DailyDose

హఠాత్తుగా ఢిల్లీకి బయలుదేరిన పవన్-రాజకీయం

Pawan Kalyan Leaves To Delhi-Telugu Political Roundup

* జనసేన అధినేత పవన్ కల్యాణ్ హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం జరుగుతుండగా ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. దీంతో ఆయన సమావేశం మధ్యలోనే ఢిల్లీకి పయనమయ్యారు. పవన్ ఢిల్లీ వెళ్లడం వెనుక ఆంతర్యమేంటి..? ఇంతకీ పిలుపు ఎవరి నుంచి వచ్చింది..? కేంద్ర పెద్దల నుంచి ఫోన్ వచ్చిందా..? లేకుంటే వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ వెళ్లారా..? అనేది మాత్రం తెలియరాలేదు.ఇదిలా ఉంటే.. ఇదివరకే రాజధాని ఆందోళనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుని పెద్దన్నగా వ్యవహరించాలని జనసేనాని కోరారు. అయితే ఇవాళ ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలను కలవడానికే వెళ్లారని మరోవైపు వార్తలు వస్తున్నాయి.
* ప్రధానితో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ భేటీ
జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం.. ప్రధానితో సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇటీవల వెలువడిన జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సోరేన్‌కు తొలుత ప్రధాని మోదీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. భేటీ సందర్భంగా సోరెన్‌ రాష్ట్రంలోని పలు సమస్యలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిసింది. గిరిజన రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
*జనసేన సమావేశంలో టీడీపీతో పొత్తుపై కీలక చర్చ
నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో టీడీపీతో పొత్తుపై కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో టీడీపీ పొత్తులు పెట్టుకోవాలని కొందరు నేతలు కోరినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్లే.. వైసీపీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చాయని సమావేశంలో కొందరు నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.
*ఒకే వేదికపై కనపదనున్న మోడీ- మమతా బెనర్జీ
ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒకే వేదికపై కనపడనున్నారు. పశ్చిమ బెంగాల్ లోని పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవాల సందర్భంగా రేపు ఓ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొంటారు. నేడు, రేపు మోడీ పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తారు. పోర్టు ట్రస్ట్ కార్యక్రమంలో పాటు ఇతర కార్యక్రమాల్లోనూ మోడీ పాల్గొంటారని ఇప్పటికే ప్రకటన వెలువడింది.
*లెఫ్టినెంట్ గవర్నర్ కు వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కిన సిఎం
లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సిఎం నారాయణ స్వామీ మధ్య వివాదం ముదిరింది. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి వ్యతిరేకంగా ఆయన మద్రాస్ హైకోర్టు మేట్లేక్కరు. ఉచిత బియ్యానికి బదులుగా నగదు పంపిణీ చేయాలనీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ , లెప్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ సిఎం కోర్టు మేట్లేక్కారు. 2016 ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తామని తాము మేనిఫెస్టోలో పేర్కొన్నామని తెలిపారు.
*ఆయనొక నిస్సయాక ముఖ్యమంత్రి –శశిధరూర్
పౌరసత్వ చట్టంపై స్పష్టమైన స్టాండ్ తీసుకోలేకపోతున్నారంటూ డిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి ధరూర్ విమర్శలు గుప్పించారు. ఆయనొక నిస్సాయక ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. జే ఎన్యూలో ముసుగులు ధరించిన వ్యక్తులు చేసిన దాడిలో గాయపడ్డ విద్యార్ధులను కనీసం పరామర్శించలేదని దుయ్యబట్టారు. సిఏఏకు అనుకూలంగా ఉన్నవారికి వ్యతిరేకంగా ఉన్నవారికి అందరికీ అనుకూలంగా ఉండాలని కేజ్రీవాల్ అనుకుంటున్నారని అందుకే ఈ అంశంపై మాట్లాడకపోతే రానున్న ఎన్నికల్లో ఏ ప్రాతిపదికన ఆయన పార్టీకి ప్రజలు ఓటు వేయాలని ప్రశ్నించారు.
*పెర్నీతో అమరావతి రైతుల భేటి
అమరావాతే ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ గత 22 రోజులుగ్ఫా ఆందోళనలు చేస్తున్న రాజధాని గ్రామాల రైతులు తొలిసారి మంత్రిని కలిసారు. మంత్రి పెర్నీ నానితో రాజధాని ప్రాంత రైతులు భేటీ అయ్యారు తమకి న్యాయం చేయాలని మంత్రిని కోరారు. రాజధాని రైతులకు జగన్ అన్ని రకాలుగా న్యాయం చేస్తారని పెర్నీ నాని వారికి హామీ ఇచ్చారు. గతమలో చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయారని మరోసారి నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.
*చంద్రబాబు ముఖ్య సలహదారు చిట్టినయుడే: విజయసాయి
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ పై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగాస్త్రాలు సందించారు. అమరావతి రాజధాని విషయంలో వారి తీరును తప్పుబడుతూ ట్విట్ చేసారు. ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమానికి నిధులు సేకరించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్య సలహాదారు చిట్టినాయుడు అయి ఉంటాడని అనుకుంటున్నారంతా గాజులు ఉంగరాల సేకరణ నుంచి జోలె పట్టుకునే దాకా రాజుగారి దేవత వస్త్రాల కద గుర్తు కోస్తోంది అనిపించడంలేదా అని విజయసయిరేద్ది విమర్సించారు.
* నేనే సీనియర్ పోసానికి ఫ్రుద్వి కౌంటర్
వైకాపాలో తానూ చాలా సీనియర్ అని నటుడు ఎస్వీబీనీ చైర్మన్ ఫ్రుద్వి రాజ్ అన్నారు. తనపై పోసాని కృష్ణమురళి చేఇస్న వ్యాఖ్యలను తానూ అసీర్వడంగానే భావిస్తానని ఆయనను వ్యాఖ్యానించారు. వైకాపాలో ఫ్రుద్వి పరోక్షంగా స్పందించారు. తానూ చాలా సీనియర్ అని.. తనకు వైఎస్సార్ సమయం నుంచే ఆ కుటుంబంతో సన్నిహిత సంబందాలు ఉన్నాయని అన్నారు. అమరావతిలో జరుగుతున్నా ఆందోళనలపై తానూ తప్పు మాట్లాడటం లేదని ఆయన వివరించారు.
*మూడు రోజులు హైదరాబాద్ లోనే జగన్ మకాం
ఏపీ ముఖ్యమంరి జగన్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. మూడురోజులు పాటు లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఆయన ఉండనున్నారు ఈనెల 13న జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అవుతున్న విషయం తెలిసిద్నే. అయితే ఈభేటీలో తెలుగు రాష్ట్రాలోని పలు అంశాలతో పాటు జాతీయ విషయాక కూడా చర్చకు రానున్నట్లు సమాచారం.
*గుంటూరులో రాష్ట్ర బీజేపీ నేతల అత్యవసర భేటీ
రాష్ట్ర బీజేపీ నేతలు అత్యవసరంగా ఈ రోజు గుంటూరులో భేటీ అయ్యారు. రాజధాని అంశం పై రాష్ట్రంలో ప్రభుత్వ, విపక్షాల మధ్య పోరు సాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి రాష్ట్రానికి చెందిన ఎంపీలు జి.వి.ఎల్.నరసింహారావు, సుజనాచౌదరి, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పి.వి.ఎన్.మాధవ్, పార్టీ నాయకురాలు పురందేశ్వరి హాజరయ్యారు.ఈ సమావేశంలో పార్టీ కార్యక్రమాలతోపాటు రాజధాని అంశం పై చర్చించే అవకాశం కనిపిస్తోది. ముఖ్యంగా రాజధాని అంశం పై పార్టీ నాయకులు తలోరకమైన ప్రకటన చేస్తుండడంతో రాష్ట్ర ప్రజల్లో ఓ విధమైన అయోమయం నెలకొంది. ఈ నేపథ్యం లో ఈ సమావేశం తర్వాతైనా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
* అమరావతిలో యుద్ధ వాతావరణం: నాదెండ్ల
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌ అన్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ అధ్యక్షతన మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ‘రాజధాని ఒకే చోట ఉండాలి, పరిపాలన అక్కడి నుంచే సాగాలి’ అనే తీర్మానానికి పార్టీ కట్టుబడి ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. ఏడు నెలల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. గతంలో ఓదార్పుయాత్ర, పాదయాత్ర చేపట్టిన జగన్.. ఇప్పుడు రైతులతో కనీసం మాట్లాడకపోవడం దారుణమన్నారు. పోలీసుల చర్యలతో రాజధానిలో యుద్ధ వాతావరణం నెలకొందన్నారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు వెళ్తున్న మహిళల్ని పోలీసులు దారుణంగా కొట్టారని, పోలీసులు రాజధాని గ్రామాల్లో రైతుల ఇళ్లకు వెళ్లి తాళాలు వేస్తున్నారని ఆరోపించారు.
* మూల్యం చెల్లించుకోక తప్పదు: దేవినేని
సీఎం జగన్‌ చెప్పినట్టు విని తప్పు చేసిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు. ఇష్టం వచ్చినట్లు 144 సెక్షన్‌ అమలు చేయవద్దని సుప్రీంకోర్టు చాలా స్పష్టం చెప్పిందన్నారు. 144 సెక్షన్‌ అడ్డం పెట్టుకుని తెదేపా నేతలను నిర్బంధించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అమరావతి జేఏసీ కార్యాలయానికి తాళం వేయడం సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. వైకాపా మినహా మిగిలిన అన్ని పార్టీలూ జేఏసీలో ఉన్నాయని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్నారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఉమా స్పష్టం చేశారు. సీబీఐ కోర్టులో జగన్‌ హాజరు అంశంపై ప్రజల దృష్టి మరల్చే క్రమంలోనే అమరావతిలో మహిళలపై పోలీసుల దాడి ఘటన జరిగిందని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం అసమర్థత వల్లే కశ్మీర్‌ తరహా ఉద్రికత పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయన్నారు.
* భారతీయులంతా అమాయకులు: చిదంబరం
భారతీయులంతా అమాయకులని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. శుక్రవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నేను నా జీవితంలో భారతీయులంత అమాయకులను ఎప్పుడూ చూడలేదు. ఎవరేం చెప్పినా ఏమాత్రం ఆలోచించకుండా ప్రతి దానిని నమ్మేస్తుంటారు. దేశంలోని గ్రామాలన్నింటికీ విద్యుత్తు సదుపాయం కల్పించినట్లు ప్రచారం జరిగితే విశ్వసించారు. దేశంలోని 99శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించారని చెబితే నమ్మేశారు’ అని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై చిదంబరం విమర్శలు గుప్పించారు.
* రాజధాని రైతులకు 13 జిల్లాల ప్రజలు మద్దతివ్వాలి’భాజపా ఎంపీ సుజనా చౌదరి
ఏపీ రాజధానిపై రైతులు చేస్తున్న ఆందోళన చూస్తుంటే చాలా బాధగా ఉందని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రైతులు, మహిళలు దుర్గమ్మ గుడికి వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. రాజధాని గ్రామాల్లోని దేవాలయాల్లో పూజలు చేసుకోవడం తప్పా అని నిలదీశారు.రాజధాని గ్రామాల్లో ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు మరి వైకాపా ర్యాలీకి అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు‘‘కులాలేంటని రైతులను పోలీసులు అడగమేంటి”ప్రాంతీయ, కుల విద్వేషాలు తీసుకొచ్చి పరిపాలన చేయాలుకోవడం మంచిది కాదు.అమరావతి రైతులకు 13 జిల్లాల ప్రజలు మద్దతు ఇవ్వాలి.13 జిల్లాల ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. అమరావతి రైతుల అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం అని సుజనా చౌదరి అన్నారు.
* తెదేపా నేతల గృహనిర్బంధం.
చంద్రబాబు తిరుపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో పలువురు తెదేపా నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. ఐతేపల్లిలో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్‌ నరసింహయాదవ్‌, టీడీపీ నేతలు గృహ నిర్బంధం చేశారు.
* ఏపీ మంత్రులకు వెన్నెముక లేదు: దేవినేని ఉమ
సీఆర్డీయే యాక్ట్‌ను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. అసెంబ్లీలో అందరి ఆమోదంతో సీఆర్డీయే చట్టం రూపొందించినట్లు తెలిపారు. జగన్‌ చేస్తున్న తప్పుడు పనులను ఆమోదించుకునేందుకు… అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరుస్తున్నారన్నారు. తెలుగుజాతి గుండెలపై ఉన్మాది జగన్‌ తన్నుతున్నారని మండిపడ్డారు. జగన్‌ రాజకీయ ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రులకు వెన్నెముక లేదన్నారు.
* గుంటూరులో కన్నా అధ్యక్షతన బీజేపీ నేతల భేటీ
బీజేపీ కార్యాలయంలో కన్నా అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం అయ్యింది. ఈ భేటీలో ముఖ్యనేతలు సుజనాచౌదరి, పురంధేశ్వరి, జీవీఎల్‌ నరసింహారావు, ఎమ్మెల్సీలు మాధవ్‌, సోము వీర్రాజు హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాలు, రాజధాని అమరావతి అంశంపై సమాలోచనలు చేస్తున్నారు.
* ప్రజా సమస్యలే టీజేఎస్‌ ప్రధాన ఎజెండా: కోదండరాం
మున్సిపల్‌ ఎన్నికల ప్రణాళికలను టీజేఎస్‌ విడుదల చేసింది. అగ్గిపెట్టె గుర్తుపై టీజేఎస్‌ పోటీ చేయాలని నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ అధినేత కోదండరామ్‌ తెలిపారు. ప్రజాసమస్యలే ప్రధాన ఎజెండాగా మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపాలిటీలు నిర్లక్ష్యానికి గురయ్యా, తిరిగి పునరుద్ధరించాలని ఆకాంక్షించారు. ప్రజలను ఓట్లు అడిగే పార్టీలు… ఐదేళ్లలో ఏం చేస్తారో చెప్పాలని కోరారు. కలిసి వచ్చే వారితో కలిసి హైదరాబాద్‌లో మహాసభ పెడతామన్నారు.
* పశువుల కన్నా హీనంగా మహిళలను ఈడ్చి పారేశారు: దివ్యవాణి
రక్షక భటులే భక్షక భటులయితే సామాన్యుడు ఎవరికి చెప్పుకుంటాడని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ప్రశ్నించారు. పశువుల కన్నా హీనంగా మాహిళలను ఈడ్చి పారేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌కి విశాఖలో ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఆయన విశాఖ కోసం ర్యాలీ చేశారని… తాము అమరావతి కోసం ర్యాలీ చేస్తున్నామన్నారు. హోం మినిస్టర్, మహిళా కమిషన్ చైర్ పర్శన్‌లు గన్ కన్నా ముందే తమ జగనన్న వస్తారన్నారని.. మహిళల గోడు మీ జగనన్నకి కనపడటం లేదా? అని ప్రశ్నించారు. వైసీపీలో ఒకరేమో పెయిడ్ ఆర్టిస్టులు అంటారని.. మరొకరు పెయిడ్ ఆర్టిసులు కాదు రైతులకు క్షమాపణ చెప్పాలి
*చంద్రబాబు ర్యాలీకి అనుమతి నిరాకరణ
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఐక్య కార్యాచరణ సమితి ఇవాళ తిరుపతిలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీ, బహిరంగ సభలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 12.45 గంటలకు బయలుదేరి మధ్నాహ్నం 2.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతిలోని పూలే విగ్రహం వద్దకు చేరుకుంటారు. ఆ విగ్రహం నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో పాల్గొని, సాయంత్రం 5 గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
*ఇంకెన్ని గుండెలు ఆగిపోవాలి?: యనమల
రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో మహిళ నందకుమారి (56) మృతి పట్ల తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు కాలినడక వెళ్తున్న మహిళల పట్ల వైకాపా ప్రభుత్వం దమనకాండను టీవీల్లో చూసి తట్టుకోలేక ఆ మహిళ మృతిచెందడం బాధాకరమన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
*నాకు కాదు.. వాళ్లకి భద్రత ఇవ్వండి
సీఆర్పీఎఫ్‌ భద్రత తనకు కాదని జేఎన్‌యూ విద్యార్థులకు కల్పించాల్సిందిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ప్రభుత్వాన్ని కోరారు. స్టాలిన్‌కు కల్పిస్తున్న జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతను కేంద్రం ఉపసంహరించిన మరుసటి రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయంలోకి చొరబడి విద్యార్థులు, అధ్యాపకులను కర్రలు, రాడ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ముసుగులు ధరించిన వ్యక్తులు జేఎన్‌యూ విద్యార్థులపై దాడి చేసిన విజువల్స్‌ చూసి దిగ్భ్రాంతికి గురైనట్లు ఆయన తెలిపారు.
*రాజధానిపై అనిశ్చితిని తొలగించాల్సింది కేంద్రమే-జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశానికి సంబంధించి ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులను కేంద్ర ప్రభుత్వమే తొలగించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. రాజధాని ఒకేచోట ఉండాలని, అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు పంచాలనేదే జనసేన విధానమని చెప్పారు. రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులకు అండగా నిలుస్తామన్నారు. వారి నుంచి భూములు తీసుకుని ఇప్పుడు ఇలా వ్యవహరిస్తే ఎలా అని నిలదీశారు. మొదటి నుంచి తాను రాజధాని రైతుల పక్షానే ఉన్నానని అన్నారు
*మోదీ సర్కారు వైఖరితో పౌరుల్లో అసహనం
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో దేశ పౌరుల్లో క్రమంగా అసహనం పెరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. మార్చిలో నిర్వహించే అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) జాతీయ మహాసభలకు సంబంధించి రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్‌) రాష్ట్ర ప్రతినిధుల మహాసభను హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కేంద్రం ఉల్లంఘిస్తోందని, ప్రజలపై ఆరెస్సెస్‌ భావజాలాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏఐవైఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు అఫ్తాబ్‌ ఆలంఖాన్‌, కార్యదర్శి తిరుమలై రామన్‌, టి.శ్రీనివాసరావు, అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
*ఆడపడుచుల అరెస్టు అరాచకం: తెదేపా
మహిళలు దేవాలయానికి నైవేద్యాలను తీసుకెళ్తుంటే పోలీసులు ఎందుకు లాఠీఛార్జీ చేశారని, ఆడపడుచులను అరెస్టు చేయడం అరాచక పాలనకు పరాకాష్ఠ అని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌, తెదేపా నేత వేమూరి ఆనందసూర్య అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో మాట్లాడుతూ..సంక్రాంతికి ఇళ్లకు సిరులు, ధాన్యాలు వచ్చే శుభసూచికంగా మహిళలు కనకదుర్గాదేవి ఆలయానికి సారె, నైవేద్యాలు సమర్పించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. పాలకులు విపత్కర ఆలోచనలతో ఏపీని భ్రష్టుపట్టించాలని అనుకుంటున్నారని ఆరోపించారు. అమరావతిని ప్రారంభించిన ముహూర్తం, జాతకం ప్రకారం ఏపీకి అదే రాజధానిగా కొనసాగుతుందన్నారు.
*సోనియా సమావేశానికి రాను: మమత
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ)లో హింసకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేస్తున్న ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది! దిల్లీలో ఈ నెల 13న ప్రతిపక్ష నేతలతో ఆమె నిర్వహించనున్న సమావేశానికి తాను హాజరు కాబోనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రకటించారు. వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతున్న కార్మిక సంఘాలు బుధవారం పిలుపునిచ్చిన బంద్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై ఆగ్రహించిన మమత ఈ మేరకు తన నిర్ణయాన్ని అసెంబ్లీ వేదికగా గురువారం వెల్లడించారు.
*రాజధానిని కదిలించే శక్తి ఎవరికీలేదు:చంద్రబాబు
ప్రజలందరూ సంఘటిత శక్తిగా మారాలని.. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలరని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మచిలీపట్నంలోని కోనేరు సెంటర్లో రాజధానిగా అమరావతికి మద్దతుగా ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అమరావతిని సాధించుకునే విషయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఒకే వేదికపై నిలబడి పనిచేస్తున్నాయన్నారు. ఐకాస ఏర్పాటు చేసి అన్ని పార్టీలు ఏకమయ్యాయని చెప్పారు. ప్రజలను చైతన్యవంతం చేయడానికి బస్సు యాత్ర తలపెడితే చివరి నిమిషంలో శాంతి భద్రతల సమస్య ఉందని పోలీసులు అనుమతి నిరాకరించడంపై మండిపడ్డారు. డీజీపీని కలిసి కోరినా బస్సు యాత్రకు అనుమతి ఇవ్వలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
*వారు విషసర్పాల వంటి వారు… ఉమా భారతి
కొందరు ఆలోచనా పరులు విషసర్పాల వంటి వారని కేంద్రమాజీ మంత్రి ఉమాభారతి అన్నారు. దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో ఆదివారం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలను గురించి ఆమె ఈ విధంగా స్పందించారు. విశ్వవిద్యాలయ వాతావరణాన్ని విషపూరితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘దేశంలో కొందరు ఆలోచనాపరులు విషసర్పాల వంటి వారు. వారి సంఖ్య తక్కువే అయినా చాలా ప్రమాదకరంగా ఉంటారు. వాతావరణాన్ని విషపూరితం చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని అంశాలను సరిచేయవలసి ఉంది…వాటిని సరిచేస్తాము…’’ అని ఉమాభారతి ప్రకటించారు.
*నిర్మలా సీతారామన్ ఎక్కడ..?: కాంగ్రెస్
భారత ప్రధాని నరేంద్రమోదీ ఆర్థికవేత్తలు, నీతి ఆయోగ్ నిపుణులు, పలువురు మంత్రులతో కలిసి ముందస్తు బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం దిల్లీలో నిర్వహించిన ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గైర్హాజరయ్యారు. ఆర్థికశాఖ సహాయమంత్రి పీయూష్ గోయల్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పాల్గొన్నారు. అయితే, కీలకమైన ఈ సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి హాజరుకాకుండానే సమావేశం నిర్వహించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ‘‘ఆర్థికశాఖ మంత్రి లేకుండానే బడ్జెట్ సమావేశం నిర్వహిస్తారా.? కనీసం వచ్చే సమావేశానికైనా ఆర్థిక మంత్రిని ఆహ్వానించే విషయంపై ఆలోచించండి’’ అని ట్విటర్ వేదికగా ఆరోపించింది. దీనికి ఫైండింగ్ నిర్మల పేరుతో ఒక హ్యాష్ట్యాగ్ పెట్టింది.
*పృథ్వీ.. ఏం మాటలవి? సిగ్గు పడాలి: పోసాని
అమరావతి రైతులపై సినీనటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. పొలం పనులు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్న రైతులను రోడ్డుకీడ్చావ్ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజల జీవితాలు బాగుపడతాయని భావించి ఏడాదికి మూడు పంటలు పండే భూముల్ని త్యాగం చేసిన రైతులను పెయిడ్ ఆర్టిస్ట్లు అంటావా? రైతులు ప్యాంటూ, షర్ట్ వేసుకోకూడదా? రైతు ఆడపడుచులు ఖరీదైన బట్టలు వేసుకోకూడదా? పంటలు పండే భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చిన మహిళలు రెండు బంగారు గాజులు వేసుకొనేందుకు కూడా అర్హులు కాదా? వాళ్లు ఫోన్ చేతిలో పెట్టుకొని మాట్లాడకూడదా? ఇలాంటి మాటలు అన్నందుకు నువ్వు సిగ్గుపడాలి
*అక్కడికీ ఇక్కడికీ పరిగెత్తాలా?: జేసీ
అమరావతిలో రాజధాని పెట్టినందుకే దూరాభారంతో బాధపడ్డామని, ఇప్పుడు తల ఒక చోట మొండెం ఒక చోట అన్నట్లు.. రాజధానిని ముక్కలు చేసి మరోచోటికి తీసెకెళ్తానంటే కుదరదని తెదేపా నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. ‘‘మనిషి శరీరానికి తల ఎంత ప్రధానమైందో రాష్ట్రానికి రాజధాని అంతే ప్రధానమైంది. తల నరికి ఇంకోచోట పెడతా అని జగన్ అంటున్నారు. ఆయన చాలా తెలివిగా వ్యవహరిస్తున్నా అనుకుంటున్నారు. తెలివి నీ ఒక్కడి సొంతం కాదు జగన్. అందరికీ ఉంటుంది. నువ్వు అనుకున్నట్టుగా చేయడం వీలు కాదు. మీరు తలకాయ అక్కడ పెడతా కాళ్లు ఇక్కడే ఉంచుతా.. చెయ్యి ఒకచోట.. కాలు ఒక చోట విసిరేస్తా అంటే.. మా పనుల కోసం ఇక్కడికీ.. అక్కడికీ పరుగెత్తాలా?’’ అని జేసీ ప్రశ్నించారు.
*రాజధాని ప్రజల్ని మోసం చేసిన జగన్-రేపు విశాఖ వాసుల్నీ ముంచుతారు: లోకేశ్
విపక్ష నేతగా అమరావతికి అంగీకారం తెలిపిన జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు మాట తప్పారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్నించారు. గురువారం ఆయన తుళ్లూరు, మందడంలోని దీక్షా శిబిరాలకు వచ్చారు. రైతుల ఆందోళనకు మద్దతు పలికారు. ఇప్పుడు అమరావతి ప్రజల్ని మోసం చేసిన జగన్ భవిష్యత్తులో విశాఖ, కర్నూలు ప్రజల్ని మోసం చేస్తారని హెచ్చరించారు. రాజధాని రైతుల్లో చిచ్చుపెట్టడానికి అప్పట్లో పంట పొలాలకు నిప్పు పెట్టిన వ్యక్తి ఇప్పుడు ఎంపీగా ఉన్నారన్నారు.
*విజయవాడలో పవన్ నిరసన కవాతు-తేదీ, మార్గ సూచి నేడు ఖరారు
రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి సంఘీభావంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో నిరసన కవాతు చేయనున్నారు. ఈ మేరకు పార్టీ నాయకుల నుంచి వచ్చిన ప్రతిపాదనకు ఆయన సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేశారు. శుక్రవారం జరిగే పార్టీ నేతల సమావేశంలో పూర్తి స్థాయి కార్యక్రమానికి రూపకల్పన చేయనున్నారు.
*నిరసన తెలిపే హక్కు వైకాపా కార్యకర్తలకేనా?-కళా వెంకటరావు
‘వైకాపా కార్యకర్తలకు ఒకలా.. ప్రజలకు మరోలా నిరసన తెలిపే హక్కు ఉంటుందా?’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు ప్రశ్నించారు. ఆ హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉంటుందని గతంలో చెప్పిన డీజీపీ.. ప్రతిపక్ష నేత చంద్రబాబును, అఖిలపక్ష నాయకులను, అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలను, అమరావతి ప్రాంత ప్రజలను ఎందుకు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన తెదేపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.
*ఉత్తరాంధ్ర ప్రయోజనాలకు వీధి పోరాటాలు: స్పీకర్
వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రయోజనాలకు శాసనసభాపతిగా కాకుండా ఈ ప్రాంత వాసిగా వీధి పోరాటాలకైనా సిద్ధమని శాసనసభాపతి తమ్మినేని సీతారాం చెప్పారు. శ్రీకాకుళంలో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో మాట్లాడారు.