Movies

ఫిక్షన్-పదుకోన్

Prabhas To Star With Deepika Padukone For Next Fiction Movie

‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్రభాస్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ జానర్లో ఈ సినిమా ఉండబోతోందట. ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకోన్ పేరు వినిపిస్తోంది. అశ్వనీ దత్ నిర్మాణంలో ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నారు. దీపికా పదుకోన్ అయితే ఈ సినిమాకు బావుంటుందని ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట చిత్రబృందం. ఒకవేళ దీపిక ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తే ఇదే తన తొలి తెలుగు సినిమా అవుతుంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి