Food

నాడీ సమస్యలకు సగ్గుబియ్యంతో చెక్

Saabu Daana Helps Neurologically

చాలామంది ఉపవాసం ఉన్న సమయాల్లో ఎక్కువగా సాబుదానాను ఆహారంగా తీసుకుంటుంటారు. సాబుదాన తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తరచూ ఆహారంలో దీనిని తీసుకుంటే ఏమేం లాభాలు కలుగుతాయంటే..సాబుదానాలో ఉండే ప్రొటీన్లు కండరాల వృద్ధికి ఉపయోగపడుతాయి. బలాన్ని అందిస్తాయి. మరోవైపు వీటిలో ఉండే ప్రొటీన్లకు నయం చేసే గుణాలతో పాటు కణాల విధులను మెరుగుపరిచే గుణాలూ ఉంటాయి.ఇందులో క్యాల్షియం, ఐరన్, విటమిన్ కె ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజూవారీ అలసట తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. రోజూ 50 గ్రాములు తినడం వల్ల రక్తహీనత సమస్యలు తలెత్తవు. వీటిలోని పొటాషియం స్థాయిలు రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి గుండెపై ఏర్పడే ఒత్తిడిని తగ్గిస్తాయి. సాబుదానలో ఫోలిక్ ఆసిడ్, విటమిన్ బి ఉంటాయి. గర్భిణులు వీటిని రోజూ తినడం వల్ల పుట్టబోయే బిడ్డలకు ఆరోగ్యం చేకూరుతుంది. శిశువులకు నాడీ సంబంధ లోపాల నియంత్రణలోనూ సాబుదాన బాగా పనిచేస్తుంది.తరచూ సాబుదాన తింటుంటే మలబద్దకం, అజీర్ణం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు తొలిగిపోతాయి. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయి నియంత్రణలో ఉంటుంది. నీరసంగా, బలహీనంగా ఉన్నవారు తరచూ సాబుదాన తింటే సత్వర శక్తిని పొందుతారు.తక్కువ కేలరీలతో ఎక్కువ శక్తినిచ్చే ఆహారంగా సగ్గుబియ్యాన్ని చెప్పవచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్లు అధికం. అందుకే శక్తినిచ్చే డ్రింకుల్లోనూ, బ్రెడ్ ఐటమ్స్లోనూ వీటినే ఎక్కువగా వాడుతుంటారు. వీటిని రోజూవారీ ఆహారంలో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.