Movies

అత్యద్భుత క్యాలెండర్ రూపొందించిన నటీమణులు

The prettiest naam calendar 2020 is all in here

12 మంది ప్రతిభావనులు..45 రోజులు.. 25 మంది కళాకారులు కలిసి చేసిన అద్భుతం ఇది. అలనాటి రవివర్మ చిత్రాలని మరిపించేలా ‘నామ్‌’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ క్యాలెండర్‌ ఒంటరి మహిళలకు చేయనివ్వనుంది. నాలుగేళ్లక్రితం మాట. ఖుష్భూ. రవివర్మ చిత్రంలా మారి తీయించుకున్న ఓ ఫొటో అది. సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటో విపరీతంగా వైరల్‌ అయ్యింది. ఆ స్పందన నుంచి వచ్చిన ఆలోచనే నేటి ఈ రవివర్మ క్యాలెండర్‌ అంటారు నామ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు, నటి సుహాసిని. అయితే ఈ క్యాలెండర్‌ అంత తేలిగ్గా రూపుదిద్దుకోలేదట. నటీమణులని సంప్రదించడం మొదలుకుని… ఆ కాలంనాటి నగలు వెతికి పట్టుకోవడానికి, అచ్చం రవివర్మ నాయికల్లానే చూపించడానికి చాలా కష్టపడ్డామంటారు ఈ చిత్రాలను తీసిన ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ జి.వెంకట్‌రామ్‌. ఇంతకీ ఈ కష్టమంతా ఎందుకంటే… ఒంటరి మహిళలకు చేయూతనివ్వడానికే. ఈ క్యాలెండర్‌ను అమ్మగా వచ్చిన డబ్బుని…నామ్‌ స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం పొందుతున్న మహిళలకు అందివ్వడం విశేషం. ఈ క్యాలెండర్‌లో సమంత, శృతిహాసన్‌, రమ్యకృష్ణ, ఖుష్బూ, మంచులక్ష్మీ, ఐశ్వర్య రాజేష్‌, నదియా, శోభనచోటుదక్కించుకున్నారు.

‘19వ శతాబ్దంనాటి సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ చిత్ర లేఖనాల్లో మహిళలు ధరించిన వస్త్రాలు, ఆభరణాలను ఎంపిక చేయడం ఒకెత్తైతే, ఆ వాతావరణాన్ని సహజసిద్ధంగా చిత్రీకరించడం మరో ఎత్తు. క్యాలెండర్‌లోని 12 నెలలకు 11 మందిని ఎంపిక చేయడానికి చాలా కష్టపడ్డాం. సమంత ఫొటో షూట్‌ హైదరాబాద్‌లోనే చేయగా, తక్కినవారిది చెన్నైలో పూర్తి చేశాం. అప్పటి పట్టు చీరలకు నేటి నేతకు తేడా ఉంది. అంతేకాదు, అంచులు చాలా దళసరిగా ఉండటంతో తొమ్మిది అడుగుల చీరను ఎంపిక చేసి, వాటికి అంచుల్ని విడిగా కలిపాం. దుస్తులు, ఆభరణాలు, మేకప్‌, బ్యాక్‌గ్రౌండ్‌తోపాటు ఆర్ట్‌డైరెక్టర్లతో ఆయా వాతావరణాన్ని గీయించాం. డే లైట్స్‌ను వాడకుండా, కేవలం ఫ్లాష్‌లైట్లలో చిత్రీకరించాం’ అని వసుంధరకు తెలిపారు ఫొటోగ్రాఫర్‌ వెంకట్‌రామ్‌. నటి, నృత్యకారిణి శోభన ఫొటోషూట్‌కే అయిదారు గంటలు పట్టింది. చిన్నారిని చంకనెత్తుకుని, పక్కనే నిలిచిన కుక్కపిల్లను ఫొటోలో పొందుపరచడం వెనుక చాలా శ్రమ ఉంది. ఆ కుక్కను పోలిన కుక్కను తీసుకురావడం కోసం చాలా కష్టపడ్డామని వివరించారు సుహాసిని. ఇందులో ట్రావెన్‌కోర్‌ మహారాణిగా నటించిన చాముండేశ్వరి నటి కాదు, మోడల్‌ కూడా కాదు. నామ్‌ సంస్థ ద్వారా చేయూతనందుకుంటున్న ఓ బాధితురాలు. మా ఎన్జీవోలో మహిళలు మహారాణులు అని చూపాలనే ఆమెకు ఈ క్యాలెండర్‌లో స్థానం ఇచ్చాం. రవివర్మ చిత్రాల్లో మహిళల ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. అందుకే వాటికి ప్రాధాన్యతనందించి మహిళాశక్తిని చాటుతున్నట్లుగా ఉండేలా క్యాలెండర్‌ను రూపొందించాం’ అని తెలిపారు సుహాసిని.

Recreating Raja Ravi Varma With South Actresses By G Venket Ram For Naam Calendar 2020 - Gallery