Fashion

హీల్స్ ధరించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

High Heels Fashion Wearing Tips & Tricks

హీల్స్ ధరించేటప్పుడు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు., ముఖ్యంగా మొదటి సారి వేసుకున్నప్పుడు. కాబట్టి, ఇక్కడ చెప్పిన 6 టెక్నిక్స్ పాటించండి.. దీంతో ఎలాంటి సమస్యలు ఎదురుకావు..అమ్మాయిలు ఎక్కువగా మెచ్చేవి ఏవైనా ఉన్నాయి అంటే, అవి కచ్చితంగా హీల్స్ అని చెప్పొచ్చు. ఇవి ఎంత ఫాషనబుల్ గా ఉంటాయో, వీటిని మెయింటెయిన్ చేయడం అంత కష్టంగా ఉంటుంది. కానీ ప్రతి మహిళా తన వార్డ్‌రోబ్‌లో ప్రధానంగా ఉంచే వస్తువులలో ఈ హీల్స్ కూడా ఒకటి. ఈ హీల్స్ తమ డ్రెస్సులకు అంచున ఉన్నా కూడా, ప్రపంచాన్ని సైతం ఆకర్షించగలుగుతాయి.మీరు హీల్స్ వేసుకునే ప్రతిసారీ కొన్ని సమస్యలను తరచుగా ఎదుర్కొంటూ ఉంటారు. కానీ, కొన్నిటెక్నిక్స్ పాటించడం ద్వారా, ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు. మీకు ముఖ్యంగా హీల్స్ ధరించడం ఇష్టమైతే, ఈ కింది చిట్కాలను పాటించండి.
**బకిల్స్, స్ట్రాప్స్‌ గట్టిగా ఉండేవి ఎంచుకోండి..
బకిల్స్, స్ట్రాప్స్ ఉండేలా హీల్స్ కొనడానికి ప్రయత్నించండి. ఇవి మీ పాదాలకు అవసరమయ్యేలా అదనపు మద్దతును అందిస్తాయి. అంతేకాకుండా, బొబ్బలకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లు, చికాకును కూడా తగ్గిస్తాయి. క్రమంగా హీల్స్ వినియోగాన్ని సులభంగా చేస్తుంది.
*చంకీ హీల్స్ తీసుకోండి..
పెన్సిల్ హీల్స్ మీకు కష్టంగా ఉన్నట్లయితే, చంకీ లేదా బ్లాక్ హీల్స్ ట్రై చేయండి. అవి కొంచం విశాలంగా ఉన్నందున, అవి మీ బరువును సమానంగా హీల్స్ మీద విస్తరిస్తాయి. క్రమంగా మీ పాదాలపై ఒత్తిడి తగ్గుతుంది.
*జాగ్రత్త అవసరం..
మీరు ఏదైనా కొత్త జత హీల్స్, కొనుగోలు చేసినప్పుడల్లా, సాక్స్‌ ధరించి మీ ఇంటి చుట్టూ నడవడం చేయండి. క్రమంగా, మీరు వీటికి అలవాటు పడుతారు. అంతేకాకుండా, భవిష్యత్తులో వాటిని ధరించడాన్ని ఈజీ చేస్తుంది. ఈ అలవాటు చిరాకును తగ్గించి, బొబ్బలు ఏర్పడకుండా చూస్తాయి.
*ఫిట్‌గా ఉండేలా..
షూస్, బట్టలు వంటివి, వేర్వేరు బ్రాండ్లు, వేర్వేరు సైజ్‌ల్లో లభ్యమవుతాయి. మీకు, ఒక నిర్దిష్ట బ్రాండ్‌లో వాటి సైజ్ ఆరు అయితే, వేరే బ్రాండ్స్ లో ఆ సైజ్ వేరేదిగా ఉండొచ్చు. కాబట్టి, వాటిని కొనడానికి ముందు మీ అడుగుల పరిమాణాన్ని ఖచ్చితంగా కొలవండి. సరైన సైజ్‌లో తీసుకోకపోతే, సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
*నడిచే ప్లేస్ కూడా ముఖ్యమే..
దీన్ని మీరు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కాని మీరు స్నీకర్లను వేసుకుని నడిచేలా, హీల్స్‌ వేసుకుని నడవడం కుదరదు. ఇవి లేకుండా నడవడం, లేదా ఎక్కువ సేపు వీటిని ధరించడం కారణంగా మడమలు నొప్పి సమస్య ఎదురవుతుంది. అంతేకాకుండా మీరు మొదటి సారి వీటిని వేసుకున్నట్లయితే, మీ నడకలో కూడా మార్పు ఉంటుంది. కాబట్టి, నిటారుగా నిలబడి, మీ కాళ్ళు, నడుమును కొద్దిగా బిగించి నడవండి. ముఖ్య విషయం ఏమిటంటే, వీటిని ధరించి బయటకు వెళ్లే ముందు ప్రాక్టీస్ తప్పనిసరి. ఇది దీర్ఘకాలంగా మీకు సహాయపడుతుంది.
*యాంటీ బ్లిస్టర్ స్టిక్..
ఇది ముందు జాగ్రత్త అని చెప్పొచ్చు. ఇది అవసరమైన సమయంలో మీకు ఖచ్చితంగా సాయపడుతుంది. అంతేకాకుండా, ఇది బొబ్బలు ఏర్పడిన ప్రాంతంలో సమస్య లేకుండా చూస్తుంది. దీన్ని సెన్సిటివ్ భాగాలలో అప్లై చేయొచ్చు. క్యారీ చేయడం చాలా ఈజీ. అంతేకాకుండా, అత్యవసర పరిస్థితుల్లో ఫార్మసీకి వెళ్లవలసిన అవసరం లేదు కూడా..