగ్రహజ్వాలల్లో “అమృతం”

అన్ని ఎపిసోడ్లు మాయం. అప్పాజీ మార్కు కక్కుర్తి #AmruthamSerial #Zee5 #NoMoreAmrutham-అమెరికా అభిమానుల ఆగ్రహజ్వాలల్లో

“అమృతం”…ప్రతి ఆదివారం సాయంకాలం 8:30గంటలకు జెమినీ టీవీలో సరదాగా నవ్వించే ఓ కార్యక్రమం. కాలక్రమంలో ఆ సీరియల్ ఆగిపోయినప్పటికీ, యూట్యూబ్‌లో Just Yellow Media, Amrutham Serial ఛానెల్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రవాసులను ముఖ్యంగా అమెరికాలోని అభిమానులను ఎంతగానో అలరించింది. సెలవుల సీజన్‌లో, భోజనం చేసే సమయాల్లో చాలామంది ప్రవాసులు ఈ సీరియల్‌ను వీక్షించడానికి ఆసక్తి కనబరుస్తారు. కానీ ఇప్పుడు ఈ అభిమానులు అందరూ ఆ కార్యక్రమ నిర్మాతలకు చీవాట్లు, శాపనార్థాలు పెడుతున్నారు. దీనికి కారణం “అమృతం” సీరియల్ మొత్తాన్ని యుట్యూబ్ నుండి తీసేశారు. Zee5 ఛానెల్‌కు ఈ సీరియల్‌ను అమ్మేశారు. కావున ఈ సీరియల్ చూడాలంటే Zee5లోనే చూడాలని Amrutham Serial ఛానెల్ వారు యూట్యూబ్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. అమెరికాలో Zee5 లేదని కొందరు, Subscription ధరలు నీ అమ్మా మొగుడు ఇస్తాడా అని కొందరు, ఆఖరికి అప్పాజీ కక్కుర్తి స్థాయికి నిర్మాతలు దిగజారారని మరికొందరు కామెంట్ల రూపంలో “అమృతం” నిర్మాతలను ఆడిపోసుకుంటున్నారు. అయితే కొంతమంది అభిమానులు చాలా తెలివిగా ఎన్ని ఎపిసోడ్లు ముందుగానే Download చేసి పెట్టుకున్నారు. వారు వాటిని బయటి ప్రపంచానికి విడుదల చేస్తారేమో వేచి చూడాలి. ఏది ఏమైనా తెలుగు బుల్లితెర రంగంలో “అమృతం” ఓ సంచలనం, ఓ సాంత్వనం. ఇవాళ అది ప్రవాసుల నుండి కనుమరుగు కావడం ఓ చేదు జ్ఞాపకం.

https://www.youtube.com/watch?v=tf-w0qpDoYs