Food

ఈ కూరగాయల్లో కూడా అధిక ప్రోటీన్

These veggies have more protein competing with meat products

మాంసాహారంలోనే కాదు శాకాహారంలోనూ మాంసకృత్తులు ఉంటాయి. అవి ఎక్కువ పరిమాణంలో ఉన్న వాటిని తెలుసుకుని క్రమం తప్పక తింటూ ఉంటే బలవర్ధకంగా ఉండవచ్చు.
*చిక్కుళ్లు:
ఒక కప్పు చిక్కుళ్లలో 15 గ్రాములు ప్రొటీన్లు ఉంటాయి. పీచు, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు మొదలైన ఖనిజ లవణాలు చిక్కుళ్లలో ఉంటాయి. ఈ పోషకాలు సమృద్ధిగా అందాలంటే చిక్కుళ్లను వేయించకుండా ఆవిరి మీద ఉడికించుకుని లేదా కూరగా, స్టిర్ ఫ్రై రూపంలో తినాలి.
*సబ్జా:
0 గ్రాముల సబ్జాలో 4 గ్రాములు ప్రొటీన్ ఉంటుంది. క్యాల్షియం, ఫైబర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం కూడా సబ్జాలో ఉంటాయి. స్మూదీ, సలా డ్స్, సూప్స్ లేదా నీళ్లలో నానబెట్టి తీసుకోవచ్చు.
*క్వినోవా:
ఒక కప్పు క్వినోవాలో 8 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. వీటిలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీసు కూడా ఉంటాయి. అన్నం బదులుగా తినవచ్చు.