DailyDose

తుళ్ళూరు రైతులకు సుప్రీంకోర్టు న్యాయవాదుల మద్దతు-తాజావార్తలు

Supreme Court Bar Coucil Extends Support To Tulluru Farmers

* సుప్రీం కోర్ట్ బార్ కౌన్సెల్ తుళ్లూరు కి వచ్చి రైతులకు మద్దతు తెలిపారు. మీ పోరాటానికి మేము అండగా ఉంటాము అని మాట ఇచ్చారు
* ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఈ నెల 20వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా హై పవర్‌ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాజధాని సహా రాష్ట్రం లో అభివృద్ధి వికేంద్రీకరణపై సభలో చర్చించే అవకాశం ఉంది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు నేతృత్వంలోని కమిటీ సిఫార్సులు, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ఇచ్చిన నివేదిక, గతంలో కేంద్రం వేసిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలోని అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అలాగే ఈ నెల 18న కేబినెట్‌ భేటీ కానుంది.
*నిర్భయ దోషులు ఇద్దరు వేసిన క్యురేటివ్‌ పిటిషన్లను ఈనెల 14న సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేయనుంది. జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ ఆర్‌ భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌తో కూడిన ఐదుగురి ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న దోషులు వినయ్‌ శర్మ, ముకేశ్‌ సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఉరిశిక్ష ముందు దోషులకు ఉన్న చిట్ట చివరి న్యాయపరమైన అవకాశం ఇదే కావడం గమనార్హం.
* అమరావతిలోని వెలగపూడిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల చేపట్టిన చినకాకాని రహదారి దిగ్బంధం కేసులో ఉన్నారంటూ పోలీసులు ఇంట్లోకి వచ్చారు. దీంతో ఆగ్రహించిన మహిళలు పోలీసులను అడ్డుకున్నారు. వారెంట్‌ లేకుండా ఇళ్లల్లోకి ఎందుకు వస్తున్నారంటూ నిలదీశారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
* రాజధాని గ్రామమైన మందడం శనివారం రణరంగాన్ని తలపించింది. గ్రామంలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు దాడి చేశారు. ర్యాలీని అడ్డుకునే ప్రయత్నంలో రైతులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మమ్మల్నే ఎదిరిస్తారా అంటూ పోలీసులు రైతులపై పిడిగుద్దులు కురిపించారు. మహిళలను జడలు పట్టుకుని లాగారు. వారిని ఈడ్చుకుంటూ వెళ్లి పోలీస్‌ వ్యాన్‌లో కుక్కారు. పోలీసులకు, రైతులకు జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. ఒక వృద్ధురాలి చేయి విరిగింది. ఆమెను 108 వాహనంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు
* సత్తెనపల్లి లక్ష్మీ థియేటర్లో సరిలేరు నీకెవ్వరు సినిమాకు తెల్లవారుజాము నుండి హీరో మహేష్ బాబు ఫ్యాన్స్ థియేటర్ ల దగ్గర బారులు తీరారు. బెనిఫిట్ షో అయిపోయిన అనంతరం ఫ్యాన్స్ ఆనంద0 లో మునిగితేలారు.
* మ‌రాడు మున్సిపాల్టీలో అక్ర‌మంగా నిర్మించిన అయిదు భారీ అపార్ట్‌మెంట్ల కూల్చివేత ప్రారంభ‌మైంది. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌రాడు ఫ్లాట్ల‌ను ధ్వంసం చేశారు.
* గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీ కోసం పంచాయతీరాజ్, పురపాలక శాఖ వేర్వేరుగా శుక్రవారం ప్రకటనలు జారీ చేశాయి. గ్రామ సచివాలయాల్లో 13 రకాలైన 14,061 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
* కనకదుర్గ గుడి ఈవో సురేష్ బాబు కు జాయింట్ కమిషనర్ గా పదోన్నతి..
* రాజధాని అమరావతి అంశంపై ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్‌షాకు అఖిలభారత హిందూ మహాసభ ప్రతినిధులు లేఖ రాశారు. రాజధాని విషయంలో సీఎం జగన్‌ విపరీత పోకడలకు నాంది పలికారని లేఖలో పేర్కొన్నారు
* రాజధాని ప్రాంతంతోపాటు కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలు ఆందోళనలు చేపట్టాయి.
* భారత్‌కు చెందిన విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను అరేబియా సముద్రంలో మోహరించారు. చైనా- పాకిస్తాన్‌లు సంయుక్తంగా సోమవారం నుంచి అరేబియా సముద్రంలో తొమ్మిది రోజుల పాటు భారీ నావికాదళ విన్యాసాలు చేపట్టనున్నాయి.
* సీఆర్డీయే యాక్ట్‌ ను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో అందరి ఆమోదంతో సీఆర్డీయే చట్టం రూపొందించినట్లు తెలిపారు.
* ఈ నెల 13 వతేదీన సోమవారం దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ శనివారం విడుదల చేసిన బులిటిన్‌లో హెచ్చరించింది.
* కృష్ణా జిల్లా కంచికచర్ల మం కీసర టోల్ గేటు వద్ద క్రాంతి సందర్భంగా తెలంగాణ నుండి ఆంధ్ర కు వస్తున్న రహదారులు రద్దీగా మారినది హైదరాబాద్, విజయవాడ 65 నెంబర్ జాతీయ రహదారిపై పలు టోల్ ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల రద్దీ
కీసర టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు
* రాజధాని గ్రామమైన మందడం శనివారం రణరంగాన్ని తలపించింది. గ్రామంలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు దాడి చేశారు. ర్యాలీని అడ్డుకునే ప్రయత్నంలో రైతులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.
* అవినీతి కేసులో అరస్టైన ఇన్‌స్పెక్టర్‌ బలవంతయ్య ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. బలవంతయ్య రెండున్నర నెలలుగా జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు బలవంతయ్యను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. బలవంతయ్య ఇంటితో పాటు బంధువులు, మిత్రుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని ఎల్బీనగర్‌లో గల బలవంతయ్య నివాసంతో పాటు అతని సోదరుడు, సోదరి ఇళ్లలో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్‌లో హోటల్‌ యజమానుల నుంచి డబ్బు తీసుకోవడం, పలు సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు.
*రాజధాని అమరావతి అంశంపై ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్‌షాకు అఖిలభారత హిందూ మహాసభ ప్రతినిధులు లేఖ రాశారు. రాజధాని విషయంలో సీఎం జగన్‌ విపరీత పోకడలకు నాంది పలికారని లేఖలో పేర్కొన్నారు.
*తెలంగాణలో పెండింగు పారిశ్రామిక ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించింది. పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ దిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను గురువారం రాత్రి ప్రత్యేకంగా కలిసి దీనిని అందజేశారు.
*ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదుల కోటా నుంచి నలుగురు నియమితులయ్యారు. ఆర్‌.రఘునందన్‌రావు, బట్టు దేవానంద్‌, దొనాడి రమేశ్‌, నైనాల జయసూర్యల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా నియమితులైనవారితో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరింది.
*సూర్యాపేట జిల్లాలోని పలు గ్రామాల్లో శుక్రవారం స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మేళ్లచెరువు మండలం రామాపురం, రేవూరు, హేమ్లాతండా, చింతలపాలెం మండలం దొండపాడు గ్రామాల పరిధిలో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో రెండు, మూడు సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.
*ఈశాన్య రుతుపవనాలు వెళ్లిపోవడంతో వర్షాలు పడలేదని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.రాష్ట్రంలో చలితీవ్రత పెరుగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఆదిలాబాద్‌ జిల్లా బేల, లోకరి గ్రామాల్లో 10.8, ఆదిలాబాద్‌లో 13.8, హైదరాబాద్‌లో 19.2, రామగుండంలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
*పరిపాలనా విధుల్లో అంకిత భావంతో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించాలని సచివాలయ సహాయ సెక్షన్‌ అధికారుల(ఏఎస్‌వో)కు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా సూచించారు. శుక్రవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో.. కొత్తగా సచివాలయ ఏఎస్‌వోలుగా ఎంపికైన 51 మంది అధికారుల ఫౌండేషన్‌ కోర్సు ముగింపు కార్యక్రమం జరిగింది.
*జాతీయ స్థాయిలో మరోసారి పెద్దపల్లి జిల్లా స్వచ్ఛతలో మెరిసింది. పల్లెల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం మెరుగు పరిచి పరిసరాల పరిశుభ్రత పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛత దర్పణ్‌-2020 పురస్కారాల్లో పెద్దపల్లి జిల్లాకు చోటు దక్కింది. జిల్లాలో ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడుగుంత, పంచాయతీకొక సామూహిక శౌచాలయం నిర్మించడంతోపాటు వాటికి జియోట్యాగింగ్‌ పూర్తి చేశారు. ఆదివారం(ఈ నెల 12న) దిల్లీలో జరిగే కార్యక్రమంలో కలెక్టర్‌ శ్రీదేవసేన ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారు. జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న పంచసూత్రాలపై పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ శ్రీదేవసేన తెలిపారు.
*ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు చేగూరులో సహజ్‌ మార్గ్‌ ఆధ్యాత్మిక ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనేందుకు వచ్చే ప్రతినిధుల కోసం షాద్‌నగర్‌, వికారాబాద్‌ రైల్వే స్టేషన్లలో దక్షిణ మధ్య రైల్వే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తాత్కాలికంగా ఆపనుంది. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 4 వరకు మైసూరు-కాచిగూడ, కాచిగూడ-మైసూరు, చెంగల్‌పట్టు-కాచిగూడ, కాచిగూడ-చెంగల్‌పట్టు రైళ్లు షాద్‌నగర్‌ స్టేషన్‌లో, ముంబయి సీఎస్టీ- భువనేశ్వర్‌, భువనేశ్వర్‌- ముంబయి సీఎస్టీ రైళ్లు వికారాబాద్‌లో ఆగుతాయని ఒక ప్రకటనలో పేర్కొంది.
*జ్యోతిష శాస్త్రంలో వివిధ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ర్టాలాజికల్ సైన్సెస్ ప్రతినిధి రామచంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జ్యోతిష ప్రవీణ, విశారద కోర్సులలో చేర గోరే అభ్యర్థులు 9246348354, 9989088111 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు.
*శ్రీహరికోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 24 వరకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన ఉపగ్రహ నమూనాలు, ప్రదర్శించనున్నారు. విద్యార్థులకు టెక్నాలజీపై స్ఫూర్తిదాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీహరికోట సతీష్దావన్ స్పేస్ సెంటర్ ఇన్స్ట్రుమెంటేషన్ డిప్యూటీ జీఎం ఎన్.విజయ్కుమార్ చెప్పారు.
*జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లకు సంబంధించిన గత నెల వేతనాలు ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 680 మంది వలంటీర్లకు రూ.8.16 కోట్ల వేతనాలు విడుదలయ్యాయి.
*జీరో ఎఫ్ఐఆర్లను నమోదు చేయడంలో హైదరాబాద్ సిటీ టాప్గా నిలిచింది. దిశ ఘటన అనంతరం విస్తృత చర్చ జరిగి… బాధితుల ఫిర్యాదు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ కొన్ని సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డయల్ 100, జీరో ఎఫ్ఐఆర్లపై దృష్టి సారించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు తమ పరిధి కాదంటూ తప్పించుకోరాదని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
*ప్రతిష్ఠాత్మక సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు అవసరమైన వైద్యసేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకూ జాతర జరగనున్న రోజుల్లో మేడారంలో 50 పడకలతో ప్రత్యేక ఆసుపత్రిని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. దానికి సమ్మక్క సారలమ్మ వైద్యశాలగా నామకరణం చేస్తారు. వైద్యసేవల్లో పాల్గొనేందుకు 120 మంది వైద్యులు, 30 మంది మహిళా వైద్యులు, 530 మంది పారామెడికల్ సిబ్బందిని ఇక్కడ నియమించనుంది.
*అమరావతి కోసం రైతుల ఆందోళనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తుళ్లూరులో గురువారం మహిళలు, రైతులు రోడ్డుపై బైఠాయించారు. 23వ రోజు దీక్షల్లో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మహిళలు నిరసన తెలిపారు. రాజధాని ప్రకటన వచ్చేవరకూ నిరసనలు కొనసాగిస్తామన్నారు. తుళ్లూరు, మందడం మహా ధర్నాకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వచ్చి మద్దతు తెలిపారు.
*ఆగకుండా కొన్ని నిమిషాలపాటు భీకరమైన శబ్దాలు వినపడడంతో భయాందోళనకు గురైనట్లు ఇరాక్లోని కుర్దిస్థాన్ రీజియన్కి సమీపంలో పనిచేస్తున్న తెలుగువారు, వారి కుటుంబీకులు, తెలంగాణ ఎన్ఆర్ఐ విభాగానికి సమాచారం ఇస్తున్నారు. ఇరాన్, అమెరికా దేశాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
*జేఈఈ మెయిన్ పేపర్-1 ఫలితాలు ఈనెల 20లోపే వెల్లడవుతాయని సమాచారం. జనవరి ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు పేపర్-1 పరీక్షలు జరిగాయి. వాటిని నిర్వహించిన జాతీయ పరీక్షల నిర్వహణ మండలి(ఎన్టీఏ) మాత్రం గతంలో జనవరి 31లోపు ఫలితాలు(పర్సంటైల్) వెల్లడిస్తామని ప్రకటించింది
*రాష్ట్రంలోని గ్రామీణ తాగునీటి శాఖ పరిధిలో పని చేస్తున్న వారిలోని 15 మంది పంపు మెకానిక్లకు ప్రభుత్వ ఉద్యోగుల కనీస స్కేలును అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. వేతనాలను పెంచాలంటూ వీరంతా వేసిన రిట్ పిటిషన్లను విచారించిన హైకోర్టు.. 2019, అక్టోబరులో మధ్యంతర ఉత్తర్వులిస్తూ.. వారికి రెగ్యులర్ ఉద్యోగుల కనీస స్కేలును వర్తింప జేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. వీరికి 2015 పీఆర్సీలోని కనీస స్కేలు మాత్రమే అందుతుందని, అంతే తప్ప ఉద్యోగాలను క్రమబద్ధీకరించటం, ఇతర భత్యాలు, వార్షిక ఇంక్రిమెంట్ల చెల్లింపులు ఉండబోవని పేర్కొంది.
*ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఆన్లైన్ సమస్యలతో సతమతమవుతున్నారు. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో విలీన గ్రామాల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు ముగుస్తున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా డీపీఎంఎస్ వెబ్సైట్లో సమస్యలు వస్తున్నాయి.గురువారం వెబ్సైట్ పూర్తిగా మొరాయించింది.
* రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గ కేంద్రమైన సిరిసిల్లలో జేఎన్టీయూహెచ్ ఏర్పాటు చేయతలపెట్టిన ఇంజినీరింగ్ కళాశాలకు వచ్చే రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు. జేఎన్టీయూహెచ్లో ప్రస్తుతం నాలుగు వర్సిటీ కళాశాలలున్నాయి. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, మంథనిలో ఇప్పటికే రెండు పనిచేస్తున్నాయి.
*విప్లవ రచయితల సంఘం(విరసం) 50 ఏళ్ల ఉత్సవాలను ఈ నెల 11, 12 తేదీల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ జర్నలిస్టు పిన్నపాక ఫణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
*ధన ప్రభావంతో రాజకీయాలు కలుషితం కావటంతోపాటు విధ్వంసకరంగా మారాయని ఎన్నికల సంఘం మాజీ ముఖ్య ఎన్నికల కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తి అన్నారు.ఎన్నికల సంఘంతోనే సంస్కరణలు సాధ్యం కావని, రాజకీయ పార్టీలు కలిసి రావాలని, ప్రజలు చైతన్యవంతులు కావాలని అభిప్రాయపడ్డారు.
*టీఆర్టీ-2017లో వ్యాయాయ విద్య ఉపాధ్యాయ(పీఈటీ- తెలుగు మాధ్యమం) కొలువులకు ఎంపికైన వారికి పోస్టులు కేటాయించేందుకు ఈనెల 16న ఆయా జిల్లాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయకుమార్ కాలపట్టికను విడుదల చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 11 నుంచే మొదలవుతుంది. తొలిరోజు ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లా వెబ్సైట్లో, నోటీసు బోర్డుల్లో ప్రదర్శిస్తారు. 16న అభ్యర్థులను కౌన్సెలింగ్కు పిలిచి ఏ పాఠశాలల్లో పనిచేయాలో పోస్టింగ్ ఇస్తారు. మొత్తం 370 ఖాళీలు ఉండగా ఇప్పుడు 364 మందికే కొలువులు ఇస్తారు.
*మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో భాగంగా పాఠశాలల విద్యార్థులకు అందించాల్సిన ఆహార పదార్థాలకు సంబంధించి ప్రభుత్వం కొత్త మెనూ సిద్ధం చేసింది. గురువారం చిత్తూరులో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ వివరాలను ప్రకటించారు.
*అమరావతి నుంచి రాజధానిని మార్చకపోతే ఉత్తరాంధ్రలో విప్లవం వస్తుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గురువారం రాత్రి విశాఖలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘రాష్ట్రమంటే అమరావతిలోని 29 గ్రామాల ప్రజలే అన్నట్లు చంద్రబాబు అండ్ కో ప్రవరిస్తున్నారని మండిపడ్డారు.
*అమరావతి పరిరక్షణ సమితి ఐక్య కార్యాచరణ సమితి కేంద్ర కార్యాలయాన్ని పోలీసులు గురువారం రాత్రి మూసివేశారు. తాళాలు వేసి పహారా ఏర్పాటుచేశారు. అంతకుముందు విజయవాడ నగరం నడిబొడ్డున బెంజి సర్కిల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని అక్కడి నుంచి తరలించాలని హుకుం జారీచేశారు.
*ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20న నిర్వహించనున్న పరీక్ష పే చర్చ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి 28 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. దిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొంటారు. ఏపీ నుంచి ఆన్లైన్ పరీక్షలో 4,455 మంది పాల్గొనగా 28 మందిని ఎంపిక చేశారు. వీరిలో 16మంది బాలికలు ఉన్నారు.
*కృష్ణా జిల్లా నందిగామలోని వివిధ కళాశాలలకు పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. ‘‘కళాశాలల్లో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల తలెత్తే పరిణామాలతో వారిపై క్రిమినల్ కేసులు నమోదైతే వారి భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే విద్యార్థులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తున్నాం’’ అంటూ నందిగామ ఇన్స్పెక్టర్ పేరుతో కళాశాలలకు నోటీసులు జారీ అయ్యాయి. మరోవైపు ఉద్దండరాయునిపాలెం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకూ శుక్రవారం పాదయాత్ర చేపట్టాలని రాజధాని ప్రాంత మహిళలు తలపెట్టారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవని.. పాదయాత్రలో ఎవరైనా పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గుంటూరు గ్రామీణ జిల్లా పోలీసులు గురువారం ప్రకటన విడుదల చేశారు.
*రాజధానిపై ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ రెండో సమావేశం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సీఆర్డీఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరగనుంది. రాజధాని రైతులను సంతృప్తి పరిచేలా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. కమిటీ తొలి సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది.
*రాష్ట్రంలో ఉచిత నివాస స్థలాల పంపిణీ కోసం అర్హులైనవారు 20.71 లక్షల మంది ఉన్నట్లు తాజాగా రెవెన్యూశాఖ తేల్చింది. మలి విడత పరిశీలన ద్వారా పట్టణాల్లో 10,04,414, గ్రామీణ ప్రాంతాల్లో 10,67,113 మంది అర్హులైనవారు ఉన్నట్లు వెల్లడించింది
*విశాఖపట్నంలోని రెండో, మూడో అదనపు సీబీఐ కోర్టులను కర్నూలు, విజయవాడకు తరలించే నిమిత్తం సీఆర్పీసీ చట్టం ప్రకారం గతంలో జారీ చేసిన ప్రకటనల్ని సవరిస్తూ (రివైజ్డ్).. అవినీతి నిరోధక చట్టం(పీసీ యాక్ట్)లోని సెక్షన్ 3(1) ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది.